Begin typing your search above and press return to search.

మూడు రోజులుగా డ్రోన్లు.. మంత్రి వెల్ల‌డించిన సంచ‌ల‌న నిజం

By:  Tupaki Desk   |   16 Aug 2019 11:50 AM GMT
మూడు రోజులుగా డ్రోన్లు.. మంత్రి వెల్ల‌డించిన సంచ‌ల‌న నిజం
X
రాష్ట్రంలో అధికార‌, ప్ర‌తిప‌క్ష నేత‌ల మ‌ధ్య తీవ్ర‌స్థాయిలో రాజ‌కీయ యుద్దం జ‌రుగుతున్న విష‌యం తెలిసిం దే. నాయ‌కులు ప‌ర‌స్ప‌రం దూషించుకోవ‌డం, పైచేయి సాధించేందుకు ప్ర‌తిప‌క్షం ఆరాట ప‌డుతున్న విష యం గ‌మ‌నార్హం. ఈ క్ర‌మంలో తాజాగా మ‌రోసారి చంద్ర‌బాబు నివాసం వార్త‌ల్లోకి వ‌చ్చింది. జ‌గ‌న్ ప్ర‌భుత్వం ఏర్ప‌డిన తొలినాళ్ల‌లో ఈ విష‌యం చ‌ర్చ‌కు వ‌చ్చింది. నదీ గ‌ర్భంలో దీనిని నిర్మించారంటూ.. సాక్ష‌త్తూ ప్ర‌భుత్వాధినేత జ‌గ‌న్.. అసెంబ్లీలోనే చ‌ర్చకు తెర‌దీశారు. ఇక‌, ఆ త‌ర్వాత కూడా దీనిపై పెద్ద ఎత్తున ర‌గ‌డ సాగింది. దీనిని తొల‌గిస్తారా? తొల‌గించ‌మంటారా? అంటూ.. సీఆర్ డీఏ అధికారులు నివాస య‌జ‌మాని లింగ‌మ‌నేనికి నోటీసులు ఇచ్చారు.

అయితే, ఆయ‌న కోర్టును ఆదేశించ‌డంతో ప్ర‌స్తుతం ఈ కేసు పెండింగ్‌ లో ఉంది. అయితే, ఇప్పుడు ఎగువ రాష్ట్రాల్లో కురుస్తున్న వ‌ర్షాల‌కు కృష్ణ‌మ్మ మ‌హొగ్ర‌రూపం దాల్చింది. ఈ క్ర‌మంలోనే ప్ర‌కాశం బ్యారేజీకి కూడా నీరు వ‌స్తోంది. దీంతో చంద్ర‌బాబు నివాసం ఉంటున్న ప్రాంతానికి కూడా నీరు ముట్ట‌డించే ప్ర‌మాదం ఏర్ప‌డింది. ఈ క్ర‌మంలోనే మొన్నామ‌ధ్య ఇసుక మేట‌ల‌తో ప్ర‌వాహానికి అడ్డు క‌ట్ట వేయాల‌ని నిర్ణ‌యించారు. ఇంత‌లోనే చంద్ర‌బాబు నివాసం చుట్టూ.. నీరు చేర‌డం, దీనిని చిత్రీక‌రించేందుకే.. అన్న‌ట్టుగా అక్క‌డ డ్రోన్ కెమెరాలు ప్ర‌త్య‌క్షం కావ‌డం రాజ‌కీయ ర‌గ‌డ‌కు దారితీసింది.

టీడీపీ ఈ విష‌యాన్ని తీవ్రంగా తీసుకుంది. త‌మ‌పై రాజ‌కీయ క‌క్ష‌తోనే డ్రోన్ కెమెరాలు వినియోగిస్తున్నార ని నాయ‌కులు ఆక్షేపించారు. ఇదంతా రాజ‌కీయ కుట్ర‌లో భాగ‌మేన‌ని ఆరోపించారు. మొత్తంగా దీనిని చంద్ర‌బాబు త‌న‌కు పాజిటివ్‌ గా మార్చుకునేందుకు ప్ర‌య‌త్నించారు. అయితే, తాజాగా దీనిపై మంత్రి అనిల్ కుమార్ యాద‌వ్ స్పందించారు. తాము డ్రోన్ కెమేరాలను వినియోగించామని వివరణ ఇచ్చారు. వరద నీటి తీవ్రత తెలుసుకొనేందకే డ్రోన్ వినియోగించామని, డ్రోన్లు ఈ రోజు కాదని..మూడు రోజుల నుండి వినియోగిస్తామంటూ కుండ బద్దలు కొట్టారు. డ్రోన్ల సాయంతో వరద పరిస్థితిపై ఎప్పటికప్పుడు అంచనా వేస్తున్నామని..దీని వలన చంద్రబాబుకు వచ్చిన ఇబ్బంది ఏంటని ప్రశ్నించారు.

రాజకీయ పబ్బంకోసం చంద్రబాబు.. టీడీపీ నేతలు డ్రామాలు చేస్తున్నారు అంటూ మంత్రి ఫైర్ అయ్యారు. వరద పరిస్థితిపై అంచనాకోసం డ్రోన్లను వినియోగిస్తున్నాం, గత 3 రోజులుగా డ్రోన్లను వినియోగిస్తూనే ఉన్నామని కుండబద్దలు కొట్టారు. ఇరిగేషన్‌ శాఖ అనుమతి.. ఆదేశాలతోనే డ్రోన్ల వినియోగం జరిగిందని మంత్రి స్పష్టం చేశారు. ప్రకాశం బ్యారేజీకి మరింతగా వరద వచ్చే అవకాశాలు ఉన్నాయని.. దాదాపు 7 లక్షల క్యూసెక్కుల నీరు వచ్చే అవకాశం ఉందన్నారు. గంటగంటకూ నీటిమట్టం పెరుగుతోందని వివరించారు. ఎగువనుంచి వచ్చే వరద వల్ల కరకట్టవెంబడి కొన్ని ప్రాంతాలు ముంపునకు గురవుతున్నాయన్నారు.

ముంపు ప్రాంతాల్లోని ప్రజల రక్షణ ప్రభుత్వం బాధ్యత తీసుకుందని చెప్పుకొచ్చారు. డ్రోన్ల సాయంతో వరద పరిస్థితిపై ఎప్పటికప్పుడు అంచనా వేస్తున్నామని..రాజకీయ పబ్బంకోసం చంద్రబాబు.. టీడీపీ నేతలు డ్రామాలు చేస్తున్నారని మంత్రి అనిల్ ఫైర్ అయ్యారు. కరకట్టమీద ఉన్న ఇల్లు నాది కాదని చంద్రబాబు అన్నారని..ఇదే విషయాన్ని లింగమనేని రమేష్‌ కూడా చెప్పారని మంత్రి గుర్తు చేశారు. అలాంటప్పుడు ఇప్పుడు చంద్రబాబుకు వచ్చిన ఇబ్బంది ఏంటని మంత్రి ప్రశ్నించారు. దీంతో ఇప్పుడు స్పందించ‌డం టీడీపీ వంతైంది. ఏదేమైనా.. ఇది రాబోయే రోజుల్లో మ‌రింత‌గా రాజ‌కీయం కానుంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి.