Begin typing your search above and press return to search.

ఔను.. టీడీపీ నేత‌లే అలా అయిపోయారట‌!

By:  Tupaki Desk   |   30 Dec 2022 8:00 AM IST
ఔను.. టీడీపీ నేత‌లే అలా అయిపోయారట‌!
X
ఎన్నిక‌ల‌కు చాలా త‌క్కువ స‌మ‌యం ఉంద‌ని... నాయ‌కులు దూకుడుగా ముందుకు సాగాల‌ని.. టీడీపీ అధినేత చంద్ర‌బాబు ప‌దే ప‌దే చెబుతున్నారు. అంతేకాదు.. అస‌లు ఎన్నిక‌లు ఎప్పుడు వ‌స్తాయో కూడా తెలియ‌ద‌ని.. సో బీ అలెర్ట్‌గా ఉండాల‌ని కూడా ఆయ‌న చెబుతున్నారు. కానీ. ఈ మాట ఎవ‌రు వింటున్నారో.. ఎవ‌రు విన‌డంలేదో తెలుసుకునేందుకు చంద్ర‌బాబు ప్ర‌య‌త్నించారు.

ఈ క్ర‌మంలో అనంత‌పురం జిల్లాపై ఆయ‌న పెట్టిన నిఘాలో ఆస‌క్తికర మైండ్ బ్లోయింగ్ విష‌యాలు వెలుగు చూశాయ‌ట‌! అధికారంలో ఉన్నన్నాళ్లూ హడావుడి చేసిన టీడీపీ నేతలు ఇప్పుడు మాత్రం పత్తాలేకుండా పోయారని బాబుకు తెలిసింది. అంతేకాదు.. ఎన్నికల వేళ కిందిస్థాయి కార్యకర్తలను ఉసిగొలిపి రచ్చ చేస్తున్నార‌ని కూడా ఆయ‌న తెలిసింట‌. గ‌త ఎన్నిక‌ల్లో ఓటమి తర్వాత తలోదారి చూసుకున్న వారు ఇంకా .. రీచార్జ్ కాలేద‌ని స‌మాచారం అందింద‌ట‌!

తాను అదిలిస్తే.. క‌దిలిస్తే. ఏదో మ‌మ అంటూ.. చుట్టపు చూపుగా నియోజకవర్గాల్లో కనిపించి వెళ్లిపోతున్నా ర‌ని... దీంతో కేడర్‌ పరిస్థితి అగమ్యగోచరంగా మారిందని బాబుకు స‌మాచారం వ‌చ్చింద‌ని అంటున్నారు. కొందరు నాయకులు అయితే.. ఎన్నిక‌ల‌ ఫలితం తిరగబడే స‌రికి వెంట‌నే మ‌కాం మార్చేశార‌ట‌. ఉమ్మ‌డి అనంతపురం జిల్లాలో టీడీపీ నాయకులు ప‌దుల సంఖ్య‌లో ఇలానే ఉన్నార‌న్న‌ది.. బాబుకు తెలిసిన నిజం.

కానీ, ఇక్క‌డ చిత్రం ఏంటంటే.. వీరిని ఏమీ అన‌లేని ప‌రిస్థితి. ఎందుకంటే..వారే అక్క‌డ బ‌లంగా కూడా ఉన్నారు. అదేమ‌ని ప్ర‌శ్నిస్తే.. ఔను..ఎన్నిక‌ల‌కు డ‌బ్బులు కావాలి క‌దా. వాటిని సంపాయించుకునేందుకు పొరుగు ఊళ్ల‌కు వెళ్లాం అని కూడా చెబుతున్నార‌ట‌. ఎన్నికల సమయంలో ఊరూరూ తిరిగిన నేతలు ఇప్పుడు ఏదో ఊర్లో ఉండ‌డంతో నియోజ‌క‌వ‌ర్గంలో క‌నెక్టివిటీ త‌గ్గిపోతోంద‌న్న‌ది చంద్ర‌బాబు ఆవేద‌న. మ‌రి ఏం చేస్తారో చూడాలి.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.