Begin typing your search above and press return to search.
అన్నిచోట్లా కౌంటింగ్ పురానాపూల్ లో పోలింగే
By: Tupaki Desk | 4 Feb 2016 11:50 AM ISTగ్రేటర్ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా జరిగిందని చెప్పినా.. పాతబస్తీలో రచ్చరచ్చగా మారిన సంగతి తెలిసిందే. తమ ఆటలు సాగని చోట మజ్లిస్ నేతలు ఎంతలా చెలరేగిపోయారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సాక్ష్యాత్తు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ రథసారధిని కారులో నుంచి బయటకు లాగి కొట్టటం.. షబ్బీర్ అలీ లాంటి సీనియర్ కాంగ్రెస్ నేతను కారులో నుంచి బయటకు లాగి.. పిడిగుద్దులు గుద్దిన తీరును అంత తేలిగ్గా ఎవరూ మర్చిపోలేరు.
మధ్యాహ్న వేళ. చుట్టూ పోలీసులు ఉంటేనే మజ్లిస్ అధినేత అసదుద్దీన్ ఓవైసీ ఇంతలా రెచ్చిపోతే.. మరి ఎవరూ లేకుండా ఉంటే సదరు నేతల పరిస్థితి ఇంకెలా ఉండేదో..? ఈ మొత్తం ఘటనకు కారణమైన పురానాపూల్ డివిజన్ లో పోలింగ్ ఇష్టారాజ్యంగా మారిన వేళ.. ఈ విషయాన్ని తెలంగాణ విపక్షాలు ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్లాయి. ఈ నేపథ్యంలో జరిగిన ఉదంతాన్ని తెలుసుకున్న ఎన్నికల సంఘం అధికారులు ఈ డివిజన్ లో రీపోలింగ్ కు ఆదేశాలు జారీ చేశారు. ఈ రీపోలింగ్ లో దాదాపు 34 వేల మంది ఓటర్లు తమ ఓటుహక్కును మరోసారి వినియోగించుకోనున్నారు.