Begin typing your search above and press return to search.
గొడవ చేయొద్దని చెప్పాడని మర్డర్ చేశాడు
By: Tupaki Desk | 23 Aug 2020 10:00 AM ISTఏపీలోని ప్రకాశం జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. నిత్యం పూటుగా తాగి.. అల్లరి చేయటం.. గొడవలతో ప్రశాంత వాతావరణాన్ని చెడగొడుతున్న ఒక వ్యక్తిని.. పెద్ద వయసులో ఉన్న ఒక వ్యక్తి మందలించిన వైనం అతడి ప్రాణాల్ని పోయేలా చేసింది. చీరాలలోని తోటవారిపాలెంలో ఒక రౌడీషీటర్ ను తాగి గొడవ చేయొద్దని చెప్పిన దానికి హత్య చేసిన దారుణం చోటు చేసుకుంది.
పలు కేసుల్లో నిందితుడి ఉన్న సురేందర్.. నిత్యం తాగి గొడవ చేసేవాడు. దీంతో.. చుట్టుపక్కల వారికి ఇబ్బందికరంగా మారింది. ఈ క్రమంలో అక్కడే నివాసం ఉంటే రిటైర్డ్ ఏఎస్ఐ నాగేశ్వరరావు.. సదరు రౌడీ షీటర్ ను మందలించాడు. తాగి అల్లరి చేయొద్దన్నాడు.
దీంతో.. ఆగ్రహానికి గురైన సురేందర్.. శనివారం అర్థరాత్రి దాటిన తర్వాత రిటైర్డు ఏఎస్ఐ ఇంట్లోకి జొరబడి.. కర్రలతో విచక్షణారహితంగా దాడికి పాల్పడడ్డాడు. దీంతో.. తీవ్ర గాయాలపాలైన ఆయన అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు. ఈ సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి హుటాహుటిన చేరుకున్నారు. అప్పటికే నిందితుడు పారిపోయాడు. కేసు నమోదు చేసిన పోలీసులు.. నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.