Begin typing your search above and press return to search.
టీఆర్ ఎస్ కు షాక్.. బీజేపీలోకి కీలకనేత..!
By: Tupaki Desk | 9 Sept 2019 6:13 PM ISTమంత్రి వర్గ విస్తరణ.. తదనంతర పరిణామాలు.. కేసీఆర్ కు చెమటలు పట్టిస్తున్నాయి. తనకు మంత్రి ఇస్తా నని చెప్పిన కేసీఆర్ ఇవ్వకపోవడంపై ఇప్పటికే తీవ్ర వ్యాఖ్యలతో కేసీఆర్ ను టార్గెట్ చేశారు మాజీ హొం మంత్రి నాయిని నరసింహారెడ్డి. తనను - తన అల్లుడికి కూడా పదవులు ఇస్తానని కేసీఆర్ మాట తప్పారంటూ ఆయన వ్యాఖ్యలు సంధించారు. నాయిని విషయం తీవ్ర దుమారం రేపుతున్న సమయంలోనే మరో కీలక నాయకుడు మైనంపల్లి హనుమంతరావు కూడా కేసీఆర్ ను టార్గెట్ చేశారు.
తాజాగా జరిగిన మంత్రి వర్గ విస్తరణలో తనకు కూడా బెర్త్ ఇస్తానన్న కేసీఆర్.. తనను పట్టించుకోలేదని ఆయన అలక బూనారు. అంతేకాదు. సోమవారం ప్రారంభమైన అసెంబ్లీ సమావేశాలకు మైనంపల్లి డుమ్మా కొట్టారు. ఏకంగా బెంగళూరు వెళ్లిపోయారని తెలుస్తోంది. టీడీపీ రాజకీయాల్లో కీలక నాయకుడిగా ఉన్న మైనంపల్లి.. రెండు సార్లు విజయం సాధించారు. ఆ తర్వాత 2014లో బీజేపీలోకి చేరేందుకు ప్రయత్నించారు. అయితే, ఈ విషయం తెలిసిన కేసీఆర్.. ఆయనను తన పార్టీలోకి చేర్చుకుని మల్కాజ్ గిరి ఎంపీ టికెట్ ఇచ్చి ప్రోత్సహించారు. కానీ, ఆయన ఓడిపోయారు.
తాజాగా జరిగిన ఎన్నికల్లో మల్కాజ్ గిరి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. అప్పటి నుంచి మంత్రి వర్గంలో చోటు కోసం ప్రయత్నిస్తున్నారు. నిజానికి కేసీఆర్ సామాజిక వర్గానికే చెందిన హనుమంతరావుకు మంత్రి వర్గంలో బెర్త్ లభించడం అంటే సంచలనమే అవుతుంది. ఈ విషయం ఆయనకు కూడా తెలుసు. అయితే, తనకు మంత్రివర్గంలో చోటు ఇస్తానని కేసీఆర్ హామీ ఇచ్చినట్టు తన అనుచరలతో హనుమంతరావు చెబుతున్నారు. ఈ క్రమంలోనే ఆయన భారీగా ఆశలు పెట్టుకున్నారు.
వెలమ వర్గం నుంచి కేసీఆర్ మంత్రిగా ఉంటే ఎర్రబెల్లితో పాటు తాజాగా హరీష్ - కేటీఆర్ కూడా చేరారు. దీంతో నాలుగు మంత్రి పదవులు ఆ వర్గానికే ఉన్నాయి. అయితే, తాజాగా జరిగిన విస్తరణలో ఆయనకు అవకాశం దక్కక పోవడంతో కినుక వహించారు. ఆ వెంటనే ఆయన నగరంలో కూడా ఉండకుండా బెంగళూరు వెళ్లిపోయారు. ఇక, ఎవరు ఎప్పుడు తమ పార్టీలోకి వస్తారా? అని ఎదురు చూస్తున్న బీజేపీ నేతలు ఇప్పుడు మైనంపల్లి అసంతృప్తిని తనకు అనుకూలంగా మార్చుకునేందుకు ప్రయత్నిస్తున్నట్టు సమాచారం. ఇదే జరిగితే.. కేసీఆర్ కు భారీ షాక్ తప్పదు.