Begin typing your search above and press return to search.
కోడెల మరణంపై సీబీఐ విచారణ కోరుతూ తెలంగాణ హైకోర్టులో పిల్
By: Tupaki Desk | 20 Sept 2019 10:00 PM ISTఇటీవల ఆత్మహత్య చేసుకున్న మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ మృతిపై ఆయన అభిమాని ఒకరు తెలంగాణ హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. అనిల్ కుమార్ అనే ఆ అభిమాని తన పిటిషన్ లో తెలంగాణ ప్రభుత్వాన్ని - బంజారాహిల్స్ సీఐని - సీబీఐని ప్రతివాదులుగా పేర్కొన్నారు.
పిల్ దాఖలు చేసిన తరువాత అనిల్ కుమార్ మాట్లాడుతూ.. ఒక కోడెల అభిమానిగా ఆయన మృతిపై తనకు ఎన్నో అనుమానాలున్నాయని.. ఆయన ఆత్మహత్య వెనుక కుట్ర ఉందని - ఆయన ఆత్మహత్య చేసుకునేటంత పిరికివాడు కాదని అనిల్ అన్నారు. కోడెల కంటే ముందు ఎందరో నాయకులకు వ్యతిరేకంగా కేసులు దాఖలయ్యాయని... ఎందరో నేతలు జైలుకు కూడా వెల్లారని.. కోడెల కూడా కేసులకు భయపడే రకం కాదని - కేసులకు భయపడి ప్రాణాలు తీసుకునే వ్యక్తి కూడా కాదన్నారు.
కోడెల కుమారుడు శివరామ్ దీని వెనుక ఉన్నారన్నది తన అనుమానమని అనిల్ అన్నారు. సానుభూతి పొంది - తద్వారా కేసుల నుంచి ఉపశమనం పొందే ఆలోచనతో శివరామే ఈ పని చేసుంటారని - చంద్రబాబు కూడా దీన్నుంచి మైలేజి పొందాలనకుంటున్నారని.. కోడెల మరణంపై సీబీఐ విచారణకు హైకోర్టు ఆదేశించాలని ఆయన కోరారు.