Begin typing your search above and press return to search.
వైరల్ ఇష్యూ: పవన్ కు రెండు చెప్పులు చూపించిన పేర్ని నాని!
By: Tupaki Desk | 15 Jun 2023 1:02 PM GMTజనసేన అధినేత పవన్ కల్యాణ్ తన వారాహి యాత్ర సందర్భంగా బుధవారం రాత్రి తూర్పు గోదావరి జిల్లా కత్తిపూడిలో నిర్వహించిన బహిరంగ సభలో ప్రసంగించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా జగన్ సర్కార్ పై ఆయన విమర్శల వర్షం కురిపించారు. అయితే ఇలా పవన్ చేసిన వ్యాఖ్యల పట్ల వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, మాజీమంత్రి పేర్ని నాని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇది వారాహి యాత్ర కాదు... నారాహి యాత్ర అని మొదలుపెట్టిన పేర్ని నాని... ఈ సందర్భంగా ఆ సభలో పవన్ ప్రస్థావించిన ప్రతీ విషయంపైనా స్పందించారు. తిరిగి పవన్ పై ప్రశ్నల వర్షం కురిపించారు. ఈ సందర్భంగా పవన్ ప్రస్థావించిన... "పాలించే పాలకులకు గులాంగిరీ చెయ్యం.. బాధ్యతగా లేనప్పుడు చొక్కా పట్టుకుని అడుగుతాను" అనే కామెంట్ పై పేర్ని తిరిగి కొన్ని ప్రశ్నలడిగారు.
"గతంలో చంద్రబాబు చొక్కా ఎన్నిసార్లు పట్టుకున్నావ్.. మోడీ కోటు ఇంకెన్ని సార్లు పట్టుకున్నవ్" అంటూ ప్రశ్నించారు. ఇక తాను కానీ, తన ముందున్న విలేఖరులు - కెమెరా మెన్ లు కానీ... చంద్రబాబుతో పవన్ రూం లో మాట్లాడుకుని బయటకు వచ్చాక చంద్రబాబు చొక్క ఎప్పుడూ నలిగినట్లు కనిపించలేదని సెటైర్స్ వేశారు!
ఈ సందర్భంగా వైసీపీ నాయకులను చెప్పు చూపించి మక్కెలిరగ్గొడతానని పవన్ అంటున్నాడన్న పేర్ని నాని... తన రెండు చెప్పులనూ చూపిస్తూ.. "పవన్ కల్యాణ్ ఇదిగో రెండు చెప్పులూ చూపిస్తున్నా.. ఇప్పుడు నేను నీకన్నా పెద్ద మొగోడ్నిగా.. జాగ్రత్త మక్కెలిరిగిపోతాయి" అంటూ ఫైరయ్యారు. ఇలాంటి సొల్లు మాటలు తానుకూడా చెప్పగలనంటూ తీవ్రస్థాయిలో కామెంట్స్ చేశారు పేర్ని నాని.
ఇదే క్రమంలో తన సినిమాలను అధికార పార్టీ అడ్డుకుంటోందంటూ పవన్ చేసిన ఆరోపణలో అర్థం లేదని నాని అన్నారు. తాము అడ్డుకున్న ఒక్క సినిమా అయిన చూపించగలవా? అంటూ పవన్ కు సవాల్ విసిరారు. అబద్ధాలను ప్రచారం చేస్తే మక్కెలిరిగిపోతాయంటూ తీవ్రస్థాయిలో హెచ్చరించారు.
అనంతరం ముఖ్యమంత్రి పదవి ఒకరిస్తే తీసుకునేది కాదని, సీఎం పదవి అంటే కందులు - నువ్వెల దానం కాదని... పవన్ కు సుచించారు పేర్ని నాని. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారాయి!