Begin typing your search above and press return to search.
చూశావా బాబు రఘువీరా అదే మాట అడిగేశాడు
By: Tupaki Desk | 17 Feb 2016 11:07 AM ISTరాజకీయ అనుభవం మొండుగా ఉన్న ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు తన రాజకీయ ప్రత్యర్థులకు ఇస్తున్న అవకాశాల్ని చూస్తే విస్మయం కలగక మానదు. చేతులారా చేస్తున్న తప్పులు పార్టీకి శాపాలుగా మారి.. భవిష్యత్తు అవకాశాల్ని దెబ్బ తీస్తాయన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఏ తెలుగు ముఖ్యమంత్రికి లభించని అపూర్వమైన.. అరుదైన అవకాశం ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు లభించింది. ఏపీకి రాజధాని నిర్మాణాన్ని షురూ చేయటంతో పాటు.. కొన్ని నిర్మాణాల్ని ఆయన హయాంలో పూర్తి చేసే వీలుంది.
ఇలాంటి భారీ కార్యక్రమం చేపట్టే క్రమంలో చాలా జాగ్రత్తగా అడుగులు వేయాల్సి ఉంది. ఇంత పెద్ద బాధ్యతను సరిగ్గా నిర్వహిస్తే అద్భుతమైన మైలేజ్ సొంతం కావటమే కాదు.. చరిత్రలో నిలిచిపోతారు. అదే సమయంలో ఏ మాత్రం తేడా జరిగినా అంతే తీవ్రస్థాయిలో విమర్శల్ని మూట గట్టుకోవటమే కాదు.. ఆ తప్పులు జీవితాంతం వెంటాడుతూనే ఉంటాయి. అమరావతి రాజధాని నిర్మాణం విషయంలో బాబు కొన్ని తప్పులు చేస్తున్నారు.
తాత్కాలిక నిర్మాణాల్ని ఒకసారి.. శాశ్విత నిర్మాణాల్ని మరోసారి నిర్మించటం వల్ల ఎలాంటి ప్రయోజనం లేదన్న విషయాన్ని మర్చిపోకూడదు. బాబు తరచూ ప్రస్తావించే హైటెక్ సిటీ తాను నిర్మించానని చెబుతుంటారు. దాని విషయానికే వస్తే.. హైటెక్ సిటీలో ఏర్పాటు చేసిన భవనాలన్నీ శాశ్వితమైనవే తప్పించి.. తాత్కాలికమైనవి ఒకసారి.. శాశ్వితమైనవి మరోసారి నిర్మాణం చేపట్టటం వల్ల లాభం కంటే నష్టమే ఎక్కువ. అసలే లోటు బడ్జెట్.. ఆపై ఏపీ రాజధానికి చేయాల్సింది ఎంతో ఉంది. ఇలాంటప్పుడు ఖర్చు చేసే ప్రతి రూపాయికి తగ్గ ఫలం దక్కేలా చూసుకోవాలే తప్పించి.. విమర్శలు మూటగట్టుకునేలా ఉండకూడదు.
ఇప్పటికే ఖర్చుల విషయంలో చంద్రబాబుకు చాలానే చెడ్డపేరును తెచ్చుకుంటున్నారు. విలాసవంతమైన ముఖ్యమంత్రిగా ఆయన పేరు ప్రఖ్యాతులు విస్తరిస్తున్నాయి. ప్రజలు అవినీతిని అయినా లైట్ తీసుకుంటారేమో కానీ.. అహంకారాన్ని.. విలాసవంతమైన జీవనాన్న ఏ మాత్రం అంగీకరించరన్న విషయాన్న చంద్రబాబు మర్చిపోకూడదు. తాజాగా ఏపీ కాంగ్రెస్ చీఫ్ రఘువీరారెడ్డి మాట్లాడుతూ.. బాబుకు మించిన విలాసవంతమైన ముఖ్యమంత్రి దేశంలో మరొకరు లేరని మండిపడ్డారు. ఇష్టానుసారంగా డబ్బును వృధా చేయటంతో బాబు వెనుకాడటం లేదని.. రాజధాని పేరుతో ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని ఆరోపించారు.
ఒకసారి భూమిపూజ.. మరోసారి శంకుస్థాపన.. ఇప్పుడేమో తాత్కాలిక రాజధాని అని.. తాత్కాలిక సచివాలయం అంటూ వేల కోట్లు వృధా చేయటం సరికాదని.. శాశ్వితమైన కట్టడాల మీద దృష్టి సారించాలని ఆయన హితవు పలుకుతున్నారు. శాశ్విత స్థాయిలో కట్టడాలు కట్టకుండా తాత్కాలికం ఏమిటంటూ ఆయన సూటిగా ప్రశ్నిస్తున్నారు. రఘువీరా లాంటి నేతలు సంధించే ఇలాంటి ప్రశ్నలే బాబుకు భవిష్యత్తులో చుట్టుకుంటాయన్న విషయాన్ని చంద్రబాబు మర్చిపోతే.. అంతకు మించిన చారిత్రక తప్పిదం మరొకటి ఉండదేమో..?