Begin typing your search above and press return to search.
పవన్ పై బహుజన రచయితల ఫైర్!
By: Tupaki Desk | 4 Sept 2017 11:58 PM ISTజనసేన అధినేత - సినీ నటుడు పవన్ కల్యాన్ తన పుట్టిన రోజు సందర్భంగా అభిమానులతో ముచ్చటించిన సంగతి తెలిసిందే. ఆ సందర్భంగా అభిమాని అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ రిజర్వేషన్ల గురించి తన వ్యక్తిగత అభిప్రాయాన్ని వెల్లడించారు. వ్యక్తిగతంగా తనకు రిజర్వేషన్లు నచ్చవని - అయితే 2014 ఎన్నికల్లో కాపులకు రిజర్వేషన్ ఇస్తామన్నటీడీపీ తన హామీని నిలబెట్టుకోవాలని పవన్ అన్నారు. అంబేడ్కర్ కూడా రిజర్వేషన్లు శాశ్వతంగా ఉండాలని కోరుకోలేదని, ఒక కాల పరిమితి వరకే వాటిని సమర్థంగా అమలు చేసి అనంతరం ఎత్తివేయాలని సూచించారని గుర్తు చేశారు. అసలు రిజర్వేషన్లు లేని సమసమాజ సాధనే అంబేడ్కర్ కు మనం అర్పించే నిజమైన నివాళి అని పవన్ అన్నారు. అయితే, పవన్ వ్యాఖ్యలపై కొందరు దళిత సంఘాల నేతలు - రచయితల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
పవన్ వ్యాఖ్యలపై ఫిల్మ్ క్రిటిక్ కత్తి మహేష్ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. తన ఫేస్ బుక్ పేజ్ లో పవన్ ను విమర్శిస్తూ ఓ సుదీర్ఘ పోస్ట్ పెట్టారు. 'రాజ్యాంగం మీద అవగాహన - రాజకీయ పరిణతి చాలా దూరం. కనీసం కామన్ సెన్స్ లేని ఇలాంటి స్టేట్ మెంట్స్ పవన్ కల్యాణ్ తెలియనితనాన్ని సూచిస్తున్నాయి. తరతరాల రిజర్వేషన్ల అమలులోని అవకతవకలతో పోరాడుతూ, ఇప్పటికీ వివక్ష అనుభవిస్తున్న కోట్ల మంది దళితుల గురించి మాట్లాడని ఇతడు.. దళిత సమస్యలు - హత్యలు - ఆత్మహత్యలు జరిగినప్పుడు కనీసం ట్వీట్ చెయ్యని ఇతను.. ఇప్పుడు రిజర్వేషన్ల గురించి, అంబేద్కర్ గురించి మాట్లాడుతున్నాడు' అంటూ మహేష్ కత్తి ఘాటుగా స్పందించారు. ఇదే జనసేన పంథా అయితే, ఇదే ఇతగాడి "స్థాయి" అయితే, మనం తీవ్రంగా ఆలోచించాల్సిన విషయం' అని మహేశ్ కత్తి తన ఫేస్ బుక్ పోస్టులో పేర్కొన్నారు.
పవన్ వ్యాఖ్యలపై బహుజన రచయిత ఇండస్ మార్టిన్ స్పందించారు.' అంబేడ్కర్ కు నిజమైన నివాళంటే కులాలే లేని సమాజాన్ని సృష్టించడమే. ముందు ఆ 'కాపు ' కులం కార్డు వాడటం మాను. అప్పుడు రణగొణసేన ఏం ఖర్మా - నీ సినిమా చూసే ఒక్కడుండా నన్నడుగు. అక్షరం ముక్క చదువుకోనోడూ, అంబేడ్కర్ రాతల అట్టల్ని కూడా తాకని ప్రతోడూ రిజర్వేషన్ల గురించి సందేశాలివ్వడమే!' అని మార్టిన్ అన్నారు. రిజర్వేషన్లపై పవన్ వ్యాఖ్యలకు దళిత్ స్టూడెంట్స్ యూనియన్ ప్రతినిధి సుమన్ మాట్లాడారు. ఒకవైపు కాపుల సమస్యలు పరిష్కరించమంటూ మరో వైపు రిజర్వేషన్లు లేని సమాజం కావలంటూ పవన్ కుహాన ఆదర్శవాదం వినిపిస్తున్నారని సుమన్ దామెర అన్నారు. గాలి (పవన్) కళ్యాణ్ తాను గీసుకున్న జనసేన ఫ్రేమ్ లో నుంచి సమాజాన్ని చూస్తున్న విధానాన్ని బట్టి అతనికి మానసిక సమతుల్యత లేదని చెప్పారు. భారత రాజ్యాంగాన్ని ఏదో పంచాంగం లాగా లేదా పంచ్ డైలాగ్ లెక్క కాకుండా దమాక్ పెట్టి సదవాలని అన్నారు. రాజకీయాలు అంటే సైనిమా లో వీరోచిత పాత్రలు పోషించినట్టు కాదని చెప్పారు.
మొన్నటివరకూ ఇతన్ని చిరంజీవి తమ్ముడు అనుకునేవాడినని, అతడు అమిత్ షా రక్త బంధువు అని ఇప్పుడే తెలిసిందని బహుజన రచయిత నూకతోటి రవికుమార్ అన్నారు. పీకే ఏపీ అమిత్ షా అని, ఆయనను దేశంమంతా తిప్పే కష్టం నుంచి తప్పించే బాద్ షా అని చెప్పారు. పీకే ఏపీ లో కమల దళ వికాసం కోసం కష్టపడుతున్న కలల బేహారి అన్నారు. పవన్ కల్యాణ్ నోరు తెరిచి వివిధ సామాజిక అంశాలపై తన అమూల్య అభిప్రాయాలు వెలిబుచ్చాడంటే, అతడి బుర్రలో సరుకు లేదనే విషయం ఫ్యాన్స్ కి తెలిసిపోతుందని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.