Begin typing your search above and press return to search.

ఆ పార్టీ వల్ల ఆస్తులు అమ్ముకున్నాం.. రోజాను హింసించారు: సెల్వమణి

By:  Tupaki Desk   |   19 Oct 2021 5:30 PM GMT
ఆ పార్టీ వల్ల ఆస్తులు అమ్ముకున్నాం.. రోజాను హింసించారు: సెల్వమణి
X
సినిమాల్లో గ్లామర్ నటిగా.. రాజకీయాల్లో ఫైర్ బ్రాండ్ గా.. టీవీ షోల్లో కామెడీ యాక్టర్ గా పలు పాత్రలను పోషిస్తున్న రోజా ఓ ప్రత్యేకమైన మహిళగా గుర్తింపు పొందారు. రాజకీయాల్లో ఆమె మాటల పదునుకు ప్రతిపక్షాలకు షాక్ తినేట్లు చేస్తున్నారంటే రోజా వ్యాక్చాతుర్యమేంటో అర్థం చేసుకోవచ్చు. ఒక మహిళగా తాను వివిధ పాత్రలను పోషించిన రోజా ఫ్యామిలీ లైఫ్లోనూ చాలా హాయిగా జీవిస్తోంది. ఆమె ఇంతటి పేరు ప్రఖ్యాతలు పొందడానికి ఆమె భర్త సెల్వమణి ప్రోత్సాహం కూడా ఎంతో ఉంది. సినీ డైరెక్టర్ అయినా సెల్వమణి రోజా నిర్ణయాలను ఎప్పుడూ కాదనలేదు. అందుకే ఆమె ఎన్నుకున్న ప్రతీ రంగంలో విజయం సాధిస్తూ వస్తున్నారు. సినిమాల్లో అన్ని రకాల పాత్రలు పోషించిన రోజా రాజకీయాల్లోకి ఎలా వచ్చారు..? మొదట టీడీపీలో ఉన్న ఆమె వైసీపీలోకి మారడానికి కారణం ఏంటి..? ఆమె భర్త సెల్వ మణి చెప్పిన ఆసక్తి విషయాలు మీకోసం..

‘సినిమాల్లో నుంచి రాజకీయాల్లోకి వెళ్లిన వారు చాలా మందే ఉన్నారు. ఎన్టీఆర్ హయాంలో చాలా మంది సినీ నటులు టీడీపీలో చేరి సక్సెస్ ఫుల్ లీడర్ గా అనిపించుకున్నారు. ఎన్టీఆర్ తరువాత చంద్రబాబు పగ్గాలు చేపట్టిన తరువాత కూడా సినీ ఇండస్ట్రీకి చెందిన వారు రాజకీయాల్లో కొనసాగారు. ఓ సమయంలో నిర్మాత శివప్రసాద్ నటి రోజా వద్దకు వెళ్లి చంద్రబాబు బహిరంగ సభలో మాట్లాడాలని కోరారు. కానీ ఈ అమ్మాయి ఏం మాట్లాడుతుంది అని అనుకున్నాను. కానీ శివ ప్రసాద్ గారు ఒప్పించి రోజాను బహిరంగ సభకు తీసుకెళ్లి మట్లాడించారు. దీంతో నేను కూడా ఆశ్చర్యపోవాల్సి వచ్చింది. రోజా ఇంత బాగా మాట్లాడుతుందని అస్సలు అనుకోలేదు. ’ అని తెలిపారు.

‘ఇక ఆ తరువాత ప్రతీ చంద్రబాబు సభలో రోజా మాట్లాడుతూ వచ్చారు. అలా కొన్ని రోజుల తరువాత రోజా మాటలు నచ్చిన చంద్రబాబు తనను రాజకీయాల్లోకి రావాలని కోరారు. దీంతో మనకు రాజకీయాలెందుకు.. ? అని అనుకున్నాం.కానీ ఒకడుగు వేసి చూద్దామని ఒప్పుకున్నారు. దీంతో రోజా టీడీపీ తరుపున ప్రచారం చేసింది. అయితే ఆ తరువాత రెండు సార్లు టికెట్ ఇచ్చినా రోజా ఓడిపోయారు. అయితే మొదటి సారి తాను రాజకీయాల్లో కొత్తగా రావడంతో పాటు ప్రజలను ఆకర్షించలేకపోయారు. ’

‘కానీ రెండోసారి పోటీ చేసినప్పుడు అసలు విషయం మాకు అప్పుడు అర్థమైంది. రోజాను ఓడించింది ప్రజాలు కాదు.. అని సొంత పార్టీ నాయకులేనని. అవును... ఇక్కడి కుల రాజకీయాల వల్లే రోజా ఓడుతూ వస్తోంది. ఈ విషయం గురించి చంద్రబాబును కలిసి చెప్పి వివరించాం. అయితే అక్కడి పరిస్థితుల దృష్ట్యా తానేం చేయలేనని చంద్రబాబు చెప్పారు. దీంతో రోజా రెండో సారి కూడా ఓడిపోయారు. చంద్రబాబు నాకు వ్యక్తిగతంగా చాలా బాగా నచ్చుతాడు. అయితే రెండో సారి ఓడిపోవడానికి చంద్రబాబే కారణమని అనకపోయినా సొంత పార్టీ నాయకులే అని కచ్చితంగా చెప్పగలం’

‘అప్పటి వరకు టీడీపీలో ఉండి వైఎస్ రాజశేఖర్ రెడ్డిపై ఆరోపణలు చేసిన రోజా ఒకసారి తనను కలిస్తే బెటరని నిర్ణయించుకుంది. నేను కూడా ఒప్పుకున్నారు. అయితే కేవలం 10 నిమిషాల్లోనే వైఎస్సార్ చెప్పిన మాటలకు రోజా మారిపోయింది. నాకు పార్టీలో పదవి లేకపోయిన పర్వాలేదు. కానీ రాజశేఖర్ రెడ్డి హయాంలో ఉంటానని చెప్పింది. వాస్తవానికి మాకు కాంగ్రెస్ అంటే అస్సలు పడదు. కానీ వైఎస్ రాజశేఖర్ రెడ్డి కోసం రోజా కాంగ్రెస్లో చేరాల్సి వచ్చింది. ఇక ఆ తరువాత రోజాకు మంచి రోజుల వచ్చాయి. అయితే రాజకీయాల్లో కులాల కుంపట్లు ఎలాగూ ఉంటాయి. వాటిపై పార్టీ అధినేత దృష్టిపెడితే మంచి నాయకులు పుట్టొకస్తారు’ అని సెల్వమణి రోజా రాజకీయ జీవితం గురించి వివరించారు.