Begin typing your search above and press return to search.

ఈ హాట్ మాఫియా డాన్ 180 మందిని ఏసేసింది

By:  Tupaki Desk   |   25 Sep 2015 11:53 AM GMT
ఈ హాట్ మాఫియా డాన్ 180 మందిని ఏసేసింది
X
చూసినంత‌నే చూపులు తిప్పుకోలేన‌ట్లుగా ఉండే హోయ‌లు ఆమె సొంతం. కానీ.. ఆమె గురించి వివ‌రాలు తెలిస్తే.. చూడ‌టం సంగ‌తి త‌ర్వాత బ‌తికి ఉంటే బ‌లుసాకు తిని బ‌తికేయొచ్చ‌న్న భావ‌న‌తో వెన‌క్కి తిర‌గ‌కుండా ప‌రుగులు పెట్టేస్తారు. ఇంత హ‌డ‌లెత్తించే ఈ క‌త్తిలాంటి అమ్మాయి ఎవ‌రో తెలిస్తే.. ఒక ప‌ట్టాన న‌మ్మ‌బుద్ధి కాదు. మొత్తం డీటైల్స్ తెలిసిన త‌ర్వాత షాక్ నుంచి కోలుకోవ‌టానికి కొంత టైం తీసుకోవ‌టం ఖాయం.

ఈ సొగ‌సుక‌త్తె పేరు లాచినా. పూర్తి పేరులోకి వెళితే.. మెలిస్సా మార్గ‌రిటా కాల్డ‌రాన్ ఒజేడా. ఇంత పెద్ద పేరు పిల‌వ‌టం క‌ష్ట‌మో లేక‌.. ముద్దుగా పెట్టేశారో కానీ.. అంద‌రూ ఆమెను లాచినాగా వ్య‌వ‌హ‌రిస్తారు. నిజానికి ఆమె పేరు పెట్టి పిలిచే ద‌మ్ము ఉండ‌నే ఉండ‌దు. ఈ లేడీ మాఫియా డాన్ మెక్సికో చీక‌టి ప్ర‌పంచంలో రారాణి. ఇప్ప‌టికి 180 మంది అత్యంత నిర్దాక్షిణ్యంగా.. క‌ర్క‌సంగా చంపేసిన ఘ‌న‌మైన ట్రాక్ రికార్డు అమ్మ‌డి సొంతం. అవ‌స‌ర‌మైతే బాహాటంగా చంపి పారేసే ఆమె.. ఆ త‌ర్వాత ఆ ఆన‌వాళ్లు క‌నిపించ‌కుండా ప‌క్కాగా ప్లాన్ చేస్తుంది. పెద్ద గ్యాంగ్ ను మొయింటైన్ చేస్తూ.. త‌న ఆచూకీ పోలీసుల‌కు తెలిసినా.. తాను మాత్రం దొర‌క్కుండా త‌ప్పించుకుంటుంది.

ఇలాంటి కిలేడీ గురించి.. ఆమె ప్రియుడే స్వ‌యంగా పోలీసుల వ‌ద్ద లొంగిపోయి.. అమ్మ‌డి క‌థ అంతా చెప్ప‌టంతో మెక్సిక‌న్ పోలీసులు మొద‌ట కంగుతిని.. త‌ర్వాత ఆమ్మ‌డిని జాగ్ర‌త్త‌గా ప్లాన్ చేసి మ‌రీ అదుపులోకి తీసుకున్నారు. ఇంత‌కీ ల‌వ్వ‌రే లాచినాను ప‌ట్టించారా? అన్న సందేహం క‌ల‌గొచ్చు.

ప‌చ్చి నెత్తురు తాగే క‌ర్క‌స‌త్వాన్ని భ‌రించ‌లేని ఆమె ప్రియుడు.. ఆమె చేతిలో ఎప్పుడు హ‌త‌మ‌వుతానోన‌న్న భ‌యంలో.. పారిపోయి మ‌రీ వ‌చ్చి పోలీసుల‌కు లొంగిపోయి ఆమె గురించి చెప్పుకొచ్చారు. ఇంత‌కీ లాచినా ఎంత‌టి క‌ర్క‌స‌మైన అండ‌ర్ వ‌ర‌ల్డ్ డాన్ అన్న‌ది తెలుసుకుంటే.. చూడ‌గానే హాట్ గా అనిపించే ఈ లేడీ ఇంత డేంజ‌రా? అన్న సందేహం క‌ల‌గ‌క మాన‌దు.

