Begin typing your search above and press return to search.

బీజేపీని గుడ్డిగా సపోర్ట్ చేయను... పవన్ షాకింగ్ కామెంట్స్

By:  Tupaki Desk   |   21 Jun 2023 5:00 PM GMT
బీజేపీని గుడ్డిగా సపోర్ట్ చేయను... పవన్ షాకింగ్ కామెంట్స్
X
టెక్నికల్ గా చూస్తే బీజేపీకి జనసేన మిత్రపక్షం. ఆ విషయంలో రెండు పార్టీలూ మీడియా ముందుకు వచ్చి అదే చెబుతూంటాయి. మరి ఆ మిత్ర బంధం విలువ ఎంతో ఆ పార్టీలకే తెలియాలి. రెండూ కలసి ఒక్క కార్యక్రమం కూడా నిర్వహించలేదు. ఇపుడు చూస్తే పవన్ వారాహి యాత్ర మొదలు పెట్టిన దగ్గర నుంచి బీజేపీ మీద కొంత సాఫ్ట్ గానే విమర్శలు చేస్తూ వస్తున్నారు.

వైసీపీకి బీజేపీ అండగా ఉందని అర్ధం వచ్చేలా ఆయన వారాహి యాత్ర సభలలో మాట్లాడుతూ అన్నారు ఇపుడు ముస్లిం మైనారిటీలతో మీటింగ్ ని కాకినాడలో పెట్టిన పవన్ బీజేపీ మీద కొన్ని హాట్ కామెంట్స్ చేశారు. తాను బీజేపీకి ఏ విషయంలోనూ గుడ్డిగా సపోర్ట్ చేయడంలేదని అన్నారు.

వైసీపీని పాతికకు 22 లోక్ సభ సీట్లు ఇచ్చి గెలిపిస్తే ఆ పార్టీ వెళ్లి బీజేపీకి ప్రతీ విషయంలో మద్దతు తెలియచేస్తోందని, దీన్ని ముస్లిం సోదరులు గుర్తించాలని పవన్ అంటున్నారు. ముస్లిం ఓట్లతో అధికారంలోకి వచ్చిన వైసీపీ బీజేపీకి లొంగిపోయిందని సంచలన కామెంట్స్ చేశారు.

ఇక జగన్ క్రిస్టియన్ కాబట్టి ముస్లిం సోదరులు గత ఎన్నికల్లో ఆయనకు ఓటు వేసి గెలిపించారని తీరా గెలిచిన తరువాత కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు ప్రజలకు మంచివా చెడ్డవా అని కనీసంగా ఆలోచన చేయకుండా వైసీపీ ఎంపీలు మద్దతు ఇస్తూ వచ్చారని ఆయన విమర్శించారు. తానైతే అలాంటి పని ఎపుడూ చేయను అని పవన్ అంటున్నారు.

మరో వైపుచూస్తే పార్టీలకు అతీతంగా ప్రతి రాజకీయ నేత ముస్లింలను ఓటు బ్యాంకుగానే చూస్తున్నారని పవన్ అనడం విశేషం. అదే విధంగా ప్రతి రాజకీయ నాయకుడు ముస్లిం టోపీ ఒకటి ధరించి ముస్లింలను వారి ఓట్ల కోసం కౌగిలించుకుంటారని, ఇదంతా . కేవలం వారి ఓట్ల కోసమే ముస్లింలతో ఇలా చేస్తున్నారని ఆయన విమర్శించారు.

ఇక తాను బీజీపీతో పొత్తులో ఉన్నామని అయినా సరే ఆ పార్టీ ఏది చెబితే అది గుడ్డిగా తలఉపే రకం కాదని పవన్ స్పష్టం చేశారు. ముస్లింల మద్దతు తనకు కావాలని అన్నారు. ముస్లిం సోదరులు కూడా రానున్న ఎన్నికల్లో అన్ని విషయాలను సక్రమంగా ఆలోచించి ఓటు హక్కు వినియోగించుకోవాలని ఆయన కోరారు.

మొత్తం మీద చూస్తూంటే పవన్ కళ్యాణ్ చేస్తున్న కామెంట్స్ బీజేపీకి గట్తిగానే తగులుతున్నాయని అంటున్నారు. ఆయన స్వరంలో మార్పు వస్తోంది. గతంలో కేంద్ర పెద్దలతో గుడ్ రిలేషన్స్ ఉన్నాయని చెప్పుకున్న పవన్ ఇపుడు ఏకంగా కేంద్రంలోని మోడీ సర్కార్ ప్రజా వ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటోందని, దానికి గుడ్డిగా వైసీపీ ఎంపీలు ఓటు చేస్తున్నారు అని చెప్పడం బట్టి చూస్తే పవన్ రాజకీయం రాటు దేలుతోందనే అంటున్నారు.