Begin typing your search above and press return to search.
కోడెల మరణం.. పోరాడితే బాగుండేది: పవన్
By: Tupaki Desk | 16 Sept 2019 3:55 PM ISTఏపీ శాసనసభా స్పీకర్ కోడెల శివప్రసాద్ రావు ఆత్మహత్య ఇప్పుడు రాజకీయంగా సంచలనమైంది. ఆయనపై కే ట్యాక్స్ పేరుతో పెద్ద ఎత్తున బాధితులు వచ్చి కేసులు పెట్టడం.. ఇక వరుస వివాదాలతో ప్రతిష్ట పోయి గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలోనే మనస్తాపం చెంది ఆత్మహత్యకు పాల్పడ్డారు.
అయితే తాజాగా కోడెల మరణంపై జనసేనాని పవన్ కళ్యాణ్ స్పందించారు. ఆయన మరణం తనను కలిచివేసిందన్నారు. రాజకీయవేత్తగా ఆయన అంచలంచెలుగా ఎదిగారని.. స్పీకర్ లాంటి ఉన్నత పదవులు అలంకరించారని పవన్ అన్నారు.
అంతటి ఉద్దండుడైన కోడెల శివప్రసాద్ రావు ఇలా రాజకీయంగా ఎదురవుతున్న ఒడిదుడుకులను తట్టుకోలేక తుది శ్వాస విడవడం తనను తీవ్ర దిగ్ర్భాంతికి గురిచేసిందని పవన్ హాట్ కామెంట్ చేశారు. తనపై వచ్చిన ఆరోపణలు, విమర్శలపై ఆయన రాజకీయ పోరాటం చేసి ఉంటే బాగుండేదని.. ఇప్పుడు ఆత్మహత్య చేసుకొని సమస్యలు ఎదుర్కోకుండా పోయారని ఆవేదన వ్యక్తం చేశారు.
కోడెల ఈ ఆపత్యాల సమయంలో ఆయనకుటుంబాన్ని విడిచి వెళ్లడం కరెక్ట్ కాదని.. ఆయన కుటుంబానికి మనోధైర్యం ఇవ్వాలని ఆత్మకు శాంతి చూకూరాలని పవన్ కళ్యాణ్ సంతాపం తెలిపారు.