Begin typing your search above and press return to search.
పవన్ అర్ధజ్ఞాన మాటల ఫలితం... జనసేన భవిష్యత్తు పై నీలినీడలు?
By: Tupaki Desk | 11 July 2023 6:29 PM GMTవారాహి యాత్ర రెండోదశలో భాగంగా ఏలూరులో జరిగిన సభలో పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలు పెనుదుమారమే రేపిన సంగతి తెలిసిందే. దీంతో తీవ్రస్థాయిలో స్పందించిన ఏపీ వాలంటీర్లు రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. ఫలితంగా... పవన్ మాటలతో జనసేన భవిష్యత్తుపై నీలినీడలు కమ్ముకున్నాయనే కామెంట్లు వినిపిస్తున్నాయని అంటున్నారు!
ఎమ్మెల్యేలు, మంత్రులు, ఆఖరికి ముఖ్యమంత్రి పై కూడా పవన్ కల్యాణ్ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తుంటారు. వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తూ వ్యక్తిత్వ హననానికి పాల్పడుతుంటారని అంటుంటారు. అయితే అది వ్యక్తుల మీద చేసిన దాడిగా ఉండటం వల్ల ఆ ఎఫెక్ట్ పవన్ కి సరిగ్గా తగలలేదని అంటున్నారు పరిశీలకులు. అయితే ఫస్ట్ టైం వ్యక్తులకు మించిన వ్యవస్థలపై నోరు జారారు పవన్! దీంతో పరిస్థితి చెయ్యి దాటిపోయిందని అంటున్నారు!
అవును... వ్యక్తులమీద కామెంట్లు చేసినంత ఈజీగా వ్యవస్థలమీద నోరు పారేసుకుంటే పరిణామాలు ఎలా ఉంటాయో... వాలంటీర్లపై చేసిన కామెంట్లకు వస్తున్న రియాక్షన్ వల్ల పవన్ కు అర్థమై ఉంటుందని అంటున్నారు విశ్లేషకులు.
రాష్ట్రవ్యాప్తంగా దాదాపు రెండున్నర లక్షలమంది సైన్యంతో బలమైనదిగా ఉన్న వాలంటీర్ వ్యవస్థను కించపరుస్తూ.. వారిని హ్యూమన్ ట్రాఫికర్స్ అంటూ ఆవమానకరంగా మాట్లాడినందుకు పవన్ గట్టి మూల్యమే చెల్లించుకొంటున్నారని అంటున్నారు.
ఇదే సమయంలో పవన్ చేసిన ఈ నోటి దురుసు కామెంట్లు ప్రజల్లో అయన స్థాయిని పాతాళానికి తీసుకెళ్లడంతో పాటు... జనసేన భవిష్యత్తుని కూడా ప్రశ్నార్ధకం చేశాయనే కామెంట్లు వినిపిస్తుండటం గమనార్హం. కారణం... రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది మంది వాలంటీర్లు, వారి కుటుంబీకులు, వారికి మద్దతు తెలిపే సామాన్యులు సైతం పవన్ వ్యాఖ్యలను గట్టిగా వ్యతిరేకిస్తూ ధర్నాలు చేస్తున్నారు. దిష్టిబొమ్మల దగ్ధం చేస్తున్నారు.. పవన్ ఫోటోలను కాళ్లతో తొక్కుతూ నిరసనలతో రాష్ట్రాన్ని హోరెత్తిస్తున్నారు.
ఇలా ఒకపక్క నిరసనలు తెలుపుతూనే.. క్షమాపణలు చెప్పాలని డిమాండ్స్ చేస్తూనే.. మరోపక్క పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదు సైతం చేస్తున్నారని తెలుస్తుంది. దీంతో... వాలంటీర్లు సంఘ విద్రోహ శక్తులు అనే కామెంట్ తో పవన్ ఒక్కసారిగా రెండున్నర లక్షలమంది వాలంటీర్లతోపాటు వారి కుటుంబీకులు, వారి సేవలు పొందుతున్నవారితో కలిపి లక్షలమంది శతృత్వాన్ని కొనితెచ్చుకున్నారని అంటున్నారు రాజకీయ పండితులు. ఈ ప్రభావం తీవ్రస్థాయిలో ఉండొచ్చని అభిప్రాయపడుతున్నారని తెలుస్తుంది!
