Begin typing your search above and press return to search.

పార్ట్ టైమ్ ఎంపీ : చివరికి ఆయనేనా మళ్ళీ...?

By:  Tupaki Desk   |   30 May 2022 3:30 AM GMT
పార్ట్ టైమ్ ఎంపీ :   చివరికి ఆయనేనా మళ్ళీ...?
X
ఆయన తెలివే తెలివి అని చాలా మంది అంటారు. ఆయనది రాజకీయ నేపధ్యం కాదు, తన మానాన తాను వ్యాపారం చేసుకునే ఆయనకు రాజకీయ ఆసక్తి కలిగింది. వెంటనే కొత్త పార్టీగా వచ్చిన వైసీపీ నుంచి ఒక ప్రయత్నం చేస్తే పోలా అని గోదావరి జిల్లాల పాదయాత్రలో ఉన్న జగన్ని కలిశారు. అంతే ఏడాది తిరగకుండానే విశాఖ నుంచి ఎంపీ అయిపోయారు. ఆయనే ఎంవీవీ సత్యనారాయణ. అలా లక్కీ ఎంపీగా కూడా పేరు తెచ్చుకున్నారు.

ఇక గెలిచిన తరువాత మూడేళ్ళ పొలిటికల్ కెరీర్ చూస్తే ఈ ఎంపీ గారు పార్టీతో అంటీముట్టనట్లుగానే ఉంటూ వస్తున్నారు అని చెబుతారు. ఆయన తన వ్యాపారాలనే చూసుకుంటూ పార్ట్ టైమ్ పొలిటీషియన్ గానే ఉంటున్నారు అని అంటారు. ఆయన వైసీపీలో జరిగే ఏ కార్యక్రమంలోనూ పెద్దగా కనిపించిన దాఖలాలు లేవు. అదే విధంగా చూస్తే ఆయన ఎంపీగా ఉంటున్నా తన వ్యాపారాల మీదనే ఎక్కువగా ఫోకస్ చేస్తూ వచ్చారు.

ఇక విశాఖకు సంబంధించి ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలను ఎంపీగా ఆయన తీసుకురాలేకపోయారు అన్న విమర్శలు ఉన్నాయి. దాంతో మరో రెండేళ్ళ పదవీకాలం ఉండగానే ఎంపీగారు వచ్చే ఎన్నికల మీద దృష్టి సారించారు. ఈసారి ఆయనకు ఎంపీ గా టికెట్ రాకపోతే ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి డిసైడ్ అయ్యారు అని అంటున్నారు.

మరో వైపు ఆయనకు టీడీపీలో కూడా మిత్రులు ఉన్నారు. ఆ తెర వెనక బంధాల మీద కూడా వైసీపీలో అనుమానాలు ఉన్నాయని అంటున్నారు. అయితే ఆయన మాత్రం అన్ని ఆప్షన్లు రెడీ చేసి పెట్టుకున్నారు అని అంటున్నారు.

మొత్తానికి చూస్తే ఎంపీగా ఎంవీవీ బాగా ఎలివేట్ అయ్యారు. తన చిరకాల రాజకీయ కోరికను తీర్చుకున్నారు. ఆయన వల్ల పార్టీకి ఏమి ఒరిగింది, జరిగింది అంటే మాత్రం నిరాశే మిగులుతుంది.

ఇక విశాఖలోచూస్తే ఎంపీ అభ్యర్ధి కొరత వైసీపీకి చాలానే ఉందని అంటున్నారు. ఎంవీవీ కాకపొతే ఎవరు అన్న బిగ్ క్వశ్చన్ కూడా ఉంది. అలాగని కొత్త వారిని తెచ్చి నిలబెట్టాలని చూసినా అది సక్సెస్ అయ్యే సూచనలు లేవు అనే చెబుతున్నారు. ఈసారి గట్టి పోటీ నెలకొన్న నేపధ్యంలో గెలుపు అవకాశాలను అంచనా కడుతున్న వారు నో చెబుతున్నారుట. మొత్తానికి చూస్తే అటూ ఇటూ తిరిగి ఎంపీ టికెట్ మళ్ళీ ఎంవీవీకి ఇచ్చినా ఆశ్చర్యం లేదు అంటున్నారు. ఏది ఏమైనా అదృష్టవంతుడిగానే కాదు, తెలివైన రాజకీయ నేతగా కూడా ఎంవీవీ ఉన్నారని అంటున్నారు అంతా.