Begin typing your search above and press return to search.
రసిక టేపుల ఇష్యూలో మాజీ మంత్రి పీఏ అరెస్ట్
By: Tupaki Desk | 5 Sept 2016 4:36 PM ISTదేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఆమ్ ఆద్మీ సర్కారులో మంత్రిగా వ్యవహరిస్తున్న సందీప్ కుమార్ రసిక టేపుల ఎపిసోడ్ లో మరో పరిణామం చోటు చేసుకుంది. ఇద్దరు మహిళలతో కలిసి అభ్యంతరకర రీతిలో ఉన్న ఆయనపై పార్టీ అధినేత.. ముఖ్యమంత్రి కేజ్రీవాల్ వేటు వేయటం తెలిసిందే. ఈ సీడీ బయటకు వచ్చిన నేపథ్యంలో.. ఆమ్ ఆద్మీ తీవ్రంగా ఇబ్బందిపడుతోంది.వాళ్లు.. వీళ్లుఅన్న తేడా లేకుండా రాజకీయపక్షాలన్నీ తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్న వేళ.. సమాధానం చెప్పుకోలేక సతమతమవుతోంది.
ఇదిలా ఉంటే.. ఈ టేపులో ఉన్న మహిళ ఒకరు బయటకు వచ్చి.. తనకు రేషన్ కార్డు ఇప్పిస్తానని పిలిపించి.. మత్తుమందుతో ఉన్నకూల్ డ్రింక్ ఇచ్చి తనను రేప్ చేసినట్లుగా పోలీసులకు ఫిర్యాదు చేయటం తెలిసిందే. ఈ నేపథ్యంలో మంత్రి పర్సనల్ సెక్రటరీని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సెక్స్ టేపుల్ని పంపిణీ చేసిన ఆరోపణల్ని మంత్రి పీఏ ఎదుర్కొంటున్నారు. మంత్రి రసిక టేపుల్ని పీఏనే పంపిణీ చేసినట్లుగా చెబుతున్నారు. పీఏను అదుపులోకి తీసుకున్న పోలీసులు ఈ వ్యవహారంపై ప్రశ్నిస్తున్నట్లు తెలుస్తోంది. అతగాడు నోరు విప్పితే.. మంత్రిగారి కథంతా బయటకు వచ్చేఅవకాశం ఉందన్న వాదన వినిపిస్తోంది.