Begin typing your search above and press return to search.
36మందికి కరోనా అంటించిన ఐఏఎస్ ఆఫీసర్
By: Tupaki Desk | 12 April 2020 10:08 AM ISTఈ ఐఏఎస్ ఆఫీసర్ మూర్ఖంగా ప్రవర్తించింది. విదేశాల నుంచి వచ్చిన కుమారుడి విషయాన్ని దాచిపెట్టింది. దీంతో కుమారుడి నుంచి ఆమెకు ఆమె ద్వారా ప్రభుత్వంలోని 36మంది ఉన్నతాధికారులకు కరోనా వ్యాపించింది. ఇంత జరిగినా ఆమె కరోనా చికిత్స కోసం ఆస్పత్రికి రానని మొండికేయడం విశేషం. దీంతో ఇంట్లోనే ఆమెకు వైద్యాధికారులు చికిత్స చేస్తున్నారు. ఈ దారుణం మధ్యప్రదేశ్ లో చోటుచేసుకుంది.
మధ్యప్రదేశ్ లో ఓ ఐఏఎస్ అధికారిణి పల్లవి జైన్ ప్రభుత్వంలో కీలకశాఖ చూస్తోంది. ఆమె కుమారుడు ఇటీవలే విదేశాల నుంచి వచ్చాడు. ఆ విషయాన్ని దాచిపెట్టింది. కుమారుడి వల్ల ఐఏఎస్ అధికారిణికి కరోనా సోకింది. లక్షణాలు బయటపడేలోపు ఇతర అధికారులతో కలిసి సమీక్షలు జరిపింది.
దీంతో ఆ తర్వాత ఐఏఎస్ అధికారికి, ఆమెతోపాటు సమీక్ష చేసిన అధికారులకు కరోనా సోకింది. తాజాగా ఐఏఎస్ కు, ఆ అధికారులకు టెస్టులు చేయగా.. 36మందికి కరోనా పాజిటివ్ అని తేలింది. దీంతో ఆమెపై ప్రభుత్వం సీరియస్ కూడా అయ్యింది.
అయితే కరోనా దాచడమే కాదు.. వచ్చినా ఆస్పత్రికి రానని ఆ ఐఏఎస్ మొండికేసింది. దీంతో డాక్టర్లే ఉదయం - సాయంత్రం వచ్చి ఆమెకు ఇంటి వద్ద చికిత్స చేస్తున్నారు. ఇలా ఐఏఎస్ వల్ల మధ్యప్రదేశ్ కీలక అధికారులే కరోనా బారిన పడ్డ పరిస్థితి నెలకొంది.