Begin typing your search above and press return to search.
ఆర్జీవీ వైసీపీ అధికార ప్రతినిధా...?
By: Tupaki Desk | 2 May 2023 12:40 PM GMTఆర్జీవీ షార్ట్ కట్ ఆయన అసలు పేరు రామ్ గోపాల్ వర్మ. అంటే రాముడూ క్రిష్ణుడూ ఆయనే అన్న మాట. ఆయన మాటలలో చేతలలో అలా చిలిపితనం తో పాటు తెంపరితనం కూడా ఒక్కోమారు బయటపడుతూంటుంది. లాజిక్ లకు పెట్టింది పేరు పుట్టినిల్లూ కూడా ఆర్జీవీనే అని చెప్పాలి. ఆయన లాజిక్కులకు మాటల మాజిక్కులకు ఆన్సర్ చెప్పలేక అంతా బాబోయ్ ఆర్జీవీ అనేస్తారు.
ఆర్జీవీ ఒకనాడు అంటే మొట్టమొదట్లో రాముగా ఉంటూ బుద్ధిగా ఎన్నో మంచి సినిమాలు తీశారు. తరువాతనే ఆయన తీరూ అవతారూ మారింది. సరే నా సినిమా నా ఇష్టం అనే ఆర్జీవీతో ఎవరూ గొడవ పెట్టుకోరు. అసలు ఆయన గొడవ ఆయన సినిమాలు ఎపుడూ అలా ఉంటూనే ఉంటాయి. ఆర్జీవీ తెర వెనక దర్శకుడు. తెర ముందు మాత్రం తానే హీరో అంటారు.
ఆయన సినిమాలలో రాజకీయం దట్టించి మసాలాలు అంటించి చివరికి తానే రాజకీయ నేతగా మారిపోయారా అంటే ఏమో అది ఆయనకే తెలియదేమో. ఆర్జీవీ నేచర్ బట్టి చూస్తే ఆయన ఏ పార్టీకి చెందని మనిషే అనుకోవాలి. ఎందుకంటే ఆయన ఒపీనియన్స్ కన్యాశుల్కం లో గిరీశం చెప్పినట్లుగా ఎప్పటికపుడు చేంజ్ అవుతూనే ఉంటాయి.
అయితే ఇక్కడ తమాషా ఏంటి అంటే ఆర్జీవీ ఎన్ని ఒపీనియన్స్ చేంజ్ చేసుకున్నా చేంజ్ చేసుకోనిది ఆయన వల్ల కానిదీ ఒకటేనేమో. అదే బాబు మీద వ్యతిరేకత. అది ఆయనకు ఎలా వచ్చింది బాబు మీద రాజకీయ చిత్రాలు తీసి తీసీ జీర్ణించుకుని పోయిందా లేక సహజంగానే 1995 నాటి ఎన్టీయార్ వెన్నుపోటు ఎపిసోడ్ ఆర్జీవీని నిజంగా కదిలించిందా అన్నది ఎవరికీ అర్ధం కాని పెద్ద డౌట్.
నాకు ఏ సెంటిమెంట్లూ ఆయింట్లుమెంట్లూ లేవని బోల్డ్ గా చెప్పుకునే ఆర్జీవీకి నిజానికి ఇలాంటివి పట్టకూడదే. కానీ ఆయనకు మాత్రం ఎన్టీయార్ ని చంద్రబాబు వెన్నుపోటు పొడిచిన తీరు పట్ల మాత్రం ఆగ్రహం అలాగే ఉండిపోయిందనుకోవాలేమో. పైగా దాని కంటే కూడా బాబు అన్నా చినబాబు ఆర్జీవీ పరిభాషలో పప్పు మీద ఒక లెక్కలో కోపం అలా ఉండిపోయిందేమో అనుకోవాలి.
