Begin typing your search above and press return to search.
ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ కాలంలో 67కోట్ల మందికి విద్యుత్ సౌకర్యం లేదా?
By: Tupaki Desk | 7 Jun 2023 1:16 PM GMTపెరుగుతున్న టెక్నాలజీలో భాగంగా ప్రపంచం ఒక కుగ్రామం అయిపోతున్న రోజులివి. చంద్రుడిపైకి విహార యాత్రకు వెళ్లిరావడానికి, అంగారకుడిపై నివాసం ఉండటానికి ప్రయోగాలు జరుగుతున్న కాలమిది. ప్రపంచమంతా కృత్రిమ మేధస్సు (ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్) అందుబాటులోకి వస్తోన్న సమయమిది. ఈ రోజుల్లో కూడా విద్యుత్ సౌకర్యం లేని ప్రజల లిస్ట్ ఆశ్చర్యం కలిగిస్తోంది!
రోజులు ఎంతమారినా, ప్రపంచం ఎంత ముందుకు వెళ్లినా... ప్రపంచ సమాజంలో తారతమ్యాలు అత్యంత సహజం అనేది తెలిసిన విషయమే. అయితే ఆ తారతమ్యాలు ఏస్థాయిలో ఉన్నాయన్నదానిపైనే సమాజంలో వ్యత్యాసాలపై స్పష్టత వస్తోంది!
అయితే.. మనిషి మెదడును సిలికాన్ ఆధారిత కంప్యూటర్లకు జోడించాలనే దిశగా ఆలోచనలు జరుగుతున్న ఈ పరిస్థితుల్లో ఇప్పటికి విద్యుత్ సౌకర్యం లేని ప్రజలు ఉన్నారు అనేది ప్రపంచ సమాజంలో నెలకొన్న తీవ్ర తారతమ్యాల పరిస్థితికి తాజా ఉదాహరణ.
ఆధునిక ప్రపంచంలో ఇప్పటికీ 67.5 కోట్ల మందికి విద్యుత్ సౌకర్యమే లేదనే విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది. ఈ మేరకు అంతర్జాతీయ ఇంధన సంస్థ, అంతర్జాతీయ పునరుత్పాదక ఇంధన సంస్థ, ఐక్యరాజ్యసమితి గణాంక విభాగం, ప్రపంచబ్యాంకు, ప్రపంచ ఆరోగ్య సంస్థలు సంయుక్తంగా విడుదల చేసిన నివేదిక ఈ విషయాలను వెలుగులోకి తెచ్చాయి.
మరో ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే... 230 కోట్ల మంది ఇప్పటికీ వంట చెరకుపైనే ఆధారపడి వంట చేసుకుంటున్నారంట. ఈ క్రమంలో మరింత కీలక విషయాలు ఆ నివేధికలో పొందుపరిచాయి ఆ అంతర్జాతీయ సంస్థలు.
వారి అంచనాల ప్రకారం.. ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో.. 2030 నాటికి 6.60 కోట్ల మంది విద్యుత్ సౌకర్యం లేకుండానే ఉంటారని తెలుస్తుంది. అదేవిధంగా అప్పటికీ సుమారు 190 కోట్ల మంది అప్పటికీ వంటచేసుకోవడానికి వంటచెరకు పైనే ఆధారపడతారని తెలుస్తుంది.
కాగా... 2015 నాటికి ప్రపంచంలో అందరికీ సరసమైన ధరలో, సుస్థిరమైన, ఆధునిక ఇంధనం అందుబాటులోకి రావాలన్నది ఐక్యరాజ్యసమితి లక్ష్యం కావడం గమనార్హం. అయితే ఐక్యరాజ్యసమితి లక్ష్యం కూడా నెరవేరలేదు. దీంతో... ఐక్యరాజ్యసమితి తన లక్ష్యాన్ని చేరుకోవడంలో ప్రపంచ దేశాలు సరైన దిశలో ముందుకుసాగడంలేదని నివేదిక ఆందోళన వ్యక్తం చేసింది.