Begin typing your search above and press return to search.
అప్పుడు జగన్.. ఇప్పుడు బాబు.. సేమ్ టు సేమ్!
By: Tupaki Desk | 29 May 2019 8:00 PM ISTరాజకీయాల్ని కాసేపు పక్కన పెట్టేద్దాం. ఎవరు ఎవరికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తారు? ఎవరు ఎవరిని అభిమానిస్తారన్న విషయాల్ని వదిలేద్దాం. ఒక రాష్ట్రంలో ఒక మంచి సంప్రదాయాన్ని.. గౌరవపూర్వక విధానాల్ని అమలు చేయాల్సిన బాధ్యత ఉంది. కానీ.. రాజకీయాలు వ్యక్తిగత స్థాయికి పడిపోవటంతో.. ఒకరిపై ఒకరికి గౌరవ మర్యాదలు లేకుండా పోతున్న పరిస్థితి. అత్యున్నత స్థానాల్లో ఉండే వారి మధ్యే సంబంధాలు సరిగా లేకుంటే.. కింది స్థాయిలో పరిస్థితులు మరెంతలా పడిపోతాయో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరమే లేదు.
ఈ విషయం మీద మరింత క్లారిటీ రావాలంటే ఐదేళ్ల ఫ్లాష్ బ్యాక్ కు వెళ్లాల్సిందే. 2014 సార్వత్రిక ఎన్నికల్లో చంద్రబాబు కూటమి విజయం సాధించటం.. బాబు ప్రమాణస్వీకారం చేయటం తెలిసిందే. ముఖ్యమంత్రిగా తాను ప్రమాణస్వీకారం చేస్తున్న నేపథ్యంలో.. ఆ కార్యక్రమానికి హాజరు కావాలంటూ అప్పట్లో చంద్రబాబు విపక్ష నేత వైఎస్ జగన్ కు ఫోన్ చేశారు. ఆయన వేరే పనిలో బిజీగా ఉన్నారని.. కార్యాలయ సిబ్బంది చెప్పటంతో.. ప్రమాణస్వీకారోత్సవానికి రావాలని పిలిచేందుకు తాను ఫోన్ చేసినట్లుగా చెప్పారు. బహిరంగ సభగా నిర్వమించిన ప్రమాణస్వీకారోత్సవానికి నాడు జగన్ వెళ్లలేదు.
కట్ చేస్తే.. ఐదేళ్ల తర్వాత అదే సీన్ మరోసారి ఆవిష్కృతమైంది. కాకుంటే పాత్రలు మాత్రం మారాయి. తాను ప్రమాణస్వీకారం చేస్తున్న వేళ.. జగన్ టీడీపీ అధినేత చంద్రబాబుకు ఫోన్ చేశారు. ఆ సందర్భంగా ఆయన కార్యాలయ సిబ్బంది మాట్లాడుతూ.. సార్.. వేరే మీటింగ్ లో ఉన్నారని చెప్పటం.. ప్రమాణస్వీకారోత్సవానికి ఆహ్వానించేందుకు తాను ఫోన్ చేసినట్లు జగన్ చెప్పి పెట్టేశారు.
ఈ ఎపిసోడ్ ను చూసినప్పుడు ఐదేళ్ల క్రితం జగన్ ఏం చేశారో.. తాజాగా బాబు అదే పని చేశారని చెప్పాలి. ప్రమాణ స్వీకారోత్సవానికి బాబు వెళ్లకపోవటం వల్ల జరిగే నష్టం ఏమీ ఉండదు. కానీ.. రాజకీయాలకు అతీతంగా కొన్ని రిలేషన్లు ఉండాలన్న దానికి ఇలాంటివి అస్సలు సూట్ కావు. ఇదే తీరులో అధికార.. విపక్ష నేతలు ఫోన్లో మాట్లాడుకోవటానికి ఇష్టపడని వేళ.. రేపొద్దున ముఖ ముఖాలు చూసేందుకు సైతం ఇష్టపడరు. ఒక రాష్ట్రానికి కీలకమైన ఇద్దరు నేతలు ఎడముఖం.. పెడ ముఖంగా ఉంటే రాజకీయం మరెంత హాట్ హాట్ గా ఉంటుందో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరమే ఉండదని చెప్పకతప్పదు. నాగరిక రాజకీయాల్లో ఇలాంటివి సరైనవేనా?