Begin typing your search above and press return to search.

బాబు శ‌వ రాజకీయాలు..హ‌రికృష్ణ భౌతిక‌కాయం వ‌ద్దే చ‌ర్చ‌లు

By:  Tupaki Desk   |   6 Dec 2018 5:30 AM GMT
బాబు శ‌వ రాజకీయాలు..హ‌రికృష్ణ భౌతిక‌కాయం వ‌ద్దే చ‌ర్చ‌లు
X
తెలుగుదేశం పార్టీ అధినేత‌, ఏపీ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబునాయుడు రాజ‌కీయం గురించి తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ సంచ‌ల‌న విష‌యాలు పంచుకున్నారు. ఏపీ రాజ‌కీయం గురించే కాకుండా తెలంగాణ రాజ‌కీయాల గురించి కీల‌క విష‌యాలు వెల్ల‌డించారు. మంత్రి కేటీఆర్ మీడియాతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడారు. హరికృష్ణ పార్థివదేహం వద్ద నివాళులు అర్పించేందుకు వెళ్లిన సమయంలో తమ పార్టీతో పొత్తుపై మాట్లాడారని చెప్పారు. కూటమిని అధికారంలోకి తెచ్చుకొని చంద్రబాబు తెలంగాణకు సీఎం అవుతానంటారేమో? ఏపీని లోకేశ్‌కు వదిలేసి చంద్రబాబు ఇక్కడకి వస్తాడేమో? అన్న అనుమానాలను వ్యక్తంచేశారు.

రాష్ట్ర కాంగ్రెస్‌ను రూ.500 కోట్లకు చంద్రబాబు కొనుగోలు చేసినందునే రాహుల్ మొదలుకొని ఉత్తమ్ వరకు అందరూ అబద్ధాలు, తప్పులే మాట్లాడుతున్నారని ఆరోపించారు. చంద్రబాబు ఇక్కడ కూటమిలో చేరడం ద్వారా గతంలో ఆయన సీఎంగా చేసినప్పటి ఘోరాలు అన్ని ప్రజలకు గుర్తుకొచ్చాయని అన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు చంద్రబాబు ప్రయత్నించి ఎమ్మెల్యేల కొనుగోలుకు తెరలేపారని కేటీఆర్ గుర్తు చేశారు. తెలంగాణ:ప్రస్తుత ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ వంద సీట్లు సాధించి చరిత్ర తిరగరాయడం ఖాయమని మంత్రి కే తారకరామారావు చెప్పారు. ప్రజలు ఇప్పటికే టీఆర్ఎస్‌కు ఓటు వేసి అధికారంలోకి తేవాలని నిర్ణయం తీసుకున్నారని, ఎవరు ఎలాంటి జిమ్మిక్కులు, మైండ్‌గేమ్‌లు ఆడినా తెలంగాణ ప్రజల మనసును మార్చలేరు.. టీఆర్ఎస్ గెలుపును ఆపలేరని అన్నారు.

ఇక మాజీ ఎంపీ ల‌గ‌డ‌పాటి రాజ‌గోపాల్ గురించి వివరిస్తూ సెప్టెంబర్ 6న ఓ స్నేహితుడి ఇంట్లో కలిసినప్పుడు టీఆర్ఎస్ గెలువబోతున్నదని లగడపాటి తనతో చెప్పి.. టీడీపీతో పొత్తు కుదుర్చుకోవడానికి ప్రయత్నించగా.. సాధ్యంకాదని తేల్చిచెప్పానని కేటీఆర్ అన్నారు. కాంగ్రెస్‌తో జట్టుకట్టడంలో లగడపాటి కీలకపాత్ర పోషించారని చెప్పారు. అక్టోబరు 20 నుంచి చేసినట్లుగా చెప్పిన సర్వే ఫలితాల్లో టీఆర్ఎస్‌కు 65-70 స్థానాలు వస్తున్నాయని లగడపాటి తనకు వాట్సప్ ద్వారా పంపించారన్నారు. అయితే టీడీపీతో కలువనందునే కూటమిదే పైచేయంటూ మంగళవారం రాత్రి మరో సర్వే ఫలితాలను వెల్లడించారని స్పష్టంచేశారు. మైండ్‌గేమ్‌లో ప్రజలను కన్విన్స్ చేయలేక కన్‌ఫ్యూజ్ చేస్తున్నారని.. దీనిలో భాగంగానే లగడపాటి సర్వే అని చెప్పారు.