Begin typing your search above and press return to search.

కేసీఆర్‌ కే ప్ర‌కాష్ రాజ్ మొగ్గు.. గ్రేట‌ర్‌ పై ఏమ‌న్నారంటే!

By:  Tupaki Desk   |   30 Nov 2020 11:00 PM IST
కేసీఆర్‌ కే ప్ర‌కాష్ రాజ్ మొగ్గు.. గ్రేట‌ర్‌ పై ఏమ‌న్నారంటే!
X
ప్ర‌ముఖ బ‌హుభాషా న‌టుడు.. ఇటీవ‌ల కాలంలో రాజ‌కీయంగా దూకుడు ప్ర‌ద‌ర్శిస్తున్న ప్ర‌కాష్ రాజ్‌.. త‌న మ‌న‌సులో మాట‌ను చెప్పేశారు. తెలంగాణ రాజ‌కీయాల విష‌యంలో రెండు రోజుల కింద‌ట కూడా ఆయ‌న సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. జ‌న‌సేనాని ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ను రాజ‌కీయ ఊస‌ర‌వెల్లితో పోల్చిన ప్ర‌కాష్‌.. అన్ని వైపుల నుంచివిమ‌ర్శ‌లు ఎదుర్కొన్నారు. మెగా బ్ర‌ద‌ర్ నాగ‌బాబు.. ప్ర‌కాష్‌రాజ్‌పై విరుచుకుప‌డ్డ విష‌యం తెలిసిందే. ఇదిలావుంటే.. గ్రేట‌ర్ ఎన్నిక‌లు జ‌రుగుతున్న కీల‌క స‌మ‌యంలో త‌న మ‌ద్ద‌తు టీఆర్ఎస్‌కే న‌ని ప్ర‌క‌టించారు ప్ర‌కాష్ రాజ్‌.

`` గ్రేట‌ర్ హైద‌రాబాద్ ఎన్నిక‌ల్లో తెలంగాణ రాష్ట్ర స‌మితికే నా మ‌ద్ద‌తు. హైద‌రాబాద్ ప్ర‌జ‌లు విచ‌క్ష‌ణ‌తో ఓటేయాలి. సామ‌ర‌స్యాన్ని పెంపొందించే పార్టీల‌కే అండ‌గా ఉండాలి. విభ‌జ‌న వాద‌న రాజ‌కీయాల‌కు.. విభ‌జ‌న వాద పార్టీల‌కు త‌గిన బుద్ధి చెప్పండి. హైద‌రాబాద్‌లో శాంతి యుత వాతావ‌ర‌ణం కోరుకునేవారు.. సామ‌ర‌స్యాన్ని పెంపొందిస్తున్న పార్టీకే ఓటేయండి. నేను టీఆర్ ఎస్‌కు, కేసీఆర్‌కు, కేటీఆర్‌కు సంపూర్ణ మ‌ద్ద‌తు ప్ర‌క‌టిస్తున్నా`` అని ప్ర‌కాష్ రాజ్ ట్వీట్ చేయడం సంచ‌ల‌నం గా మారింది.

అయితే.. ప్ర‌కాష్ రాజ్ ట్వీట్‌పై కాంగ్రెస్ నేత‌లు మండిప‌డ్డారు. ముఖ్యంగా ఏఐసీసీ తెలంగాణ ఇంచార్జ్ మాణిక్కం ఠాగూర్ విమ‌ర్శ‌నాస్త్రాలు సంధించారు. ``తెలంగాణ‌లో ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తున్న వారికి ఓటేయాల‌ని ప్ర‌కాష్ రాజ్ పిలుపునివ్వ‌డం ఆశ్చ‌ర్యంగా ఉంది`` అని వ్యాఖ్యానించారు. అంతేకాదు పోలింగ్‌కు సిద్ధ‌మైన గ్రేట‌ర్‌లో ఓట‌ర్ల‌కు డ‌బ్బులు పంచుతూ.. కేసీఆర్‌, ఆయ‌న కుమారుడు కేటీఆర్ ల త‌ర‌ఫున వారి ఏజెంట్ డ‌బ్బు, క‌ర‌ప‌త్రాల‌తో ప‌ట్టుబ‌డిన విష‌యం ప్ర‌కాష్ రాజ్‌కు తెలుసుకోవాలి.. అని అన్నారు.

అంతేకాదు.. ఇన్ని జ‌రుగుతున్నా.. గ్రేట‌ర్‌లో తండ్రీ కొడుకులే గెల‌వాల‌ని కోరుకుంటున్నావా? అని ప్ర‌కాష్ రాజ్‌పై ప్ర‌శ్న‌లు కురిపించారు. మొత్తంగా చూస్తే.. ప్ర‌కాష్ రాజ్‌.. ఇప్ప‌టి వ‌ర‌కు మౌనంగా ఉండి.. ఇప్పుడు కేసీఆర్‌కు మ‌ద్ద‌తుగా ట్వీట్లు చేయ‌డం.. అందునా.. గ్రేట‌ర్ ఎన్నిక‌ల‌ను ప్ర‌భావితం చేసేలా వ్యాఖ్య‌లు సంధించ‌డం వంటివి చ‌ర్చ‌నీయాంశంగా మారాయి. మ‌రోవైపు.. బీజేపీ మౌనంగా ఉండి.. కాంగ్రెస్ నేత‌లు విమ‌ర్శ‌లు చేయ‌డం మ‌రింత ఆశ్చ‌ర్యంగా ఉన్నాయ‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.