Begin typing your search above and press return to search.

వైశ్రాయ్ ఎపిసోడ్ పై బాలయ్యకు చంద్రబాబు సూటి ప్రశ్న

By:  Tupaki Desk   |   11 Oct 2022 4:19 PM GMT
వైశ్రాయ్ ఎపిసోడ్ పై బాలయ్యకు చంద్రబాబు సూటి ప్రశ్న
X
మాస్ కా బాప్, నందమూరి నటసింహం బాలకృష్ణ హీరో హోస్ట్ గా వ్యవహరిస్తోన్న 'అన్ స్టాపబుల్' టాక్ షోకు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఈ నెల 14 నుంచి ఈ షో రెండో సీజన్ మొదలు కాబోతోంది. ఇక, ఈ రెండో సీజన్ తొలి ఎపిసోడ్ కు టీడీపీ అధినేత, ఏపీ మాజీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గెస్ట్ గా రావడంతో ఈ ఎపిసోడ్ పై విపరీతమైన హైప్ ఏర్పడింది.

ఆ హైప్ ను మరింత పెంచేలా ఈ ఎపిసోడ్ కు సంబంధించిన ప్రోమోను ఆహా టీం తాజాగా విడుదల చేసింది. బాల చంద్రుల సరదా సంభాషణతో మొదలైన ఈ ప్రోమో...పోను పోను రాజకీయ వ్యవహారాలతో వేడి రాజేసింది. ఈ ఎపిసోడ్ లో చంద్రబాబుపై బాలయ్య పలు ప్రశ్నలు సంధించారు. అందుకు, చంద్రబాబు కూడా మునుపెన్నడూ లేని విధంగా నవ్వుతూ..సరదాగా సమాధానమిచ్చారు.

‘‘ఫస్ట్ షోకు నా బంధువును పిలుద్దామనుకున్నా...కానీ, ఆయన ప్రజలందరి బంధువు...అందుకే ఆయనను పిలిచాము...మీకు బాబుగారు..నాకు బావగారు...లెట్స్ వెల్ కమ్ ఒన్ ఆఫ్ ది టాలెస్ట్ టీడర్స్ ఆఫ్ ది పాలిటిక్స్...శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు...’’ అని బాలయ్య అనగానే ఆ హాల్ అంతా విజిల్స్, చప్పట్లు, కేరింతలు, కేకలతో దద్దరిల్లిపోయింది. ఇక, అభిమానులకు అభివాదం చేస్తూ చంద్రబాబు ఇచ్చిన ఎంట్రీ అదిరిపోయింది.

తనకు రెండు ఫ్యామిలీస్ ఉన్నాయని బాలయ్య అన్నారు..ఒకటి రోడ్ నంబర్ 45లో...ఇంకోటి...అని బాలయ్య సెటైరిక్ గా అనగానే ..వసుంధరకు కూడా చెబుతా ఫోన్ చేసి..అని చంద్రబాబు అనడంతో అక్కడ నవ్వులు పూసాయి.

ఇక, బాలయ్య కంటే తాను ఎక్కువ రొమాన్స్ చేశానంటూ చంద్రబాబు రొమాంటిక్ గా ఇచ్చిన సమాధానం ఆహూతులను పడి పడి నవ్వేలా చేసింది. బెస్ట్ ఫ్రెండ్ ఎవరు అని అడిగితే... వైఎస్ఆర్ తనకు మిత్రుడని చంద్రబాబు గుర్తు చేసుకున్నారు.

ఇక, ఈ షో సందర్భంగా 1995 ఎపిసోడ్ పై కూడా చంద్రబాబు స్పందించారు. ఆ రోజు మనం చేసింది తప్పా..? అని బాలకృష్ణను చంద్రబాబు అడిగారు. ఏది ఏమైనా బావా బామ్మర్దులైన ఈ బాల చంద్రుల మధ్య ఈ ఎపిసోడ్ ఆహా అనిపించేలా సోషల్ మీడియాలో వైరల్ అయింది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.