Begin typing your search above and press return to search.

మనిషి పుర్రెను కాల్చుకొని.. సైకో కలకలం

By:  Tupaki Desk   |   16 Aug 2020 6:30 PM IST
మనిషి పుర్రెను కాల్చుకొని.. సైకో కలకలం
X
వ్యసనాలకు బానిస అయిన ఓ వ్యక్తి సైకోగా మారాడు. ఐదేళ్ల కిందట తండ్రి మరణించాడు. తల్లి ఇతడి ఆగడాలు భరించలేక వదిలేసిపోయింది. దీంతో ఓ పాడుబడిన ఆ ఇంట్లో అతడు సాగిస్తున్న వ్యవహారాలు గగుర్పొడిచేలా ఉన్నాయి.

విశాఖపట్నం సిటీ వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో గల రెల్లివీధిలో ఆదివారం ఒక్కసారిగా కలకలం చెలరేగింది. ఓ పాడుబడ్డ ఇంట్లో ఉన్న యువకుడు.. మనిషి పుర్రెను కాల్చుకొని తినేందుకు ప్రయత్నించిన ఘటన సంచలనంగా మారింది.

రెల్లివీధికి చెందిన రావులపూడి రాజు (20) అలియాస్ సైకో రాజు వికృతంగా ప్రవర్తిస్తున్నాడు. తాజాగా ఒక గోనె సంచిని రాజు తీసుకొచ్చి ఇంటిపక్కనపెట్టాడు. దీన్ని సుబ్రహ్మణ్యం అనే వ్యక్తి తెరిచి చూడగా.. అందులో మనిషి తల కనిపించింది. దీంతో కేకలు వేసి అందరినీ పిలిచి పోలీసులకు సమాచారం ఇచ్చాడు.

సైకో రాజు బయటకొచ్చి గోనె సంచిలో తలను తీసుకొని పుర్రెను కాల్చుకు తినేందుకు ప్రయత్నించాడు. పోలీసులు వచ్చే సరికి రాజు పరారయ్యాడు. పోలీసులు సైకో రాజు ఇంట్లో సోదాలు చేయగా.. అందులో ఒక యువతిని గుర్తించారు. ఆమె ఎవరనేదానిపై ఆరాతీస్తున్నారు.

సైకోరాజు తీసుకొచ్చిన పుర్రె శ్మశానంలోని శవానిదా? లేక ఎవరినైనా హత్య చేశాడా అన్న కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు.