Begin typing your search above and press return to search.
అమెరికాలో మోడీకి దిమ్మ తిరిగే దెబ్బ..?
By: Tupaki Desk | 21 Sept 2015 12:13 PM ISTతమ సామాజిక వర్గానికి రిజర్వేషన్ లు కల్పించాలని కోరుతూ గుజరాత్ లోని పటేళ్ల వర్గం ఆందోళన చేయటం.. దానికి హార్దిక్ పటేల్ నేతృత్వం వహించటం తెలిసిందే. ఈ నిరసన ఎలాంటి పరిస్థితులకు దారి తీసిందో దేశవ్యాప్తంగా చర్చ రేపింది. తమను నిర్లక్ష్యం చేయటాన్ని ఏ మాత్రం సహించలేని పటేళ్లు.. మోడీకి షాక్ మీద షాకిచ్చారు. గుజరాత్ లో ఏంటి? ఈ సారి అమెరికాలోనే దిమ్మ తిరిగిపోయే నిరసన చేపడతామని చెబుతున్నారు.
ఇప్పటివరకూ అమెరికాకు వెళ్లిన మోడీకి అపూర్వ స్వాగతం మాత్రమే పలికి.. ఆయన్ను అప్యాయంగా అక్కున చేర్చుకోవటం మాత్రమే తెలుసు. అయితే.. అందుకు భిన్నంగా పటేళ్లు ఈదఫా పర్యటనలో మోడీకి మైండ్ బ్లాక్ అయ్యేలా చేస్తారంటన్నారు.
పటేళ్ల ఉద్యమం రుచిని మోడీకి చూపిస్తామని.. త్వరలో జరిపే నిరసనలో సిలికాన్ వ్యాలీలో 20 వేల మందితో.. న్యూయార్క్ లో 10 వేల మంది పటేళ్లు నిరసన తెలిపేందుకు సిద్ధమవుతున్నట్లు చెబుతున్నారు. తాము చేపట్టే నిరసనతో మోడీకి దిమ్మ తిరిగి పోవటం ఖాయమని.. ఆ దిశగా తాము ప్రయత్నాలు మొదలు పెట్టినట్లుగా పటేళ్ల ఉద్యమానికి సానుకూలంగా ఉన్న వారు చెబుతున్నారు.