Begin typing your search above and press return to search.
ఏపీ వాహనాలకు తెలంగాణలో నో ఎంట్రీ
By: Tupaki Desk | 23 May 2021 10:00 PM ISTతెలంగాణలో లాక్ డౌన్ తో కేసులు తగ్గుముఖం పడుతున్న దృష్ట్యా మరింత కఠినంగా అమలు చేయాలని సీఎం కేసీఆర్ పోలీసులను ఆదేశించారు. దీంతో ఏపీ-తెలంగాణ సరిహద్దు వద్ద మరోసారి గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి.
లాక్ డౌన్ సడలింపు ఉంటుందన్న భావనతో ఏపీ నుంచి భారీగా వాహనదారులు తరలి వస్తున్నారు. దీంతో చెక్ పోస్టుల వద్ద భారీగా వాహనాలు నిలిచిపోయాయి.
తెలంగాణ-ఏపీ సరిహద్దులైన సూర్యపేట జిల్లా కోదాడ మండలం రామాపురం చెక్ పోస్టు వద్ద భారీగా ఏపీ వాహనాలను నిలిపివేయడంతో ట్రాఫిక్ జామ్ అయ్యింది. ఏపీ నుంచి వచ్చే వాహనాలను తెలంగాణ పోలీసులు అడ్డుకున్నారు.ఉదయం 10 గంటల వరకు మినహాయింపు ఉన్నా సరే వాహనాలను తెలంగాణలోకి పోనీయడం లేదు.
తెలంగాణలో ఎంట్రీకి ఈపాస్ అనుమతి తప్పనిసరి అని తెలంగాణ పోలీసులు స్పష్టం చేశారు.ఎమర్జెన్సీ వాహనాలకు గుర్తింపు కార్డులు తప్పనిసరి అని పేర్కొన్నారు.
తెలంగాణలో లాక్ డౌన్ ఆంక్షలు మరింత కఠినతరం చేశారు. రాత్రి 9 గంటల నుంచి ఉదయం 8 గంటల వరకు మాత్రమే సరుకు రవాణాకు అనుమతిస్తున్నారు. ఉదయం 10 గంటల తర్వాత గూడ్స్ వాహనాలకు అనుమతి నిరాకరిస్తున్నారు.