Begin typing your search above and press return to search.

నవీన్ కుమార్ మృతదేహం లభ్యం

By:  Tupaki Desk   |   21 Sept 2020 10:30 PM IST
నవీన్ కుమార్ మృతదేహం లభ్యం
X
హైదరాబాద్‌ లోని సరూర్ ‌నగర్‌ చెరువు లో ఆదివారం సాయంత్రం గల్లంతైన నవీన్ కుమార్‌ మృతదేహం ఆచూకీ లభ్యమైంది. ఎన్డీఆర్ ఎఫ్ బృందాలు గంటల తరబడి చెరువులో తీవ్రంగా గాలించి మృత దేహాన్ని బయటకు తీశారు. నిన్న గల్లంతైన ప్రదేశానికి 30 మీటర్ల దూరంలో నవీన్‌ మృతదేహాన్ని గుర్తించినట్టు జీహెచ్‌ఎంసీ అధికారులు తెలిపారు. రాత్రి వర్షంతో రెస్క్యూ ఆపారు. సోమవారం ఉదయం మళ్లీ రెస్క్యూ మొదలుపెట్టారు. ఉదయం మొత్తం బోట్లతో గాలించారు. అయితే చెరువులో ఒండ్రు మట్టి ఎక్కువగా ఉండటంతో.. పడవలు తిరిగే పరిస్థితి కనిపించలేదు. దీంతో బోట్స్ తో గాలించే పనిని ఆపేసింది NDRF టీం. బోట్లతో గాలింపు ఆపి.. నేరుగా చెరువులోకి దిగి గాలించారు NDRF సిబ్బంది.

స్కూటీపై వెళ్తూ నిన్న సరూర్‌నగర్‌ చెరువులో నవీన్ గల్లంతైన విషయం తెలిసిందే. సరూర్ నగర్ చెరువు కట్ట నుంచి తపోవన్ కాలనీ వైపు వెళ్లే దారిలో వరద నీటిలో అల్మాస్ ‌గూడకి చెందిన నవీన్ కుమార్ కొట్టుకుపోయాడు. నాలా వద్ద ద్విచక్ర వాహనం మొరాయించడంతో వెనుక కూర్చున్న వ్యక్తి కిందికి దిగి దాన్ని తోసేందుకు ప్రయత్నించాడు. ఒక్కసారిగా వరద ఉధృతి పెరిగింది. దీంతో అందరూ చూస్తుండగానే నవీన్ కొట్టుకుపోయాడు. నవీన్ కుమార్ ఎలక్ట్రీషియన్‌ గా పని చేస్తున్నాడు. నవీన్‌కు భార్య, ఇద్దరు పిల్లున్నారు. నవీన్‌ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. రూర్‌ నగర్‌లో జరిగిన ఈ ఘటన హైదరాబాద్ లో కలకలం రేపుతోంది.