Begin typing your search above and press return to search.
పేటలో వైసీపీకి రాజకీయ సంకటం
By: Tupaki Desk | 16 April 2023 9:27 AM GMTఉమ్మడి విశాఖ జిల్లా తూర్పు గోదావరి జిల్లా సరిహద్దుగా పాయకరావుపేట నియోజకవర్గం ఉంటుంది. ఈ నియోజకవర్గం ఆది నుంచి తెలుగుదేశానికి కంచుకోట. దాన్ని తిరగరాసింది మాత్రం ఒకే ఒక్కడుగా పేరు గడించిన గొల్ల బాబూరావు. ఆయన 2009లో కాంగ్రెస్ తరఫున పోటీ చేసి తెలుగుదేశం సైకిల్ కి బ్రేకులేశారు. 1983 నుంచి ఇప్పటికి ఉప ఎన్నికతో కలిపి పదిసార్లు ఎన్నికలు జరిగితే ఏడు సార్లు టీడీపీ గెలిచిందింది అంటేనే పేట రాజకీయం ఎలా ఉంటుందో అర్ధం చేసుకోవచ్చు.
తెలుగుదేశానికి బలమైన స్థావరంగా ఉన్న పాయకరావుపేటలో మొనగాడిగా మారి గొల్ల బాబూరావు జెండా ఎగరేశారు. ఆయన వైఎస్సార్ చలువతో మొదటిసారి గెలిచారు. ఆయన మరణానంతరం వైఎస్ జగన్ వైపు వచ్చారు 2012లో జరిగిన ఉప ఎన్నికల్లో మళ్లీ గెలిచి సత్తా చాటారు. 2014లో అమలాపురం నుంచి ఎంపీగా పోటీ చేసి ఓడారు.
దాంతో పాయకరావుపేట నుంచి వైసీపీ తరఫున పోటీ చేసిన చెంగల వెంకటరావు వంగలపూడి అనిత చేతిలో ఓటమి పాలు అయ్యారు. 2019లో గొల్ల బాబూరావు పేట నుంచి పోటీ చేసి 31 వేల ఓట్ల భారీ మెజారిటీతో గెలిచారు మంత్రి పదవి ఇవ్వలేదని ఆయన అధినాయకత్వం మీద అలగడం అప్పట్లో చర్చనీయాంశం అయింది.
ఇక ఆయన వైసీపీ క్యాడర్ తో గ్యాప్ మెయింటెయిన్ చేయడం తన వర్గాన్ని మాత్రమే ప్రోత్సహిస్తారు అన్న విమర్శల నేపధ్యంలో నాలుగు మండలలలో ఉన్న వైసీపీ లీడర్స్ క్యాడర్ లో అత్యధికం ఇపుడు ఆయనను వ్యతిరేకిస్తున్నారు. సొంత పార్టీలో ఎమ్మెల్యేకు ఎదురు నిలిచి రోడ్ల నిర్బంధం చేసిన ఘటనలు బహుశా పాయకరావుపేటలో తప్ప ఎక్కడా కనిపించవేమో.
ఇపుడు చూస్తే గొల్ల బాబూరావుకు అటు పార్టీలో మద్దతు పెద్దగా కనిపించడంలేదు, అధినాయకత్వం సైతం పనితీరు పట్ల అసంతృప్తిగా ఉంది. జనంలోనూ మార్పు కనిపిస్తోంది. పాయకరావుపేటలో టీడీపీ బలంగా ఉన్నా మాజీ ఎమ్మెల్యే అనిత పట్ల కూడా అంత సానుకూలత అయితే లేదు. ఆమె వైజాగ్ లో సెటిల్ అయ్యారని నాన్ లోకల్ అని పార్టీలో అసంతృప్తి ఉంది.
అయినా సరే వైసీపీలో విభేదాలు ఆమెకు కలసి వస్తున్నాయి. తెలుగు మహిళా రాష్ట్ర అధ్యక్షురాలిగా ఆమె ఉన్నారు. దాంతో టికెట్ ఖాయం. ఇక వైసీపీకి పక్కా లోకల్ క్యాండిడేట్ గా బాబూరావు ఉన్నా ఆయన వ్యవహారశైలితో అంతా పాడుచేసుకున్నారని అంటున్నారు. కానీ బాబూరావుని తప్పిస్తే ఎమ్మెల్యే స్థాయి క్యాడిడేట్ ఎవరూ లేరు. అదే మైనస్ గా మారుతోంది. ఈ పరిణామాలు అన్నీ కూడా టీడీపీకి ప్లస్ గా మారుతున్నాయి. దాంతో వచ్చే ఎన్నికల్లో అనితకు రెండవసారి ఎమ్మెల్యే అయ్యేలా పరిణామలు ఉన్నాయని అంటున్నారు.
అయితే వైసీపీ కూడా నాన్ లోకల్ క్యాండిడేట్ ని తెచ్చి పెడుతుందని అంటున్నారు. అదే జరిగితే పేటకు చెందని ఇద్దరు నాన్ లోకల్స్ మధ్య సాగే పోరులో ఎవరు గెలుస్తారో చూడాల్సి ఉంటుంది. ఇక పాయకరావుపేట వైసీపీలో వర్గ పోరు తారస్థాయిలో ఉండడంతో ఎవరూ ఏమీ చేయలేని పరిస్థితి ఉందని అంటున్నారు.