Begin typing your search above and press return to search.
అగ్రరాజ్యాలకు మోడీ మరో షాక్
By: Tupaki Desk | 30 Oct 2015 10:23 AM ISTనిన్నమొన్నటి వరకూ దేశ రాజకీయాల్లో తన ప్రభావాన్ని చూపించి నరేంద్ర మోడీ దీర్ఘకాలిక రాజకీయాలపై దృష్టి సారించారు. ఇందిరాగాంధీ తర్వాత విదేశాంగ విధానంలో పెద్దగా ప్రభావం చూపించని భారత ప్రధానులకు భిన్నంగా మోడీ చెలరేగిపోతున్నారు. ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి తరచూ విదేశీ పర్యటనలు చేస్తూ.. భారత్ ను ఒక బ్రాండ్ గా ప్రమోట్ చేయటంతో పాటు.. దాని వెనుక తాను ఉన్నానన్న విషయాన్ని చెప్పకనే చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. విదేశాంగ విధానంలో స్పష్టమైన వైఖరిని ప్రదర్శించని భారత్ కారణంగా.. పలు దేశాలతో సన్నిహిత సంబంధాలు అంతంతమాత్రంగా ఉన్న పరిస్థితి. భవిష్యత్తులో అగ్రరాజ్యంగా ఎదగాలన్న తపన పుష్కలంగా ఉన్నప్పటికీ.. 130 కోట్ల మంది జనాభా ఉన్న దేశం.. పలు చిన్న దేశాలకు పెద్దన్నలా వ్యవహరించాలన్న వ్యూహాన్ని ఇప్పటివరకూ ఎవరూ అమలు చేయలేదు.
ఆ లోటును తీరుస్తూ మోడీ ఇప్పుడు చెలరేగిపోతున్నారు. మొన్నటికి మొన్న బ్రెజిల్.. జర్మనీ లాంటి శక్తివంతమైన దేశాలు ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో ఉండాలని పిలుపునిచ్చిన ఆయన.. తాజాగా ఆఫ్రికాదేశాల ప్రాతినిధ్యం లేని ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి ఒక భద్రతామండలేనా అన్న వాదనను తెర మీదకు తెచ్చారు. ప్రపంచ జనాభాలో రెండో అత్యధిక జనాభా ఉన్న దేశంగా ఉంటూ.. అలీన విధానాన్ని అనుసరిస్తూ.. శాంతికి చిహ్నంగా ఉండే భారత్ ను ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో శాశ్విత సభ్య దేశ హోదా ఇవ్వటం కొన్ని అగ్రరాజ్యాలకు సుతారం ఇష్టం లేదు.
భద్రతామండలిలో మాకు స్థానం ఎందుకివ్వరని బలంగా అడిగేందుకు కూడా గత ప్రధానులు ధైర్యం చేసే వారు కాదు. మన తరఫున ఎవరూ వకల్తా పుచ్చుకునే పరిస్థితి లేదు. కొన్ని దేశాలు మొక్కుబడితో.. భారత్ ను భద్రతా మండలిలో స్థానం కల్పించాలని ఏ దేశాధినేత అయినా ప్రకటిస్తే.. అదే గొప్ప విజయంగా ఫీలయ్యే పరిస్థితి. ఇలాంటి ప్రకటనల వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదని తెలిసినా.. ఆయా ప్రభుత్వాలు అంతకు మించి ఎలాంటి ప్రయత్నం చేసింది లేదు.
అయితే.. దీనికి భిన్నంగా మోడీ మాత్రం వ్యూహాత్మకంగా ముందుకు వెళుతున్నారు. భారత్ కు భద్రతామండలిలో స్థానం ఇవ్వరన్న మాటను నేరుగా అడగకుండా.. జర్మనీ.. బ్రెజిల్ లాంటి దేశాల ప్రాతినిధ్యం లేకుండా ఎలా ఉంటుందని బలంగా వాదనను వినిపిస్తూ.. ఆయా దేశాల చేత భారత్ గురించి మట్లాడించిన మోడీ.. ఇప్పుడు ఆఫ్రికా ఖండానికి చెందిన ఒక్క దేశం కూడా భద్రతామండలిలో స్థానం లేకపోవటం ఎంత దారుణమన్నట్లుగా మాట్లాడారు. ప్రపంచంలో అత్యంత వెనుకబడిన ఆఫ్రికా దేశాల గురించి పట్టించుకోని నేపథ్యంలో భారత్ లాంటి వేగంగా అభివృద్ధి చెందే దేశం.. తమ గురించి.. తమ ఉనికి గురించి మాట్లాడటానికి మించిన సంతోషం ఆ దేశ నాయకులకు మరేం ఉంటుంది..? అందుకే.. మోడీ చేసిన ప్రకటన వారిని విపరీతమైన ఆనందానికి గురి చేసింది. ఈ మాటలతో పాటు.. ఆఫ్రికా దేశాలకు భారత్ 1000కోట్ల డాలర్ల రుణాన్ని.. మరో 60కోట్ల డాలర్ల గ్రాంట్ ను ప్రకటిస్తూ ఆఫ్రికా దేశాలకు తన స్నేహహస్తాన్ని చాటారు.
కొన్న అగ్రదేశాల గుత్తాధిపత్యంలో నడుస్తున్న ఐక్యరాజ్యసమితిని సమూలంగా మార్చేయాలన్న వాదనను బలంగా వినిపించారు. అందుకు అందరం కలిసికట్టుగా పని చేద్దామన్న పిలుపునివ్వటం ద్వారా.. చిన్న దేశాలకు భారత్ నాయకత్వం వహించేందుకు సిద్ధంగా ఉందన్న మాటను మోడీ చెప్పకనే చెప్పేశారు. ప్రపంచంలోని పలు దేశాల్ని కూడగట్టుకొని ఐక్యరాజ్య సమితిలో సంస్కరణల కోసం పోరుబాట పట్టనున్నానన్న మోడీ సందేశం అగ్రరాజ్యాలకు షాక్ కలిగించేదే. ఇంతకాలం సాగిన తమ గుత్తాధిపత్యాన్ని ప్రశ్నించేలా? మోడీ కదుపుతున్న పావులు.. ఆయన వేగం.. అగ్రరాజ్యాలకు అర్థం కావటం కాస్త కష్టంగా ఉందని చెప్పక తప్పదు.