Begin typing your search above and press return to search.

ఈ హాస్పిటల్ లో ముస్లింలకి ట్రీట్మెంట్ చేయరు..కమ్యూనల్ వైరస్ అంటూ ఓవైసీ ఫైర్!

By:  Tupaki Desk   |   15 April 2020 1:10 PM GMT
ఈ హాస్పిటల్ లో ముస్లింలకి ట్రీట్మెంట్ చేయరు..కమ్యూనల్ వైరస్ అంటూ ఓవైసీ ఫైర్!
X
కరోనా కట్టడిలో భాగంగా దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ అమలు అవుతుంది. ఈ మధ్య తొలిదశ లాక్ డౌన్ గడువు ముగియగా .. మరోసారి లాక్ డౌన్ ను మే 3 వరకు పొడిగించారు. ఈ విషయం పక్కన పెడితే ..దేశం మొత్తం కరోనా మహమ్మారి తో వణికిపోతున్న నేపథ్యంలో ముస్లింలకు తాము వైద్యం చేయమంటూ కరీంనగర్‌ లోని ఓల్గా పిల్లల ఆసుపత్రి ప్రకటించడంపై ఇప్పుడు సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

'తన చెల్లెలు పాపకు బాగోలేదని.. చికిత్స కోసం అపాయింట్‌ మెంట్‌ తీసుకోవడానికి మ‌హ్మ‌ద్ ఇషాదుద్దీన్ అనే వ్యక్తి ఫోన్ చేయగా.. ముస్లింలకు ఇక్కడ వైద్యం చేయరని ఆసుపత్రి సిబ్బంది' చెప్పే ఓ ఆడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్‌ గా మారింది. దీనిపై స్పందించిన మజ్లిస్ బచావో టేహ్రీక్ నేత అంజ‌దుల్లా ఖాన్… మంత్రి కేటీఆర్ - తెలంగాణ డీజీపి, - కరీంనగర్ కమీషనర్‌ లను ఆ ఆడియో ను ట్యాగ్ చేసి - ఆసుపత్రి సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. కొద్దీ సమయంలోనే ఈ ఆడియో బాగా వైరల్ అవ్వడంతో ఈ ఆడియో వ్యవహారం పై ఆసుపత్రి వర్గాలు స్పందించాయి.

హాస్పిటల్‌ లోని రిసెప్షన్ స్టాఫ్ అవగాహన లేక ఓపీ సేవలు బంద్ చేశామని చెప్పాల్సింది పోయి.. అలా చెప్పారని.. కొద్దిసేపటి తర్వాత తాను స్వయంగా ఇషాదుద్దీన్‌ కు కాల్ చేసి వాళ్ల పాపకు చికిత్స కూడా అందించామని డాక్టర్ సుజాత తెలిపారు. ఆడియో వైరల్ అయిన తర్వాత - ఆసుపత్రి డాక్టర్ తమకు ఫోన్ చేసి పిలిచారని - పాపకు చికిత్స చేయడమే కాకుండా జరిగిన దానికి క్షమాపణలు కూడా చెప్పారని మ‌హ్మ‌ద ఇషాదుద్దీన్ తెలిపాడు. ఇక ఈ ఘటన పై ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ ట్విట్టర్ ద్వారా స్పందించారు. ఈ కమ్యూనల్ వైరస్‌ పైన వెంటనే చర్యలు తీసుకోవాలని.. లేదంటే ప్రమాదకరంగా మారే అవకాశం ఉందని తెలిపారు. సరైన రీతిలో దీనిపై యాక్షన్ తీసుకోకపోతే.. అమాయకులైన ముస్లిం జీవితాలు ప్రమాదంలో పడతాయని అన్నారు. దీనిపై కరీంనగర్ కమీషనర్ మాట్లాడుతూ.. ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నాం అని - హాస్పిటల్ ల్యాబ్‌ లో పని చేసే ముస్లిం వ్యక్తి ఫోన్ కాల్ అటెండ్ చేసి ఇక్కడ ముస్లింలకు వైద్యం చేయరని చెప్పినట్లు గుర్తించామని తెలిపారు.