Begin typing your search above and press return to search.
అసెంబ్లీ రద్దు తర్వాత కేసీఆర్ ఏం చేయనున్నారంటే...
By: Tupaki Desk | 6 Sept 2018 11:33 AM ISTముందస్తు ఎన్నికల ఊహాగానాల నేపథ్యంలో అన్ని రాజకీయ పార్టీలూ వ్యూహప్రతివ్యూహాలు రచిస్తున్నాయి. మరికాసేపట్లో ప్రభుత్వాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ రద్దు చేయబోతున్నారనే విషయం ఇప్పటికే ఖరారు అయింది. అయితే రద్దు సందర్భంగా ఏం చేయనున్నారు, అనంతరం ఆయన తీసుకునే నిర్ణయాలు ఏంటనేది అందరిలోనూ ఆసక్తిని రేకెత్తించే అంశం. టీఆర్ ఎస్ లోని విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం ముఖ్యమంత్రి కేసీఆర్ గులాబీ దళపతి కేసీఆర్ రాజీనామా అనంతరం తనకు అచ్చివచ్చిన అంశాలపై దృష్టి సారించనున్నారు.
మధ్యాహ్నం ఒంటి గంటకు ప్రగతి భవన్‌లో కేబినెట్ సమావేశం జరగనుంది. అనంతరం తెలంగాణ భవన్ లో ఇవాళ మధ్యాహ్నం 2:30 గంటలకు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు మీడియా సమావేశం నిర్వహించనున్నారు. కేబినెట్ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను ముఖ్యమంత్రి.. మీడియాకు వెల్లడించే అవకాశం ఉంది. ఈ సందర్భంగానే అసెంబ్లీ రద్దు గురించి ఆయన ప్రకటించనున్నారు. క్యాబినెట్ తర్వాత ప్రత్యేక బస్సుల్లో రాజ్ భవన్ కి సీఎం కేసీఆర్ బృందం చేరుకోనుంది. అసెంబ్లీ రద్దు తర్వాత సాయంత్రం కేసీఆర్ ఫాంహౌస్ కు వెళ్లనున్నారు. శుక్రవారం ఉదయం 10 గంటలకు సిద్ధిపేట జిల్లా కోనాయపల్లిలో వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు చేస్తారు. అనంతరం మధ్యాహ్నం హుస్నాబాద్ కు కేసీఆర్ బయల్దేరి వెళ్తారు. 2 గంటలకు ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆర్ ప్రసంగించనున్నారు. ముందస్తుకు ఎందుకు వెళుతోంది, దీని వల్ల కలిగే ప్రయోజనాలు ఇతరత్రా అంశాల గురించి ఆయన వివరించనున్నారు.