Begin typing your search above and press return to search.

పీకే ఫోన్‌!... ర‌ఘువీరా నో రిప్లై!

By:  Tupaki Desk   |   13 Feb 2018 4:35 PM IST
పీకే ఫోన్‌!... ర‌ఘువీరా నో రిప్లై!
X
ఏపీకి కేంద్రం చేస్తున్న అన్యాయంపై వాస్త‌వాల‌ను నిగ్గు తేల్చుదామంటూ రంగంలోకి దిగిపోయిన టాలీవుడ్ ప‌వ‌ర్ స్టార్‌ - జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్‌ కు ఆదిలోనే హంస‌పాదులా పెద్ద దెబ్బే త‌గిలింద‌ట‌. మొన్న‌టికి మొన్న మీడియా స‌మావేశం పెట్టి మ‌రీ... ఏపీకి జ‌రుగుతున్న అన్యాయంపై తీవ్ర స్థాయిలోనే అస‌హ‌నం వ్యక్తం చేసిన ప‌వ‌న్‌... అటు బీజేపీ స‌ర్కారుతో పాటు ఇటు టీడీపీ స‌ర్కారు చెబుతున్న మాట‌ల‌ను ప్రస్తావించారు. ఒకే అంశానికి సంబంధించి కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ఓ మాట‌... రాష్ట్రంలో అధికారంలో ఉన్న టీడీపీ మ‌రోమాట ఎలా చెబుతాయ‌ని ప‌వ‌న్ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. అయినా తాను రంగంలోకి దిగుతున్నాన‌ని, తాను ఏర్పాటు చేయబోయే జేఎఫ్‌ సీ క‌మిటీ ప‌రిశీల‌న‌లో ఎవ‌రి మాట నిజ‌మే ఇట్టే తేల్చేస్తాన‌ని కూడా ఆయ‌న చెప్పారు. అంతేకాకుండా మీడియా స‌మావేశంలోనే సీనియ‌ర్ రాజ‌కీయ‌వేత్త - మాజీ ఎంపీ ఉండ‌వల్లి అరుణ్ కుమార్‌ - లోక్ స‌త్తా అధినేత జ‌య‌ప్ర‌కాశ్ నారాయ‌ణ‌ల పేర్ల‌ను ప్ర‌స్తావించిన ప‌వ‌న్‌... వారిద్ద‌రితో భేటీ అయ్యారు. వారిద్ద‌రి నుంచి కూడా ఆయన సానుకూల స్పంద‌న‌నే రాబ‌ట్ట‌డంలో స‌ఫ‌ల‌మ‌య్యార‌నే చెప్పాలి. పిలిచిన వెంట‌నే త‌న‌కు మ‌ద్ద‌తు ప‌లికిన సీనియ‌ర్ల వైఖ‌రితో మ‌రింత జోష్‌ తో ముందుకు సాగుదామ‌ని భావించిన ప‌వ‌న్‌... నిన్న ఓ పెద్ద ప‌రిణామానికే శ్రీ‌కారం చుట్టారు.

