Begin typing your search above and press return to search.
కార్డులకే దిక్కులేదు.. సోషల్ పోరాటమా?
By: Tupaki Desk | 7 Aug 2017 9:46 AM ISTఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక హోదా అనే ఆలోచన ప్రజల్లో లేకుండా తెలుగుదేశం పార్టీ నాయకులు చాలా వ్యూహాత్మకంగా దాన్ని చంపేశారు. హోదా గురించి ప్రజలు ఆలోచించకుండా.. ప్రజలు పట్టించుకోకుండా వదిలేసేలా చంద్రబాబు అండ్ కో సుదీర్ఘకాలం ప్రచారం నిర్వహించి.. ప్రజల్లో హోదా కోరికను చల్లార్చేశారు. అయినా సరే... తమకు చేతనైనంతలో హోదా గురించి వైఎస్సార్ కాంగ్రెస్ ప్రజా ఉద్యమాలను నిర్వహిస్తూనే ఉంది. కాకపోతే.. కాంగ్రెస్ పార్టీ తమ అస్తిత్వాన్ని కాపాడుకోవడానికి హోదా అనే మాటను ఓ పాయింటులాగా వాడుకుంటోంది. రాజకీయంగా అవసరమైనప్పుడు ‘మేం ఎప్పుడో ఇచ్చేశాం’ అంటూ మాటలు చెబుతూ నెట్టుకొస్తోంది. తమకు ప్రజల్లో ఆదరణ లేకపోయినా సరే.. హోదా కోసం ఉద్యమాలు అంటూ మాయ చేస్తోంది.
కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రత్యేక హోదా కోసం అంటూ.. రఘువీరా రెడ్డి గతంలో మోడీకి మట్టి శాంపుల్స్ పంపమంటూ ఓ ఉద్యమానికి రాష్ట్రవ్యాప్త పిలుపు ఇచ్చారు. ఏపీలో ప్రస్తుతం కాంగ్రెస్ పరిస్థితి దారుణంగా ఉంది. వారికి ఓట్లు వేసే దిక్కే లేదు. వారు చెప్పారని , కేంద్రానికి మట్టి పంపే వారెవరుంటారు? అది కాస్తా ఫెయిలయింది. ఆ తర్వాత రఘువీరా పోస్టు కార్డులు రాయమంటూ మరో ఉద్యమానికి పిలుపిచ్చారు దానికి కూడా అతీ గతీ లేదు. ప్రజలు తాము పిలుపు ఇచ్చాం కదాని.. అర్ధరూపాయి ఖర్చు పెట్టడానికి కూడా సిద్ధంగా లేరని రఘువీరాకు అర్థమైంది. ఇప్పుడు ఆయన హోదా కోరుతూ ప్రధాని మోడికి రాఖీలు పంపాలంటూ పిలుపు ఇస్తున్నారు. ఇదికూడా ఖర్చుతో ముడిపెడితే తన మాట ఎవరూ వినరని అనిపించిందేమో.. రాష్ట్రంలోని మహిళలంతా.. సోషల్ మీడియా వేదికగా ఫేస్ బుక్ ట్విటర్ లలో రక్షాబంధన్ సందేశాలు మోడీకి పంపాలని, రాష్ట్రానికి హోదా కోరాలని రఘువీరా చెబుతున్నారు.
ఆయన చెప్పిన పోరాటానికి పెద్దగా ఖర్చు కాకపోవచ్చు గానీ.. అసలు కాంగ్రెస్ వారు ఏం చెప్పినా పట్టించుకునే వారంటూ ఈ రాష్ట్రంలో ఉన్నారా అనేది పెద్ద ప్రశ్న. ఎందుకంటే.. వైఎస్ జగన్ - చంద్రబాబునాయుడు ఇద్దరూ ఒక తాను ముక్కలే అని వ్యాఖ్యానించే నేతను కన్సిడర్ చేసే వాళ్లు అసలు ఎవరుంటారు? అని ప్రజలు అనుకుంటున్నారు. ఒకవైపు చంద్రబాబు - జగన్ కత్తులు దూసుకుంటూ ఉంటే.. వారిద్దరూ ఒక తాను ముక్కలే అని, కవలపిల్లలని రఘువీరా అంటే.. ఆయన మాటలకు అసలు ప్రజల్లో విలువేం ఉంటుంది అని పలువురు దెప్పి పొడుస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా.. కాంగ్రెస్ హోదా పోరాటం అనేది మరో ఫెయిల్యూర్ గా తేలిపోతుందని అంతా అనుకుంటున్నారు.