Begin typing your search above and press return to search.
లోకేష్ నెంబర్ 3లోకి వెళ్లిపోయాడా... టీడీపీలో హాట్ టాపిక్ ఇదే..!
By: Tupaki Desk | 22 Oct 2022 7:00 PM ISTవచ్చే ఎన్నికలకు సంబంధించి.. టీడీపీ-జనసేన పొత్తు ఖాయమై పోయింది. ప్రస్తుతానికి.. ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం అంటూ.. చేతులు కలిపినా.. మున్ముందు మాత్రం ఎన్నికల పొత్తు కళ్లకు కడుతోంది. సరే.. రాజకీయాల్లో పొత్తులు కామన్.. కాబట్టి.. దీనిని ఎవరూ తప్పు పట్టాల్సిన అవసరం లేదు.
అయితే.. టీడీపీలో గత మూడేళ్లుగా.. మరీ ముఖ్యంగా గత ఏడాదిన్నరగా.. కర్త-కర్మ-క్రియ అంతా తానే అయి.. పార్టీని ముందుకు నడిపిస్తున్న పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పరిస్థితి ఏంటి? ఈ పొత్తు ద్వారా.. ఆయన కెరీర్‌కు మచ్చరాదా? అనే చర్చ పార్టీలో జోరుగా సాగుతోంది.
ఎందుకంటే.. టీడీపీ ప్రత్యర్థులైన.. వైసీపీ నాయకులు.. తాజాగా నారా లోకేష్‌పై కొన్ని కామెంట్లు చేశారు. ``లోకేష్ పని అయిపోయింది. ఆయన వల్ల.. పార్టీ పుంజుకోదని.. పార్టీలో నాయకులను కూడా నిలుపుకోలేమని భావించే.. ఇప్పుడు పవన్‌ను కలుపుకొని పోతున్నారు!`` అని మాజీ మంత్రి నాని అన్నారు. ఈ వ్యాఖ్యలు.. ఆసక్తిగా ఉండడంతోపాటు.. టీడీపీలోనూ చర్చకు వస్తున్నాయి. ఎందుకంటే.. పార్టీని ఒంటరిగా .. అధికారంలోకి తీసుకువస్తామని చెబుతున్న టీడీపీ నేతలు.. ఇప్పుడు.. పోయి పోయి జనసేనతో పోత్తుకు రెడీ అయ్యారు. దీనిని కొందరు స్వాగతించడం లేదు.
మరీ ముఖ్యంగా నారా లోకేష్ వర్గంగా ఉన్న యువత.. ఈ పొత్తుపై ఇప్పటి వరకు స్పందించలేదు. ఈ నేపథ్యంలో నారా లోకేష్‌పై చర్చ జోరుగానే సాగుతోందని అంటున్నారు. వచ్చే ఎన్నికల్లో లోకేష్ కీలకం కానున్నారని.. పార్టీ సీనియర్లు భావిస్తున్నారు. అయితే.. అనూహ్యంగా ఆయన మాత్రం ఇప్పుడు నెంబర్ 3 పొజిషన్‌లోకి వెళ్లిపోయారనేది సీనియర్ల వాదన. ఎందుకంటే.. చంద్రబాబు నెంబర్ 1 అయితే.. పవన్ 2 అవుతారు. ఇక, వారి మాటే చెల్లుబాటు అవుతుంది. దీంతో లోకేష్‌ను నమ్ముకున్న కేడర్.. ఆయన వర్గం.. పరిస్థితి ఏంటి? అనేది చర్చ.
వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా.. లోకేష్ తమకు టికెట్ ఇప్పిస్తారని భావిస్తున్న నాయకులు.. చాలా మంది జిల్లాల పర్యటనలో ఆయనకు జై కొడుతున్నా రు. సొంతగానే డబ్బులు తెచ్చుకుని.. మరీ ఖర్చు చేస్తున్నారు.
వీరందరికీ టికెట్లు ఇప్పిస్తానని.. గతంలో లోకేష్ తమకు హామీ ఇచ్చినట్టుగా వారు చెబు తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా పార్టీ వెళ్లి పవన్‌తో చేతులు కలపడంతో.. లోకేష్ పరిస్థితి ఏంటి? తమకు టికెట్ ఇప్పించగలడా? అని తర్జన భర్జనకు గురవుతున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.