Begin typing your search above and press return to search.

బొజ్జ‌ల స‌ర్‌.. ఇక‌నైనా క‌ద‌లండ‌య్యా!

By:  Tupaki Desk   |   15 Sep 2022 3:39 AM GMT
బొజ్జ‌ల స‌ర్‌.. ఇక‌నైనా క‌ద‌లండ‌య్యా!
X
ఆయ‌న యువ నాయ‌కుడు, మాజీ మంత్రి, సుదీర్ఘ రాజ‌కీయ ప్ర‌స్థానం ఉన్న దివంగ‌త బొజ్జ‌ల గోపాల‌కృష్నారెడ్డి త‌న‌యుడు.. అయితే.. మాత్రం ఏం లాభం..? ఆయ‌న క‌ద‌ల‌డం లేదు. చెట్టు పేరు చెప్పుకొనేందుకు ఇస్తున్న ప్రాధాన్యం త‌నంత‌ట త‌ను.. పెంచుకునేందుకు మాత్రం ఇవ్వ‌డం లేదు. దీంతో అధిష్టానం ఆయ‌న‌ను క‌ద‌ల‌వ‌య్యా.. క‌దులు! అని హెచ్చరిస్తోంది. అయినా.. కూడా ఆయ‌న ప‌ట్టించుకోవ‌డం లేదు. ఆయ‌నే బొజ్జల సుధీర్ రెడ్డి. శ్రీకాళ‌హ‌స్తి నియోజ‌క‌వ‌ర్గం టీడీపీ ఇంచార్జ్‌గా ఉన్నారు. అయితే.. పేరు కు ఇంచార్జ్ అయినా.. ఆయ‌న ఇల్లు క‌ద‌ల‌డం లేద‌ని.. నాయ‌కులు చెబుతున్నారు.

గ‌త ఎన్నిక‌ల్లో తొలిసారి బొజ్జ‌ల సుధీర్ రెడ్డి ఇక్క‌డ నుంచి పోటీ చేశారు. అయితే వైసీపీ నాయ‌కుడు.. బియ్య‌పు మ‌ధుసూద న్‌రెడ్డిచేతిలో సుధీర్ రెడ్డి చిత్తుగా ఓడిపోయారు. మ‌ధుసూద‌న్ రెడ్డికి దాదాపు 38 వేల ఓట్ల మెజారిటీ ద‌క్కింది. అంటే.. ఆయ‌న హ‌వా ఏ రేంజ్‌లో ఉందో అర్ధ‌మ‌వుతుంది.

పోనీ.. పోల్ మేనేజ్ మెంట్ అయినా.. తెలుస్తుంది. మ‌రి దీనిని బ‌ట్టి అయినా.. సుధీర్ త‌న‌నుతాను సెట్ రైట్ చేసుకునేందుకు ప్రాధాన్యం ఇవ్వాలి క‌దా! అలా చేయ‌డం లేదు. ఎన్నిక‌లు అయిపోయి మూడు సంవ‌త్స‌రాలు గ‌డిచిపోయినా.. ఇప్ప‌టి వ‌ర‌కూ సుధీర్ రెడ్డి నియోజ‌క‌వ‌ర్గంలో ఎక్క‌డా క‌నిపించ‌డం లేదు.

గ‌తంలో మాజీ మంత్రిగా ఉన్న గోపాల‌కృష్ణ రెడ్డికి చంద్ర‌బాబుతో సాన్నిహిత్యం ఉంది. దీంతో ఆయ‌న కోర‌గానే కుమారుడికి టికెట్ ఇచ్చారు. ఇక‌, ఇప్పుడు కూడా ఇస్తారు. ఎందుకంటే.. కొన్నేళ్లుగా ఇక్క‌డ బొజ్జల రాజ‌కీయం న‌డుస్తుండ‌డ‌మే.

అయితే.. సుధీర్ యాక్టివ్‌గా లేక‌పోవ‌డ‌మే ఇప్పుడు పార్టీకి వ‌చ్చిన పెద్ద స‌మ‌స్య‌. ఎన్నిక‌ల‌ప్పుడు చూసుకుందాం అనే ధోర‌ణితో ఉన్నారనే వాద‌న టీడీపీలోనే వినిపిస్తోంది. నిజానికి గ‌త ఎన్నిక‌ల్లో ఓడిపోయిన పార్టీ నాయ‌కులు 10 వేల లోపు ఓట్ల‌తోనే ప‌రాజ‌యం పాల‌య్యారు. అయినా.. కూడా చాలా మంది అంతో ఇంతో యాక్టివ్ఃగానే ఉంటున్నారు.

కానీ, సుధీర్ రెడ్డి ఏకంగా 38 వేల ఓట్ల తేడాతో తొలిసారి బ‌రిలో నిలిచిన‌ ఎన్నిక‌ల్లోనే ఓడిపోయారు. మ‌రి ఇలాంటి నేప‌థ్యంలో.. వ‌చ్చే సారికి క‌నీస పోటీ ఇవ్వాల‌న్నా.. ఇప్ప‌టికే కార్య‌క్షేత్రంలోకి దిగాల్సింది. అయితే అలాంటి ప‌రిస్థితి మాత్రం క‌నిపించ‌డం లేదని పార్టీ నాయ‌కులు అధిష్టానానికి ఫిర్యాదులు చేశారు. దీంతో ఇటీవ‌ల లోకేష్ స్వ‌యంగా బొజ్జ‌ల‌కు ఫోన్ చేసి.. క‌ద‌ల‌వ‌య్యా.. క‌దులు అంటూ.. హెచ్చ‌రించారు. మ‌రి ఈ నేప‌థ్యంలో ఇప్ప‌టికైనా సుదీర్ క‌దులుతాడేమో చూడాలి.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.