Begin typing your search above and press return to search.
కేటీఆర్ ఎక్కడ..ఏం చేస్తున్నారు?
By: Tupaki Desk | 20 April 2018 2:10 PM ISTఔను. ఇప్పుడు అందరి చూపు కేటీఆర్ వైపే. తెలంగాణ ముఖ్యమంత్రి - టీఆర్ ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ తనయుడిగానే కాకుండా...ఇటీవలి కాలంలో క్లాస్ - మాస్ లీడర్ గా ఎదిగేందుకు ఆయన చేస్తున్న కృషి - మీడియా దృష్టిని ఆకర్షించేందుకు చేస్తున్న పలు కార్యక్రమాలు ముఖ్యంగా తన కేరాఫ్ అడ్రస్‌గా నిలిచిన ట్విట్టర్ వేదికగా పంచుకునే భావాలతో కేటీఆర్ వార్తల్లో వ్యక్తిగానే కాదు...టీవీల్లో అయితే బ్రేకింగ్ న్యూస్ - పత్రికల్లో అయితే ఫస్ట్ పేజ్ వార్త స్థానాన్ని సంపాదించుకున్నారు! ఓవైపు మంత్రిగా బిజీ బిజీగా శంకుస్థాపనలు - ప్రారంభోత్సవాలతో బిజీబిజీగా ఉన్నప్పటికీ మరోవైపు పాలన పరంగా కూడా నిత్యం సమీక్షలు - మీటింగ్ లతో కేటీఆర్ హడావుడి చేస్తుంటారు. అయితే అలాంటి కేటీఆర్ దాదాపు రెండు మూడు రోజులుగా మీడియాలో కనిపించడం లేదు. దీంతో అంతా కేటీఆర్ ఎక్కడా అంటూ చర్చించుకుంటున్నారు. పైగా గులాబీదళపతి కేసీఆర్ మొదటుపెట్టిన షిర్డీ టూర్ లో కూడా కేటీఆర్ జాడలేకపోవడంతో...ఈ చర్చ మరింత తారాస్థాయికి చేరింది.
ఆధ్యాత్మిక చింతన ఎక్కువగా ఉండే ముఖ్యమంత్రి కేసీఆర్ తన కుటుంబ సభ్యులతో కలిసి షిర్డీకి చేరుకున్నారు. ఇవాళ ఉదయం బేగంపేట ఎయిర్ పోర్టు నుంచి ప్రత్యేక విమానంలో కుటుంబ సభ్యులతో కలిసి షిర్డీకి బయల్దేరిన కేసీఆర్ కుటుంబ సభ్యులతో కలిసి షిర్డీ సాయిబాబాను దర్శించుకొని మొక్కులు చెల్లించుకోనున్నారు. ఈ టూర్ లో కేటీఆర్ లేరు. అయితే కేటీఆర్ దైవారాధనకు దూరంగా ఉంటారని అందుకే వెళ్లలేదని ఆయన సన్నిహితులు చెప్తున్నారు. అయినప్పటికీ గత మూడు నాలుగురోజులుగా కేటీఆర్ ఎక్కడున్నారనే ప్రశ్నకు సమాధానం దొరకడం లేదని కొందరు అంటున్నారు.
ఎంతబిజీగా ఉన్నప్పటికీ..ట్విట్టర్లో నిత్యం అప్ డేట్ అవుతుండే కేటీఆర్ ఈ సందర్భంలో కూడా అప్పుడో ఇప్పుడో తన అభిప్రాయాలను ఈ మైక్రోబ్లాగింగ్ ప్లాట్ ఫాం ద్వారా పంచుకుంటున్నారు. అయితే ఆయన శైలికి చెందిన సమీక్షలు లేవు. గత వారం వరకు జోరుగా సాగిన ప్రగతి సభల ఊసే లేదు. ఇక కార్యాలయంలోనూ కేటీఆర్ అందుబాటులో లేరు దీంతో యువ నాయకుడు ఎక్కడ అంటూ ఈ సోషల్ మీడియాలో పలువురు చర్చించుకుంటున్నారు.