Begin typing your search above and press return to search.

నోరు మూసుకో.. బాబా రాందేవ్ బాబా బెదిరింపు

By:  Tupaki Desk   |   31 March 2022 11:30 AM GMT
నోరు మూసుకో.. బాబా రాందేవ్ బాబా బెదిరింపు
X
యోగా గురువు బాబా రాందేవ్ లో కోపం కట్టలు తెంచుకుంది. తనను ప్రశ్నించిన ఓ జర్నలిస్టుపై ఆయన రెచ్చిపోయారు. ఏకంగా బెదిరించారు. పెట్రో ఉత్పత్తుల ధరల పెంపుపైన జర్నలిస్ట్ సూటిగా బాబా రాందేవ్ ను ప్రశ్నించడంతో ఆయనలో ఆగ్రహం వచ్చింది. ‘నోరు మూసుకో.. మంచిది కాదు.. మీ తల్లిదండ్రులకు మంచి కొడుకుగా ఉండాలంటూ’ హెచ్చరించారు. ఇప్పుడు ఈ వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. సోషల్ మీడియాలో దీనిపై నెటిజన్లు మండిపడుతున్నారు.

హర్యానాలోని కర్నాల్ లో రాందేవ్ ఒక కార్యక్రమానికి హాజరయ్యారు. గతంలో 2014 ఎన్నికల సమయంలో బాబా రాందేవ్ దేశంలోని ప్రజలకు ఒక అప్పీల్ చేశారు. లీటర్ పెట్రోల్ రూ.40. గ్యాస్ సిలిండర్ రూ.300 కి ఇచ్చే ప్రభుత్వాన్ని ఎన్నుకోవాలని సూచించారు. ఇప్పుడు ఆ పాత హామీనే ఒక విలేకరి సూటిగా బాబా రాందేవ్ ను ప్రశ్నించారు. దీంతో ఒక్కసారిగా రాందేవ్ బాబా సహనం కోల్పోయిన తన నోటికి పని చెప్పారు. ఇలాంటి ప్రశ్నలు వేయవద్దంటూ హితవు పలికారు. నీకు సమాధానం ఇవ్వడానికి నేను నీ కాంట్రాక్టర్ ను కాదు’ అని కోపడ్డారు. అన్ని ప్రశ్నలకు సమాధానం ఇవ్వాల్సిన పని లేదంటూ ఫైర్ అయ్యారు. దీనిపైనే మరోసారి అదే విలేకరి ప్రశ్నించే ప్రయత్నం చేశారు.

రాందేవ్ బాబా ఆగ్రహంతో రెచ్చిపోయారు. ‘అవును.. అప్పుడు నేను అలాగే చెప్పాను. నువ్వేం చేస్తావ్.. నోరు మూసుకో.. మళ్లీ ఇటువంటి ప్రశ్నలు అడగవద్దు. మంచిది కాదు.. నువ్వు నీ తల్లిదండ్రులకు మంచి కొడుకుగా ఉండాలి అంటూ’ హెచ్చరించారు.

ఇక ఇంధన ధరల పెంపుపైనా రాందేవ్ బాబా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇంధన ధరలు తగ్గితే పన్ను రాదని చెప్పారు. దేశాన్ని ఎలా నడుపుతారని.. జీతాలు చెల్లిస్తారని.. రోడ్లు ఎలా వేస్తారని ప్రశ్నించారు. కష్ట సమయాల్లో మరింత కష్టపడి పనిచేయాలని రాందేవ్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. తాను కూడా తెల్లవారుజామున 4 గంటలకు నిద్రలేచి రాత్రి `0 గంటల వరకూ పనిచేస్తానని చెప్పుకొచ్చారు. రాందేవ్ సీరియస్ అయిన వ్యవహారం ఇప్పుడు వైరల్ అవుతోంది.

రాందేవ్ బాబా వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. నెటిజన్లు కొందరు పాజిటివ్ గా..కొందరు నెగెటివ్ గా స్పందిస్తున్నారు