Begin typing your search above and press return to search.

కర్నాటకలో పట్టు దొరికింది...కేసీయార్ దూకుడేనట..

By:  Tupaki Desk   |   16 Oct 2022 3:30 AM GMT
కర్నాటకలో పట్టు దొరికింది...కేసీయార్ దూకుడేనట..
X
కేసీయార్ ఆషామాషీగా ఏమీ బీయారెస్ పెట్టలేదు. ఆయన జాతీయ రాజకీయాల్లో తన వాటా ఎంతో చూసుకుని దాని తేల్చుకోవడానికే పార్టీ పెట్టారని అంటున్నారు.

ఈ రోజున రాజకీయాల్లో నంబర్ గేమ్ నడుస్తోంది. ఎవరికి ఎక్కువ సీట్లు ఉన్నా ఒక్క సీటు లేకపోతే సర్కార్లే కూలిపోతాయి అనడానికి వాజ్ పేయ్ సర్కార్ అప్పట్లో గద్దె దిగడం ఒక ఉదాహరణ. అందువల్ల 2024లో కచ్చితంగా సంకీర్ణం వస్తుంది కేంద్రంలో అని భావించే కేసీయేఅర్ బీయారెస్ కి రెడీ అయ్యారు.

ఆయనకు ఇపుడు కర్నాటకలో పట్టు ఎంతో కొంత దొరికింది అని అంటున్నారు. పూర్వపు హైదరాబాద్ స్టేట్ లో కర్నాటకలో కలసిన కొన్ని జిల్లాలు ఉన్నాయి. దాంతో ఆ జిల్లాలలో కనుక గట్టిగా పట్టుకుంటే గెలుపు సాధ్యమే అని ఆయన భావిస్తున్నారు అని అంటున్నారు. ఇప్పటికి పదేళ్ల క్రితం కన్నడ రాష్ట్ర తెలంగాణా అసోసియేషన్ ని ఏర్పాటు చేశారు. దానికి టీయారెస్ మద్దతు ఉంది ఈ అసోసియేషన్ కర్నాటకలో ఉన్న తెలంగాణా వారి కోసం ఏర్పాటు అయింది.

తెలంగాణా కల్చర్ ని ప్రమోట్ చేసుకోవడమే కాకుండా అక్కడ ఫెస్టివల్స్ ని చేసుకోవడం, ఎప్పటికపుడు తెలంగాణా కార్యక్రమాలను ప్రమోట్ చేయడం చేస్తోంది. ఇపుడు ఆ అసోసియేషన్ ముందుకు వచ్చి బీయారెస్ కి పూర్తి మద్దతు ప్రకటించింది. సరిహద్దు జిల్లాలలో బీయారెస్ సంబరాలు ఒక లెక్కన సాగుతున్నాయని టీయారెస్ అఫీషియల్ మీడియాలో వార్తలు వస్తున్నాయిట.

మొత్తానికి ఈ సరిహద్దు రాష్ట్రాలలో బీయారెస్ కనుక పోటీ చేస్తే మంచి ఫలితాలు వస్తాయని అంటున్నారు. 2023లో అసెంబ్లీ ఎన్నికలు ఉన్నాయి. దాంతో ఆ ఎన్నికల్లోనే బీయారెస్ తన జాతాకాన్ని పరీక్షించుకుని 2024 లోక్ సభ ఎన్నికల బరిలోకి దిగుతుంది అని అంటున్నారు. ఇప్పటికే కన్నడ నాట జేడీ ఎస్ బీయారెస్ కి మద్దతు ప్రకటించింది.

దాంతో ఈ రెండు పార్టీలు పొత్త్లు పెట్టుకుని పోటీలోకి దిగిగే కన్నడ నాట బీయారెస్ జెండా ఎగరడం ఖాయమే అని అంటున్నారు. సో కేసీయార్ జాతీయ పార్టీకి కొత్త ఆశలు కన్నడ నాటనే కనిపిస్తున్నాయట. ఆ మీదట ఆయన ఎత్తులు పై ఎత్తులూ ఎటూ ఉంటాయి కాబట్టి మిగిలిన రాష్ట్రాలలో కూడా దూకుడు చేస్తారు అని అంటున్నారు.




నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.