Begin typing your search above and press return to search.
హారతితో దెబ్బ పడినా బుద్ధి రాలేదా చినబాబు!
By: Tupaki Desk | 9 July 2019 3:46 PM ISTపావలా పని చేసి రూపాయి పావలా ప్రచారంతో పాలనను నడిపిన చంద్రబాబు హయాంలో చోటు చేసుకున్న చమక్కులు అన్ని ఇన్ని కావు. ప్రజల్లో భావోద్వేగాల్ని రగల్చటంతో పాటు.. మైలేజీ మొత్తం తమ ఖాతాలోకి మరల్చుకునేందుకు బాబు సర్కారుపడిన పాట్లు అన్నిఇన్ని కావు. నీళ్లు కనిపించిన ప్రతిచోటా హారతుల పేరుతో హడావుడి చేసిన వైనం తెలిసిందే.
ఇందుకోసం ప్రజా ధనాన్ని పప్పు బెల్లాల మాదిరి ఖర్చు చేసిన సంగతి తెలిసిందే. కృష్ణ హారతులు.. గోదావరి హారతులతో హడావుడి చేసిన చంద్రబాబు అనంతరం అనంతపురం జిల్లాకు వెళ్లి హంద్రీనావాకు హారతులు ఇచ్చిన వైనాన్ని మర్చిపోలేం. ఇంత హడావుడి చేసినా హంద్రీనావా క్రెడిట్ బాబు ఖాతాలో పడింది లేదు.
హంద్రీనీవా ఎవరి హయాంలో జరిగిందో అందరికి తెలిసినప్పటికీ.. దాన్ని తనదిగా చెప్పుకునే ప్రయత్నం చేసిన చంద్రబాబును అనంతపురం జిల్లా ప్రజలు ఎంతలా తిరస్కరించారో ఎన్నికల ఫలితాలు చెప్పేశాయి. ఆసక్తికరమైన విషయం ఏమంటే.. బాబు ఎక్కడెక్కడ హంద్రీనీవాకు హారతులు ఇచ్చారో.. అన్నిచోట్ల ఓడిపోవటం కనిపిస్తుంది. ఇంత జరిగిన తర్వాత కూడా తమది కాని వాటి కోసం బాబు అండ్ కో ఆశ పడటం కనిపించక మానదు.
బాబు హారతుల ఎపిసోడ్ కు కొనసాగింపుగా తాజాగా చినబాబు హారతుల్ని షురూ చేయటం చూస్తే.. ప్రజల తిరస్కృతిని సరిగా అర్థం చేసుకోలేదన్న భావన కలగటం ఖాయం. పట్టిసీమ ద్వారా నీళ్లు అప్పగించారంటూ.. ఇప్పుడు లోకేశ్ హారతి ప్రోగ్రామ్ ను పెట్టుకున్నారు. ఈ హారతితో బాబు కీర్తిని చాటి చెప్పాలన్నది చినబాబు ఆశగా చెప్పాలి. అయితే.. పట్టిసీమకు తరలించిన నీళ్లకు వినియోగించిన కాలువ నిర్మాణం 80 శాతం వైఎస్ హయాంలో జరిగినదే.
పోలవరం ప్రాజెక్టులో భాగంగా సిద్ధం చేసిన కాలువ ద్వారానే పట్టిసీమ నీళ్లను తరలించిన వైనాన్ని వదిలేసి.. క్రెడిట్ మొత్తం తన తండ్రి ఖాతాలో వేసేందుకు లోకేశ్ పడుతున్న ప్రయాసతో ఎలాంటి ప్రయోజనం లేదన్న మాట వినిపిస్తోంది. ఎన్నికల ఫలితాలు చూసిన తర్వాతైనా తీరు మారకపోవటం గమనార్హం.