Begin typing your search above and press return to search.

జగన్ కూడా ఎన్టీఆర్ లానే ఉన్నారా....నిజమేనా...?

By:  Tupaki Desk   |   2 Feb 2023 6:00 PM GMT
జగన్ కూడా ఎన్టీఆర్ లానే ఉన్నారా....నిజమేనా...?
X
జగన్ ముక్కుసూటిగా ఉంటారని ప్రచారంలో ఉంది. రాజకీయాల్లో ప్రజలు తన వెంట ఉన్నారు అని నమ్మడం నాయకుడికి అవసరం. అది ధీమాను కలిగిస్తుంది. కానీ ఆ ప్రజలే ఒకసారి వెన్నుపోటు జరిగితే ఏమీ చేయలేరు అన్నది ఎన్టీయార్ ఉదంతం 1995లో రుజువు చేసింది. ఎన్టీయార్ కూడా తనకు ప్రజల బలం ఉంది అనుకున్నారు. కానీ వన్స్ పోలింగ్ ముగిసి పవర్స్ ఎమ్మెల్యేలకు బదలాయించబడ్డాక గేం అక్కడే స్టార్ట్ అవుతుంది. వారితో టచ్ లో ఉండడం గ్యాప్ లేకుండా చూసుకోవడం ఎవరికైనా అవసరం.

ఎన్టీయార్ వెన్నుపోటు రాజకీయ చరిత్రలో నేతలకు ఒక పెద్ద గుణపాఠం. ఇక జగన్ వద్దకు వస్తే ఆయన ఎన్టీయార్ కంటే రాజకీయంగా అనుభవం ఉన్న వారే. అయితే జగన్ కి నేతలకు మధ్య గ్యాప్ ఉందని ఎపుడూ అంటూ ఉంటారు. ఆయన నాలుగేళ్ళ ముఖ్యమంత్రిత్వంలో ఎపుడూ వన్ టూ వన్ గా ఎమ్మెల్యేలను కలిసినది లేదని అంటారు. అలాగే ఎంపీల విషయలో కూడా ఆయన ఉంటారని చెబుతారు.

ఈ మధ్య వర్క్ షాప్స్ పేరిట అందరికీ ఒక చోట కూర్చోబెట్టి మీటింగ్స్ పెడుతున్నా ముఖా ముఖీ సమస్యలకు అవకాశం ఇవ్వడంలేదు అన్న విమర్శలు ఉన్నాయి. ఇక పార్టీలో ఏమి జరుగుతోందో వైసీపీ అధినాయకత్వం గుర్తించలేకపోతోందా అంటే అవును అని అంటున్నారు ఆ పార్టీకి చెందిన మాజీ మంత్రి పేర్ని నాని. ఆయన జగన్ని పట్టుకుని పిచ్చి మారాజు అని అనేసారు. జగన్ కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి మీద పూర్తి విశ్వాసంతో ఉన్నారని, ఆయన వైఎస్సార్ భక్తుడు అని తమ లాంటి వారు ఏమి చెప్పినా వినలేదని పేర్ని నాని అంటున్నారు.

నిజానికి కోటం రెడ్డి చాలా కాలంగా స్కెచ్ గీసుకుని కూర్చున్నారని, ఆయన గత ఏడాది డిసెంబర్ 25న చంద్రబాబుని నేరుగా కలిశారని, అలాగే ఎప్పటికపుడు లోకేష్ తో ఫోన్లో టచ్ లో ఉంటున్నారని కూడా పేర్ని నాని మీడియాకు చెప్పడం ఇపుడు ఆశ్చర్యం కలిగిస్తోంది. పార్టీకి జగన్ కి కోటం రెడ్డి వెన్నుపోటు పొడిచారు అని ఆయన అంటున్నారు. ఈ విషయాలు తాము చాలా కాలం నుంచి చెప్పినా జగన్ పట్టించుకోలేదని దానికి కారణం కోటం రెడ్డి మీద నమ్మకమే అని పేర్ని నాని అన్నారు.

నెల్లూరు జిల్లాలో మాజీ మంత్రితో టచ్ లో ఉండమని చంద్రబాబు కోటం రెడ్డికి సూచించారని పేర్ని నాని చెప్పారు. ఇదంతా ఏ ఇంటలిజెన్స్ వర్గాలో చెప్పలేదని, టీడీపీ వారే చెబుతున్నారని ఆయన అన్నారు. మొత్తానికి కోటం రెడ్డి సామాన్యుడు కాదని తమ దగ్గర వైఎస్సార్ భక్తుడిగా నటించి తెలుగుదేశంతో తెరచాటు స్నేహం చేశారు అని ఆయన ఆరోపించారు.

జగన్ మళ్ళీ సీఎం కావాలని కోటం రెడ్డి అనుకుంటే చంద్రబాబుకు లోకేష్ కి టచ్ లోకి ఎందుకు వెళ్తారని ఆయన ప్రశ్నించారు. తమ పార్టీకి చెందిన ఎమ్మెల్యేల మీద నిఘా పెట్టేంత ఖర్మ తమకు లేదని ఆయన అంటున్నారు. ఇవనీ ఒక ఎత్తు అయితే వైసీపీలో అతి పెద్ద వ్యవస్థ ఉందని, చీమ చిటుక్కుమన్నా జగన్ కి నేరుగా తెలుస్తుందని ఇప్పటిదాకా అంతా అనుకున్నారు కానీ అది నిజం కాదని కోటం రెడ్డి ఎపిసోడ్ తో తెలిసిపోయిందని అంటున్నారు.

చాలా కాలంగా కోటం రెడ్డి తెలుగుదేశంతో టచ్ లో ఉంటే కవలం ఆనం రామ నారాయణరెడ్డి మీదనే అనుమానం చూపులు చూస్తూ కోటం రెడ్డిని జగన్ తన వద్దకు పిలిపించుకుని భరోసా ఇచ్చారంటేనే వైసీపీలో ఎంత పేలవమైన రాజకీఎయ నిర్వహణ ఉందో అర్ధం అవుతోంది అంటున్నారు. దీనికి కారణం తన నాయకత్వానికి తిరుగులేదు ప్రజలు మళ్ళీ తనను ఎన్నుకుంటారు తాను ఎవరిని నిలబెట్టినా గెలుస్తారు అన్న జగన్ అమితమైన విశ్వాసమే అని అంటున్నారు.

కానీ రాజకీయాల్లో ప్రజలు ఎంత ముఖ్యమో నాయకులు అంతే ముఖ్యమని అంటున్నారు. ఇక కోటం రెడ్డి ఎపిసోడ్ వైసీపీ పెద్దలకు ఒక విధంగా కళ్ళు తెరిపించింది అని అంటున్నారు. మొత్తానికి చూస్తే ప్రేమతో అన్నారో ఆవేదనతో అన్నారో కానీ ప్రేని నాని జగన్ని పిచ్చి మారాజుని చేసేశారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.