Begin typing your search above and press return to search.
కలియుగ శ్రీరాముడు ..ధనుస్సు విరిచి వధువు మేడలో మూడు ముళ్లు !
By: Tupaki Desk | 29 Jun 2021 12:00 PM ISTపెళ్లి...పెళ్లి అనగానే అందరికి ఆ సీతారాములే గుర్తుకువస్తారు. ఎందుకు అంటే పెళ్లి జీవితానికి ఆ సీతారాములే నిదర్శనం. అందుకే ప్రతి గ్రామంలో ఏ ఆలయం లేకపోయినా కూడా శ్రీ రాముని ఆలయమే ఉంటుంది. రామాయణంలో అత్యంత కీలక ఘట్టం సీతా స్వయంవరం లో రాముడు విల్లు విరిచి, సీతమ్మను పెళ్లాడాడు. భారతీయులకు అదో అద్భుత ఘట్టం. దాన్ని మరోసారి గుర్తు చేసింది ఆ వివాహ వేడుక. జీవితంలో పెళ్లి అనేది మధురమైన ఘట్టం. మళ్లీ మళ్లీ వచ్చేది కాదు కాబట్టి, దాన్ని వీలైనంత ప్రత్యేకంగా జరుపుకోవాలి అనుకుంటున్నారు నేటి యువత. దానికి పెద్ద ఉదాహరణ బీహార్ లో జరిగిన ఈ పెళ్లి స్థానిక సరణ్ జిల్లాలో ఈ ప్రత్యేక వివాహం జరిగింది.
ఈ వివాహం గురించి దేశమంతా మాట్లాడుకుంటోంది. రామాయణ కాలంలో ఎలాగైతే , శ్రీరామచంద్రమూర్తి శివధనస్సు విరిచి సీతమ్మవారిని పెళ్లాడాడో అలాగే , తన పెళ్లి కూడా జరగాలని వరుడు కోరుకున్నాడు. పెద్దలు సరే అన్నారు. సబల్పూర్ తూర్పు ప్రాంతంలో ఈ స్వయంవర వేడుక జరిగింది. పెళ్లి కొడుకు ముందుగా, స్టేజ్ ఎక్కి పరమశివుణ్ని ధ్యానించాడు. ఆ తర్వాత అందరూ చూస్తుండగా, విల్లు ఎత్తి, మధ్యలోకి విరిచేశాడు. అలా విరిచాడో లేదో. ఇలా ప్రజలు కేరింతలతో చప్పట్లు కొట్టారు. వివాహ వేడుకలో ఆనందాలు మిన్నంటాయి. ఈ వివాహం అప్పటి సీతా స్వయంవర ఘట్టాన్ని గుర్తుచేసిందనీ తామెంతో ఆనందపడ్డామని స్థానికులు తెలిపారు. విల్లు విరిచాక ప్రజలు పూల వాన కురిపిస్తుంటే వధూవరులు దండలు మార్చుకున్నారు. విల్లు మాత్రమే కాదు, పెళ్లి మొత్తం సీతారాములు జరుపుకున్నట్లే జరిపారు. వేదమంత్రాలతో వేడుకను అద్భుతంగా నిర్వహించారు. రామాయణంలో రాముడు శివధనస్సు విరిచాక సీతాదేవి ఆయన మెడలో వరమాల వేసింది. తద్వారా రాముణ్ని తన భర్తగా స్వీకరించింది.