కాస్తంత ఆల‌స్యంగా వెలుగులోకి వ‌చ్చిన ఈ ప‌రిణామం... ప‌వ‌న్‌ కు పెద్ద షాకే ఇచ్చింద‌ట‌. అయినా ఆ ప‌రిణామం ఏమిట‌న్న విష‌యానికి వ‌స్తే.. ఏపీకి అన్యాయంపై గ్రాండ్ ఓల్డ్ పార్టీ కాంగ్రెస్ కూడా బాగానే పోరు సాగిస్తోంది. రాజ్య‌స‌భ‌లో ఆ పార్టీ స‌భ్యులు కేవీపీ రామ‌చంద్రారావు అలుపెర‌గ‌ని పోరు సాగిస్తుంటే... పీసీసీ చీఫ్ గా ఉన్న మాజీ మంత్రి ర‌ఘువీరారెడ్డి కూడా త‌న‌దైన స్టైల్లో పోరు సాగిస్తున్నార‌నే చెప్పాలి. ఈ పోరులో భాగంగా ఆయ‌న మొన్న ఢిల్లీకి వెళ్లి అక్క‌డే ఆందోళన‌కు దిగ‌డంతో పాటుగా ప్ర‌ధానికి పెద్ద లేఖాస్త్రాన్నే సంధించి వ‌చ్చారు. ఈ క్ర‌మంలో ఏపీకి న్యాయం కోసం పోరాటం చేస్తున్న ర‌ఘువీరా త‌న పోరాటానికి కూడా మ‌ద్ద‌తుగా నిలుస్తార‌ని ప‌వ‌న్ భావించార‌ట‌. ఈ నేప‌థ్యంలో అనుకున్న‌దే త‌డ‌వుగా ఫోనెత్తుకుని ర‌ఘువీరా మొబైల్‌కు రింగ్ చేశార‌ట‌. అయితే ఊహించ‌ని విధంగా ప‌వ‌న్ ఫోన్‌ కు ర‌ఘువీరా క‌నీసం రిప్లై కూడా ఇవ్వ‌లేద‌ట‌. ఫోన్ రింగ‌వుతున్నా... ర‌ఘువీరా దానిని లిఫ్ట్ చేయ‌కుండా ప‌వ‌న్‌ ను లైట్ తీసుకున్న‌ట్లుగా స‌మాచారం. అయితే ప‌ట్టువ‌ద‌ల‌ని విక్ర‌మార్కుడికి మ‌ల్లే... ర‌ఘువీరా ఫోన్ లిఫ్ట్ చేయ‌క‌పోతే త‌న‌కేమీ ప్ర‌త్యామ్నాయం లేదా? అన్న కోణంలో ఆలోచించిన ప‌వ‌న్‌... నేరుగా ర‌ఘువీరా స‌తీమ‌ణి సునీత‌కు కాల్ చేశారట‌.

ర‌ఘువీరా మాదిరిగా కాకుండా ప‌వ‌న్ కాల్‌ ను లిఫ్ట్ చేసిన సునీత‌... ప్ర‌స్తుతానికి ర‌ఘువీరా ఫోన్‌ లో మాట్లాడే మూడ్‌ లో లేర‌ని - త‌ర్వాత చేయ‌మ‌ని చెప్మ‌పేసి కాల్ క‌ట్ చేశార‌ట‌. దీంతో షాక్ తిన్న ప‌వ‌న్‌... అస‌లు త‌న కాల్‌ను ర‌ఘువీరా ఎందుకు లిఫ్ట్ చేయ‌లేద‌న్న కోణంలో అంతర్మ‌థ‌నంలో ప‌డిపోయార‌ట‌. కేవ‌లం ఫోన్ కాల్‌ కే స్పందించ‌ని ర‌ఘువీరా ఇక త‌న ఉద్య‌మానికి ఏం స‌హ‌క‌రిస్తార‌న్న కోణంలోనూ ప‌వ‌న్ డైల‌మాలో ప‌డిపోయిన‌ట్లుగా స‌మాచారం. అయితే నిన్న ప‌వ‌న్ ఫోన్ చేసిన స‌మ‌యంలో ర‌ఘువీరా త‌న బ‌ర్త్ డే సెల‌బ్రేష‌న్స్‌ లో ఉన్నార‌ని, త‌న బ‌ర్త్ డే నాడు ర‌ఘువీరా... త‌న ఇంటి వారితో మిన‌హా మిగిలిన ఏ ఒక్క‌రిని కూడా ఎంట‌ర్ టైన్ చేయ‌ర‌ని కాంగ్రెస్ వ‌ర్గాలు చెబుతున్నాయి. అయినా ఓ కీల‌క రాజ‌కీయ నేత‌గా ఉన్న ర‌ఘువీరా.. బ‌ర్త్ డేల నాడు అంత నిక్క‌చ్చిగా ఉండ‌క‌పోయినా... ప‌వ‌న్‌ కు మ‌ద్దతు ఇచ్చే విష‌యంలో ఇష్టం లేక‌నే ఆయ‌న ఫోన్ కాల్‌ను తిర‌స్క‌రించిన‌ట్లుగా వార్త‌లు వెలువ‌డుతున్నాయి.