Begin typing your search above and press return to search.
కర్నూలుకు 'విజిలెన్స్'..హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఖాయమే
By: Tupaki Desk | 11 Feb 2020 9:32 PM ISTఏపీకి మూడు రాజధానులను ఏర్పాటు చేస్తామంటూ వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలకు అడ్డంకులు ఎదురయ్యే పరిస్థితి కనిపించడం లేదు. హైకోర్టును ఆశ్రయించి జగన్ స్పీడుకు ఎలాగైనా బ్రేకులు వేద్దామనుకుంటున్న రాజధాని రైతులు గానీ - టీడీపీ నేతలు గానీ చేస్తున్న యత్నాలు కూడా ఒక్కొక్కటిగానే తుత్తునీయలు అయిపోతున్నాయి. ఇందుకు నిదర్శనంగా కర్నూలుకు విజిలెన్స్ కమిషనర్ కార్యాలయాన్ని తరలించేందుకు జారీ అయిన ఉత్తర్వులపై విచారణ సందర్భంగా హైకోర్టు ధర్మాసనం చేసిన వ్యాఖ్యలు నిలుస్తున్నాయని చెప్పక తప్పదు. ఈ వ్యవహారంలో కోర్టు తన తుది తీర్పును వెలువరించకున్నా... జగన్ సర్కారు తీసుకుంటున్న చర్యలను తప్పుబట్టలేమన్న రీతిలో హైకోర్టు ధర్మాసనం చేసిన వ్యాఖ్యలు చూస్తుంటే... జగన్ సర్కారుకు అనుకూలంగానే తుది తీర్పు ఉండే అవకాశాలున్నాయన్న వాదనలు వినిపిస్తున్నాయి.
హైకోర్టు ఏర్పాటు కానున్న కర్నూలుకు విజిలెన్స్ కార్యాలయాన్ని తరలించేందుకు జగన్ సర్కారు ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే. దీనిపై భగ్గుమన్న రాజధాని రైతులు... జీఏడీ ఒకరోట ఉంటే... విజిలెన్స్ కార్యాలయం మరో చోట ఎలా ఉంటుందన్న పాయింట్ ను ప్రస్తావిస్తూ.. జగన్ సర్కారు జారీ చేసిన ఉత్తర్వులను రద్దు చేయాలని పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జేకే మహేశ్వరి నేతృత్వంలోని ధర్మాసనం విచారణ చేపట్టింది. ఇందులో భాగంగా మంగళవారం జరిగిన విచారణ సందర్భంగా ధర్మాసనం పలు కీలక వ్యాఖ్యలు చేసింది. విశాఖపట్నంలో ప్రభుత్వం చేపట్టిన ఎలాంటి అభివృద్దిని కూడా అడ్డుకోలేమని ధర్మాసనం సంచలన వ్యాఖ్య చేసింది. అంతేకాకుండా విశాఖలో సీఎంఓ సహా పలు శాఖల కార్యాలయాలు ఏర్పాటవుతాయని భావిస్తున్న మిలీనియం టవర్స్ అభివృద్ధి కోసం జగన్ సర్కారు కేటాయించిన రూ.19 కోట్ల కేటాయింపును కూడా అడ్డుకోలేమని ధర్మాసనం తేల్చి చెప్పింది.
హైకోర్టు ధర్మాసనం చేసిన ఈ కీలక వ్యాఖ్యలను చూస్తుంటే... జగన్ సర్కారు దూకుడుగా చేపడుతున్న అధికార వికేంద్రీకరణకు హైకోర్టు నుంచి ఎలాంటి అడ్డగింత కూడా ఎదురుకాబోదన్న వాదనలు వినిపిస్తున్నాయి. అంతేకాకుండా విజిలెన్స్ కమిషనర్ కార్యాలయాన్ని కర్నూలుకు తరలించేందుకు జగన్ సర్కారు చేస్తున్న యత్నాలను కూడా హైకోర్టు నిలువరించే యత్నమేదీ చేయకపోవచ్చన్న వాదన కూడా వినిపిస్తోంది. ఇదే జరిగితే... అధికార వికేంద్రీకరణ దిశగా జగన్ సర్కారు చేపడుతున్న చర్యలకు ఎలాంటి అడ్డగింత ఎదురుకాబోదన్న వాదనలు ఆసక్తి రేకెత్తిస్తున్నాయి. మొత్తంగా కర్నూలుకు విజిలెన్స్ కమిషనర్ కార్యాలయాన్ని తరలించే విషయంలో తీర్పు జగన్ సర్కారుకు అనుకూలంగా ఉండే అవకాశాలే ఉన్నాయన్న కోణంలో ఆసక్తికర విశ్లేషణలు సాగుతున్నాయి.