ఇక ఆర్జీవీకి జగన్ అంటే ఇష్టమట. ఇది కూడా చిత్రమైన విషయమే. ఎందుకంటే ఆర్జీవీకి తాను తప్ప ఎవరూ ఇష్టం ఉండరని ఇప్పటికి ఎన్నో సార్లు గుండె విప్పి మరీ చెప్పుకున్న బాపతాయే. అయినా జగన్ అంటే ఇష్టమని చెప్పారు. అలాగే చంద్రబాబు అంటే కోపం. ఈ రెండు మాత్రం ఎంతటి ఆర్జీవీకి అయినా వీడని ఎమోషన్స్ గా ఉండిపోయానుకోవాలి. అలా ఏ ఎమోషన్ కి పడని ఆర్జీవీ ఈ ఇద్దరి దగ్గర పడిపోయారు.
అందుకే ఆయనకు చంద్రబాబు మీద కామెంట్స్ చేయడం అంటే భలే సరదా. ఆయన మీద హాట్ హాట్ కామెంట్స్ పెట్టాలంటే ఆర్జీవీ ముందుకు వచ్చేస్తారు. నిజంగా ఆర్జీవీ కామెంట్స్ ని ఏ వైసీపీ నేత కూడా పెట్టలేడు, అసలు అలాంటి థాట్ కూడా ఊహించలేడు. అందుకే దటీజ్ ఆర్జీవీ అని చెప్పాల్సి వస్తుంది.
ఇక ఏపీలో రజనీకాంత్ విజయవాడకు వచ్చి బాబుని పొగిడిన తరువాత ఒక రచ్చ అయితే రాజకీయంగా టీడీపీ వైసీపీ వారి మధ్యన సాగుతోంది. ఆఖరుకి ఇది ఎంతవరకూ వెళ్ళిందంటే చంద్రబాబు జోక్యం చేసుకుని శిఖరం లాంటి రజనీకాంత్ మీద వైసీపీ నేతలు కామెంట్స్ చేస్తారా అని ఆవేశంతో ఊగిపోయారు
అక్కడే ఆయన ఆర్జీవీకి అడ్డంగా దొరికేశారు. దాంతో తన ట్విట్టర్ కి పని చెప్పి పదుని పెట్టి మరీ ఆర్జీవీ ఘాటైన కామెంట్స్ వరసబెట్టి చూస్తూ పోయారు. రజనీ మీద చేసిన కామెంట్స్ ఎన్టీయార్ ని చంపిన దాని కన్నా ఎక్కువా బాబూ ని సూటిగా అడిగేశారు. మీరు ఎన్టీయార్ ని చంపేశారు అని డైరెక్ట్ గానే అనేశారు. ఆన్సర్ టూ మై క్వశ్చన్ అన్నట్లుగానే ఆర్జీవీ వెన్నుపోటు ఎపిసోడ్ ని తెచ్చి మరీ బాబుని మరోమారు కడితేశారు, అడిగేశారు.
ఇదంతా పక్కన పెడితే ఆర్జీవీ వైసీపీ అధికార ప్రతినిధా అన్న చర్చ కూడా వస్తోంది. వైసీపీ టీడీపీ వారి మధ్య సవా లక్ష సమరాలు సాగుతాయి వారిని వీరు వీరిని వారు అనుకుంటారు. మధ్యలో దూరి ఆర్జీవీ వైసీపీ తరఫున వకాల్తా పుచ్చుకోవడమేంటి అన్న వారు ఉన్నారు.
కానీ ఆర్జీవీ థియరీ అది కాదు, అక్కడ ఎవరు అన్నారు, ఎవరిని అన్నారని కూడా కాదు, ఆయన టార్గెట్ బాబు ఆయన వెన్నుపోటు ఎపిసోడ్ దాని మీద ఆయన మార్క్ హాట్ కామెంట్స్. ఎందుకంటే ఎన్టీయార్ వెండితేర దేవుడు. ప్రజా నాయకుడు. ఆయన చనిపోయినా చరిష్మా అలాగే ఉంది. దాంతో అన్న గారి వెన్నుపోటుని ఎప్పటికపుడు గుర్తు చేస్తూ బాబుని అలా గుచ్చేయడమే ఆర్జీవీ మార్క్ రామూయిజం అని అన్న వారూ ఉన్నారు. అదన్న మాట మ్యాటర్.