Begin typing your search above and press return to search.
వైసీపీ సత్తా ఏంటో ఒప్పుకున్న లోకేష్
By: Tupaki Desk | 10 Sept 2017 4:36 PM ISTఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తనయుడు, రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ తమ రాజకీయ ప్రత్యర్థి అయిన వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ గురించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఒకవైపు వైసీపీపై ఉన్న రాజకీయ కక్షను బయటపెట్టుకుంటేనే...మరోవైపు ఆ పార్టీని ఓట్లు - సీట్లు పడకుండా చేయలేకపోయామని అంగీకరించారు. అయితే అంతలోనే భవిష్యత్‌లో మొత్తం సీట్లు గెలిచేస్తుందని ప్రకటించారు!
విజయవాడలో జరిగిన కార్యక్రమంలో మంత్రి లోకేష్ మాట్లాడుతూ రాష్ట్రంలో తాజాగా జరిగిన నంద్యాల ఉప ఎన్నిక - కాకినాడ కార్పొరేషన్ ఎన్నికల ఫలితాలతో 2019 ఎన్నికల్లో టీడీపీదే విజయం అని అర్థం అవుతోందన్నారు. కాకినాడలో తమ ప్రత్యర్థి అయిన వైసీపీని సింగిల్ డిజిట్ కే పరిమితం చేయాలనుకున్నా సాధ్యం కాలేకపోయిందని లోకేష్ అంగీకరించారు. అయితే ఈ కామెట్ వెంటనే సరిదిద్దుకొని వచ్చే సాధారణ ఎన్నికల్లో ప్రతిపక్ష వైసీపీకు అడ్రస్ లేకుండా చేస్తామని లోకేష్ వ్యాఖ్యానించారు. అయితే ఒక్క కార్పొరేషన్ ఎన్నికల్లోనే వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయాన్ని అడ్డుకోలేని వారు భవిష్యత్ లో ఆ పార్టీని గల్లంతు చేయడం సాధ్యమయ్యే పనేనా అని రాజకీయవర్గాలు చర్చించుకుంటున్నాయి.
కాగా, కృష్ణాడెల్టాకు నీటి కొరత లేకుండా చేసిన ఘనత ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడికే దక్కిందని మంత్రి లోకేష్ పేర్కొన్నారు. ‘రాయలసీమలో సీఎం ఒకపక్క.. ప్రతిపక్షనేత మరోపక్క ఉన్నారు. కానీపట్టిసీమ వద్దన్న ఏకైక వ్యక్తి ప్రతిపక్ష నేత జగన్ మాత్రమే’ అని లోకేష్ మండిపడ్డారు. దేశంలోనే ప్రథమంగా నదుల అనుసంధానానికి రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి సీఎం నాయకత్వం లో శ్రీకారం చుట్టిందన్నారు. గోదావరి జలాలను కృష్ణానదికి అనుసంధానం చేయడం ద్వారా కృష్ణాడెల్టాలోని పంటలను కాపాడుకోగలిగామన్నారు. జలమే జీవనమని - నీటి సంరక్షణతోనే భావి భవిష్యత్తును ఉజ్వలంగా తీర్చిదిద్దగలుగుతామన్న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆలోచనలకు అనుగుణంగా జలసిరికి హారతి కార్యక్రమాన్ని మూడు రోజులపాటు రాష్ట్ర వ్యాప్తంగా పెద్దఎత్తున చేపట్టినట్లు వివరించారు.