Begin typing your search above and press return to search.
ఫ్యూచర్ మేడిన్ ఏపీ కారుతో సెల్ఫీ
By: Tupaki Desk | 26 Feb 2018 1:03 PM ISTఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు కుమారుడు.. మంత్రి నారా లోకేశ్ ఈ రోజు సెల్ఫీ తీసుకోవటానికి ముచ్చటపడిపోయారు. ఇప్పుడు నడుస్తున్న సెల్ఫీల కాలంలో ఇదో పెద్ద విషయమా? అని అనుకోవద్దు. ఎందుకంటే ఆయన అంతలా ముచ్చటపడింది ఏ పెద్ద నాయకుడ్నో.. బిజినెస్ మేగ్నేట్ తో కాదు.. కారుతో.
చినబాబు ఏంది.. కారు ముందు నిలబడి సెల్ఫీ తీసుకోవటానికి అంత ఆసక్తి ప్రదర్శించటానికి కారణం ఏమిటన్న సందేహం రావొచ్చు. దానికి కారణం లేకపోలేదు. ఆంధ్రప్రదేశ్ లో కొరియా కార్ల సంస్థ కియో మోటార్స్ కంపెనీని స్టార్ట్ చేస్తున్న విషయం తెలిసిందే కదా. ఆ కార్లు ఎలా ఉంటాయన్న ఆసక్తి చాలామందిలో ఉంది.
ఎందుకంటే.. మేడిన్ ఏపీ కదా. తెలుగు నేల మీద పూర్తిస్థాయిలో తయారవుతున్న కారు అంటే మామూలు కాదు కదా. పేరుకు మేడిన్ ఇండియా అని ఉన్నప్పటికీ మేకిన్ ఏపీ అన్నది ఒక ఎత్తు అయితే.. తమ ప్రభుత్వంలో సాధించిన విజయంగా భావిస్తున్న చినబాబు లోకేశ్ కారు ముందు ఫోటో దిగి ముచ్చట తీర్చుకున్నారు.
విశాఖపట్నంలో నిర్వహిస్తున్న భాగస్వామ్య సదస్సుకు హాజరయ్యారు.ఈ సందర్భంగా కియో కార్ల సంస్థ ఏర్పాటు చేసిన స్టాల్ ను ఆసక్తిగా పరిశీలించారు. ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన కారును ఎక్కి.. లోపలి భాగాన్ని పరిశీలించటమే కాదు.. ఏపీలో తయారు చేసే కారు ఇదే రీతిలో ఉంటుందా? అని అడిగి తెలుసుకున్నారు.
పెట్రోల్. డీజిల్.. విద్యుత్ తో నడిచే హైబ్రీడ్ కార్లను లోకేశ్ ఈ సందర్భంగా పరిశీలించారు. అనంతరం సెల్ఫీ తీసుకొన్నారు. సీఎం కొడుకు కమ్ మంత్రి తమ కార్లతో సెల్ఫీ తీసుకోవటాన్ని కియో కంపెనీ ప్రతినిధులు హ్యాపీగా ఫీలయ్యారు.