Begin typing your search above and press return to search.

కేసీఆర్‌ కు రోజూ మందు పోసి మంత్రి అయిపోయాడు!

By:  Tupaki Desk   |   21 May 2017 4:53 AM GMT
కేసీఆర్‌ కు రోజూ మందు పోసి మంత్రి అయిపోయాడు!
X
తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్‌ పై కోమ‌టిరెడ్డి బ్ర‌ద‌ర్స్‌ లో ఒక‌రైన ఎమ్మెల్సీ కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి ఘాటు వ్యాఖ్య‌లు చేశారు. న‌ల్ల‌గొండ‌లో బ‌త్తాయి మార్కెట్ ప్రారంభం సంద‌ర్భంగా త‌న సోద‌రుడు కోమ‌టిరెడ్డి వెంక‌ట‌రెడ్డిపై జ‌రిగిన దాడి విష‌యంలో త‌గు చ‌ర్య‌లు లేక‌పోవ‌డంపై విలేక‌రుల స‌మావేశం నిర్వ‌హించిన రాజ‌గోపాల్ రెడ్డి సీఎం కేసీఆర్ స‌హా, న‌ల్ల‌గొండ జిల్లాకు చెందిన మంత్రి గుంటకండ్ల జగదీశ్‌ రెడ్డిపై తీవ్ర స్థాయిలో విరుచుకుప‌డ్డారు. ముఖ్యమంత్రి కేసీఆర్ తనను తాను ఒక రాజులా, తెలంగాణ తన రాజ్యంలా భావిస్తూ ప‌రిపాల‌న సాగిస్తున్నార‌ని ఆరోపించారు.

ప్రతి రోజు కేసీఆర్‌ కు మద్యం పోసి దగ్గరై మంత్రి అయిన జగదీశ్‌ రెడ్డి త‌న‌ స్థాయిని మరిచి ప్రవర్తిస్తున్నారని కోమ‌టిరెడ్డి తీవ్ర వ్యాఖ్య‌లు చేశారు. సీఎం కేసీఆర్‌ కు పెగ్‌ పోయడానికి తప్ప మంత్రిగా గుంటకండ్ల జగదీశ్‌ రెడ్డి పనికిరాడని ఎద్దేవా చేశారు.మంత్రి జగదీశ్‌ రెడ్డి అండతో ఎమ్మెల్యే గాదరి కిషోర్‌ 37 మంది కాంగ్రెస్‌ కార్యకర్తలపై అక్రమంగా కేసులు పెట్టించాడని అన్నారు. ఇందులో 26 మంది మహిళలు కూడా ఉన్నారని, వారు పోలీసులపై దాడి చేశారని కేసులు బనాయించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. నల్లగొండలో త‌న సోద‌రుడు కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డిపైనా మంత్రి జగదీశ్‌ రెడ్డి ఇదే విధంగా వ్యవహరించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీస్‌ స్టేషన్లు టీఆర్‌ ఎస్‌ పార్టీ కార్యాలయాలుగా, పోలీసులు పార్టీ ఏజెంట్లుగా మారారని ఆరోపించారు. కాంగ్రెస్‌ నేతలను టార్గెట్‌ చేస్తూ పోలీసులతో అక్రమ కేసులు పెట్టిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసులను అడ్డుపెట్టుకొని టీఆర్‌ఎస్‌ నేతలు ఇసుక మాఫియా, దొంగనోట్ల చెలామణి, గూండాయిజం, రౌడీయిజంతో వనరులను దోచుకుంటున్నారని విమర్శించారు.

గ్యాంగ్‌ స్ట‌ర్ నయీమ్‌ తో అంటకాగిన నేతలు, అధికారులు, పోలీసులను వెంటనే అరెస్టు చేయకపోతే భువనగిరి నుంచి లక్ష మందితో హైదరాబాద్‌ కు పాదయాత్రగా వచ్చి సీఎం కేసీఆర్‌ ఇంటిని ముట్టడిస్తామని కోమ‌టిరెడ్డి హెచ్చరించారు. రాష్ట్రంలో నయీమ్‌ బినామీల పేరిట రూ.20వేల కోట్ల ఆస్తులు కూడపెట్టాడని, ఎన్‌కౌంటర్‌ తరువాత అవి ఏమయ్యాని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఎన్‌కౌంటర్‌ జరిగి 9నెలలు గడిచినా సిట్‌ దర్యాప్తు ఎందుకు వేగవంతంగా జరగటం లేదన్నారు. నయీమ్‌ డైరీని ఎందుకు బయటపెట్టడం లేదో ముఖ్యమంత్రి సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు. నయీమ్‌ నేరాల్లో భాగస్వామ్యం ఉండి కేసులు నమోదై అధికారంలో ఉన్న నేతలను ఎందుకు అరెస్టు చేయడం లేదని ప్రశ్నించారు. టీఆర్‌ఎస్‌ నేతలను కేసు నుంచి తప్పించడానికే ఎస్‌ఐ నుంచి డీజీపీ వరకు నిర్వహించిన సమావేశంలో పోలీసులను కేసీఆర్‌ శభాష్‌ అంటూ మెచ్చుకున్నారని కోమ‌టిరెడ్డి రాజ‌గోపాల్ రెడ్డి విమర్శించారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/