Begin typing your search above and press return to search.

మడతపెట్టెయ్యొచ్చు అంటున్న శాంసంగ్!

By:  Tupaki Desk   |   11 Nov 2016 1:00 PM GMT
మడతపెట్టెయ్యొచ్చు అంటున్న శాంసంగ్!
X
ప్రపంచంలో అతిపెద్ద స్మార్ట్ ఫోన్ మేకర్ శాంసంగ్ ప్రతిష్టాత్మకంగా లాంచ్ చేసిన గెలాక్సీ నోట్ 7 బ్యాటరీ వైఫల్యం వల్ల పోయిన ఆర్ధిక నష్టాన్ని, బ్రాండ్ పేరుని తిరిగి నిలబెట్టుకునే క్రమంలో కొత్త ఆలోచనలకు తెరలేపింది శాంసంగ్. ఈ క్రమంలో వచ్చే ఏడాది నుంచి మడతపెట్టుకోగల శాంసంగ్ స్మార్ట్ ఫోన్ లు మార్కెట్ లోకి అడుగుపెట్టనున్నాయి. ఈ మేరకు ఆ సంస్థ కొరియన్ ఇంటె లెక్చువల్ ప్రాపర్టీ ఆఫీసులో పేటెంట్ హక్కుల దరఖాస్తును పూర్తి చేసింది.

చాలా ఏళ్లు డిస్ ప్లేను మడుచుకోగల ఫోన్లను అందుబాటులోకి తీసుకురావడం కోసం శాంసంగ్ ఎంతో కాలంగా శ్రమిస్తోందట.. అయితే తాజాగా ఆ ప్రయత్నం సక్సెస్ ఫుల్ గా పూర్తయిందని, అన్నీ అనుకూలంగా జరిగితే... 2017లో మార్కెట్ లోకి ఆ ఫోన్ లను తీసుకొస్తామని జీ.ఎస్.ఎం.ఏ ఎరెనా సంస్థ తెలిపింది. అయితే, ఇలా మడత పెట్టుకోవడానికి అనుకూలంగా ఉండే ఈ రానున్న ఫోన్ ను "గెలాక్సీ 10"గా పిలవనున్నారు. ఈ ఫోన్ లో బ్యాక్ బటన్ కుడివైపు, మెనూ బటన్ ఎడమవైపు, హోం బటన్ ఈ రెండింటి మధ్యలో ఉండనుంది.

కాగా, గెలాక్సీ నోట్ 7 ఫోన్లతో పాటు - వాషింగ్ మెషిన్లూ కూడా పేలిపోవడంతో అన్నిరకాలుగానూ ఎంతో నష్టపోయిన శాంసంగ్ పై మెషిన్ల పనితీరులో లోపాలు వచ్చాయని ఆరోపణలు రావడంతో మరింతగా ఉక్కిరిబిక్కిరి అయ్యింది. ఈ సమయంలో శాంసంగ్ సగానికి మడతవేసుకోగల స్మార్ట్ ఫోన్లను మార్కెట్ లోకి తీసుకురావడం ద్వారా ఉపశమనం పొందాలని భావిస్తోంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/