Begin typing your search above and press return to search.

జీవో 1పై న్యాయ‌పోరాటం.. ఆ రెండింటి కోస‌మేనా..?

By:  Tupaki Desk   |   14 Jan 2023 1:00 PM IST
జీవో 1పై న్యాయ‌పోరాటం.. ఆ రెండింటి కోస‌మేనా..?
X
తాజాగా ఈ కొత్త సంవ‌త్స‌రంలో వైసీపీ ప్ర‌భుత్వం ఇచ్చిన జీవో 1/2023పై పెద్ద ఎత్తున విప‌క్షాలు విమ‌ర్శ‌లు గుప్పిస్తున్నాయి. ముఖ్యంగా త‌న సొంత నియోజ‌క‌వ‌ర్గం కుప్పంలో త‌న ప‌ర్య‌ట‌న‌ను అడ్డుకోవ‌డంపై చంద్ర‌బాబు మ‌రింత ఆగ్ర‌హంతో ఉన్నారు. ఇది బ్రిటీష్ కాలంనాటి 1861 చ‌ట్టానికి అనుగుణంగా తీసుకురావ‌డంపై మ‌రింత ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నారు.

ఈ ప‌రిణామాల నేప‌థ్యంలో త్వ‌ర‌లోనే దీనిపై న్యాయ పోరాటం చేయాల‌ని భావిస్తున్న‌ట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించి కూడా.. జ‌న‌సేన అధినేత ప‌వ‌న్‌తో చంద్ర‌బాబు ఇటీవ‌ల చ‌ర్చించిన‌ట్టు స‌మాచారం. పైకి చెప్ప‌క‌పోయినా.. ఇరు పార్టీలూ క‌లిసి.. ఈ జీవోపై పోరాడాల‌ని.. క‌లిసి వ‌చ్చే పార్టీల‌ను కూడా క‌లుపుకొని ముందుకు సాగాల‌ని నిర్ణ‌యించుకున్న‌ట్టు తెలుస్తోంది.

అయితే.. ఈ పోరాటం వెనుక ప్ర‌ధానంగా.. రెండు కార‌ణాలు ఉన్నాయ‌ని స‌మాచారం. ఒక‌టి టీడీపీ యువ నాయ‌కుడు.. నారా లోకేష్ చేయ‌నున్న యువ‌గ‌ళం పాద‌యాత్ర‌.. రెండు జ‌న‌సేనాని ప‌వ‌న్ చేయ‌నున్న వారాహి.. వాహ‌న యాత్ర‌లు ఉన్నాయ‌ని తెలుస్తోంది. ఈ రెండింటిని అడ్డుకునేందుకు వైసీపీ వ్యూహాత్మ కంగా జీవో 1ని తీసుకువ‌చ్చింద‌ని వారు చెబుతున్నారు. ఈ క్ర‌మంలో ఈ రెండు యాత్ర‌ల‌కు విఘాతం క‌ల‌గ‌కుండా.. కోర్టును ఆశ్ర‌యించే అవ‌కాశం ఉంద‌ని తెలుస్తోంది.

దీనికి సంబంధించి క‌లిసి వ‌చ్చే పార్టీలను కూడా క‌లుపుకొని న్యాయ‌పోరాటానికి దిగాల‌ని నిర్ణ‌యించుకు న్న‌ట్టు తెలుస్తోంది. అయితే.. వీరి ఆనుపానుల‌ను గ‌మ‌నించిన వైసీపీ ప్ర‌భుత్వం ఇప్ప‌టికే ఈ జీవోకు సంబంధించిన్యాయ‌ప‌ర‌మైన స‌మ‌స్య‌లు రాకుండా త‌గు జాగ్ర‌త్త‌లు తీసుకున్న‌ట్టు తెలుస్తోంది. మొత్తానికి ఈ విష‌యం న్యాయ‌స్థానంమెట్లెక్కితే.. ఏం జ‌ర‌గుతుంద‌నేది ఆస‌క్తిగా మారింది. సాధ్య‌మైనంత వ‌ర‌కు జీవోను స‌మ‌ర్ధించేలా.. లేదా విచార‌ణ వాయిదా ప‌డేలా వైసీపీ వ్యూహం ఉండే అవ‌కాశం ఉంద‌ని అంటున్నారు. త‌ద్వారా.. ఈ నెల 27న‌ చేప‌ట్టే పాద‌యాత్ర‌కు ప‌రిమితులు విధించే అవ‌కాశం ఉంద‌ని చెబుతున్నారు.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.