క‌రుడుగ‌ట్టిన అండ‌ర్‌వ‌ర‌ల్డ్ మాఫియా హ‌డావుడితో ఉండే మెక్సికో న‌గ‌రంలో లాచినా పేరు చెబితే కొమ్ములు తిరిగి డాన్లు సైతం జంకుతారు. ఎంత‌టి వాడినైనా స‌రే.. ఇట్టే మ‌ట్టి క‌రిపించ‌ట‌మే కాదు..త‌న తెలివితేట‌ల‌తో వారి శ‌క్తియుక్తుల్ని నిర్వీర్యం చేసి.. ఎలాంటి మొహ‌మాటం లేకుండా హ‌త‌మార్చ‌టం ఆమెకు మాత్ర‌మే సాధ్య‌మ‌ని చెబుతారు. 30ఏళ్ల వ‌య‌సులో ఉన్న లాచినా తొలుత మాద‌క ద్ర‌వ్యాలు స‌ర‌ఫ‌రా చేసే ఒక బ్యాచ్ లో స‌భ్యురాలిగా 2005లో చేరింది. అన‌తికాలంతో త‌న క‌ర్క‌స‌త్వంతో పురుషాధిప‌త్యం ఉన్న డ్ర‌గ్ మాఫియాలో డేంజ‌ర‌స్ లేడీగా పేరు సంపాదించింది. పోలీసుల బెదిరింపు కార‌ణంగా ఈమె ప‌ని చేస్తున్న మాఫియా అధిపతి అండ‌ర్ గ్రౌండ్ లోకి వెళ్ల‌టం.. త‌న స‌మ‌ర్థ‌త‌తో గ్యాంగ్ మొత్తంపై అధిప‌త్యం సంపాదించిన ఆమె.. చివ‌ర‌కు ఆ గ్యాంగ్ కు క‌మాండ‌ర్ గా మారింది.

అయితే ఆ గ్యాంగ్ కు చెందిన మ‌రొక‌రు ఆమెను ప‌ద‌వి నుంచి తొల‌గిపోవాల‌ని ఆదేశిస్తే.. కోపంతో త‌న సొంత కుంప‌టి పెట్టుకున్న లాచినా కేవ‌లం నెల‌ల వ్య‌వ‌ధిలోనే అండ‌ర్‌ వ‌ర‌ల్డ్ ఫేమ‌స్ డాన్ గా మారిపోయింది. శ‌త్రువుల‌ను హ‌త‌మార్చ‌టం.. అనుమానం వ‌చ్చిన ఎవ‌రిని వ‌దిలి పెట్ట‌ని ఆమె ఇప్ప‌టివ‌ర‌కూ 180 హ‌త్య‌లు చేసి ఉంటుంద‌ని భావిస్తున్నారు.

నిజానికి ఆమె చేసిన హ‌త్య‌ల గురించి వివ‌రాలు తెలిస్తే.. ఆమె చంపేందుకు పెద్ద పెద్ద కార‌ణాలు కూడా అక్క‌ర్లేద‌న్న భావ‌న క‌ల‌గ‌టం ఖాయం. ఆమె రాక్ష‌స‌త్వం చూసీ.. చూసీ త‌ట్టుకోలేని ఆమె బోయ్‌ ఫ్రెండ్ ఆమె నుంచి త‌ప్పించుకొని పోలీసుల ఆశ్ర‌యం పొంది.. ఆమె ఆరాచ‌కాల గురించి వివ‌రాలు చెప్పి.. ఆమె పోలీసులకు దొరికిపోయేలా చేయ‌టంతో ఆమె గురించి వివ‌రాలు బ‌య‌ట‌కు వ‌చ్చాయి. ఇప్పుడీ లేడీ డాన్ వివ‌రాలు తెలిసిన వారంతా కంగుతింటున్నారు. ఇప్పుడు చెప్పండి.. అమ్మ‌డు హాట్ గా ఉందా..?