Begin typing your search above and press return to search.
లోకేష్ ఎందుకు ఈ మౌనం.. టెన్షనా?
By: Tupaki Desk | 17 April 2019 8:00 PM ISTఎన్నికల ముందు బాగానే హడావుడి చేసిన నారా లోకేష్ బాబు పోలింగ్ తర్వాత మాత్రం కామ్ అయిపోయారు. పోలింగ్ రోజున కూడా తన ప్రసంగంతో కామెడీని పండించిన లోకేష్.. ఆ తర్వాత మాత్రం మౌనం వహిస్తూ ఉన్నారు. ఒకవైపు పోలింగ్ సాగుతూ ఉండగా.. పోలింగ్ బూత్ లలో సౌకర్యాలు సరిగా లేవని - పోలింగ్ బూత్ లలో బిస్కెట్లు ఇవ్వలేదని వ్యాఖ్యానించారు లోకేష్.
ఓటు వేయడం ప్రజల బాధ్యత. కాస్తో కూస్తో ఇబ్బందులు తప్పకపోవచ్చు. అలాంటి చోట టీలు ఇవ్వలేదు - కాఫీలు ఇవ్వలేదు - బిస్కెట్లు ఇవ్వలేదు అని.. ప్రజలు కూడా ఎవరూ గోల చేయడం లేదు. అదేమీ వెడ్డింగో లేక వేరే ఫంక్షనో కాదు. ఆ విషయం ప్రజలకు తెలసు. అయితే లోకేష్ కు మాత్రం అది అర్థం అయినట్టుగా లేదు. అందుకే అలా మాట్లాడారు అనే కామెంట్లు వినిపిస్తూ ఉన్నాయి.
అలా పోలింగ్ రోజున కూడా తన ప్రసంగంతో ప్రహసనం పాలైన లోకేష్ ఆ తర్వాత మాత్రం పూర్తిగా కామ్ అయిపోయారు. ఈవీఎంల మీద కానీ, ఇతర వ్యవహారాల మీద కానీ లోకేష్ మాట్లాడటం లేదు. ఎందుకలా? లోకేష్ రిలాక్స్ అవుతున్నారా? అని ఆరా తీస్తే.. అలాంటిది ఏమీ లేదని, ఇప్పుడు లోకేష్ పూర్తిగా టెన్షన్లో ఉన్నారని అంటున్నారు.
మంగళగిరి నియోజకవర్గంలో లోకేష్ గురించి ఉన్న ఊహాగానాలు - అంచనాల గురించి వేరే చెప్పనక్కర్లేదు. అక్కడ విజయం లోకేష్ కు ఎంత ప్రతిష్టాత్మకమో, అంతే స్థాయిలో సందేహం కూడా. అందుకే.. ఇప్పుడు లోకేష్ బాబు టెన్షన్లో పడ్డారని.. మంగళగిరిలో ఓడిపోతే అది లోకేష్ తదుపరి రాజకీయ జీవితానికి పెను దెబ్బగా మారుతుంది.
ఆయన విజయం నల్లేరు మీద నడకేమీ కాదని బయటి వాళ్లకు స్పష్టంగా తెలిసిపోతోంది. గెలిచినా స్వల్ప మెజారిటీతోనే అని అంటున్నారు. ఈ పరిణామాల మధ్యన లోకేస్ పూర్తిగా టెన్షన్లో ఉన్నారని, ఇక వేరే అంశాల గురించి ఆయన స్పందించే పరిస్థితి లేదని టాక్!