రాష్ట్రంలో కోవిడ్ సమయంలోనూ, వరదలు వంటి కష్టకాలంలోనూ రాష్ట్రవ్యాప్తంగా వాలంటీర్ల సేవలు వర్ణానాతీతం అంటుంటారు వారి సేవలు పొందిన ప్రజానికం! మరిముఖ్యంగా కోవిడ్ మృతులను చూసేందుకు బంధుమిత్రులు, కన్నవాళ్ళు, కట్టుకునేవాళ్ళు సైతం వచ్చే సాహసం చేయలేని రోజుల్లో... వారి మృతదేహాలకు కర్మకాండలు జరిపించిన సేవకులు వాలంటీర్లు!
ఇక మరి ముఖ్యంగా గోదావరి జిల్లాల్లో వరదల్లో చిక్కుకుని మునిగిపోయి బిక్కుబిక్కుమంటున్న వారికి సైతం వాలంటీర్లే ఆపద్భాందవులు అయిన సంగతిని గుర్తుచేస్తున్నారు విశ్లేషకులు. వరద ప్రాంతాల్లో ఉన్నవారి కొసం పీకల్లోతు నీళ్లలో ఈదుకుంటూ వెళ్లి సరుకులు ఇచ్చి భరోసా ఇచ్చిన సొంత మనుషులు వాలంటీర్లు అని మరికొంతమంది చెబుతున్నారు. దీంతో... అలాంటి వారిమీద తన స్వార్ధ రాజకీయ ప్రయోజనం కోసం పవన్ వివాదాస్పద వ్యాఖ్యలు చేసి కష్టాన్ని కోరి తెచ్చుకున్నారని జనసేన నాయకులే అంటున్నారని తెలుస్తుంది.
గ్రామాల్లో వృద్ధులు, బాలింతలు.. ఇతర అభాగ్యులకు సొంత మనుషుల్లా సేవలు అందించే ఓ పెద్ద వ్యవస్థను.. అర్థజ్ఞానంతోనో, అజ్ఞానంతోనో తనకు వ్యతిరేకంగా మార్చుకున్నారని కొంతమంది జనసైనికులు సైతం వాపోతున్నారని అంటున్నారు. పోనీ తప్పైపోయింది అని క్షమాపణలు సైతం చెప్పలేక.. వచ్చిన రియాక్షన్ కి జంకి సన్నాయి నొక్కులు నొక్కుతున్నారనే కామెంట్లు వినిపిస్తున్నాయి.
దీంతో సుమారు పదిహేనేళ్లుగా రాజకీయాల్లో ఉన్నానని చెప్పుకుంటున్న పవన్ కు... ఎవరి గురించి ఏమి మాట్లాడాలో కూడా తెలియని అజ్ఞానంతో ఉన్నారా అని ఆఫ్ ద రికార్డ్ అంటున్నారట ఆయన అభిమానులు! ఇలాంటి రాజకీయ పరిజ్ఞానం ఉన్న నాయకుడితే రాజకీయాల్లో రాణించాలంటే... ఏదో తోకపట్టుకుని గోదావరి ఈదినట్లేనని జనసేన నాయకులు సైతం ఆఫ్ ద రికార్డ్ వాపోతున్నారని అంటున్నారు.
ఏది ఏమైనా... వాలంటీర్లపై చేసిన వ్యాఖ్యలవల్ల పవన్ తనను తాను పాతాళానికి తొక్కేసుకోవడమే కాకుండా... పార్టీ భవిష్యత్తుని, పార్టీని నమ్ముకున్న నేతలను, కార్యకర్తలను సైతం అధఃపాతాళానికి తొక్కేశారని అంటున్నారు పరిశీలకులు.