Begin typing your search above and press return to search.
ప్రత్యర్ధి ఎవరో తెలియని యుద్ధం... బాబు కేసీయార్ డిటో..డిటో
By: Tupaki Desk | 25 Dec 2022 1:30 AM GMTఇద్దరూ చంద్రులే. ఇద్దరూ వ్యూహాల పుట్టలే. ఇద్దరూ జాతీయ రాజకీయాల మీద విపరీతమైన ఆకాంక్షతో ఉన్న వారే. ఇద్దరూ రాజకీయ ఉద్ధండులే. వారే చంద్రబాబు కేసీయార్. విభజన తరువాత అటు తెలంగాణాలో కేసీయార్, ఇటు ఏపీలో చంద్రబాబు తమ రాజకీయ క్షేత్రాలుగా మార్చుకుని కార్యచరణ చేసుకుంటూ వచ్చారు.
ఇక బాబు అయితే 2018 ఎన్నికల్లో ఒకసారి తెలంగాణాలో పోటీకి దిగారు. ఆ తరువాత ఆ వైపు తొంగి చూడలేదు. కేసీయార్ కి ఏపీతో ఈ రోజు దాకా అవసరమే లేదు. ఇపుడు కేసీయార్ బీయారెస్ పార్టీ ద్వారా ఏపీ వైపు చూస్తున్నారు. అలాగే బీయారెస్ అని కేసీయార్ అనడంతో చంద్రబాబు సైతం తెలంగాణాలో రీ ఎంట్రీ ఇచ్చారు. నాలుగేళ్ల సుదీర్ఘ విరామం తరువాత బాబు ఖమ్మం లో భారీ మీటింగ్ పెడితే జనాలు పోటెత్తారు.
ఇదే హుషార్ లో బాబు మరిన్ని మీటింగ్ లకి రెడీ అయిపోతున్నారు. ఇక బాబు ఖమ్మం మీటింగ్ ఆసక్తిగా ఉన్నా రాజకీయ సంచలనాలు ఏవీ నమోదు కాలేదు. ఎందుకంటే బాబు ఇక్కడ తన రాజకీయ ప్రత్యర్ధులను ఎవరినీ విమర్శించలేదు. పైగా ఎవరో గుర్తించలేదు కూడా. తన పార్టీ గురించి తన పాలన గురించి మాత్రమే చెప్పుకున్నారు. ఒక విధంగా చాలా కాలం తరువాత తెలంగాణా వారితో కనెక్ట్ అయ్యే మీటింగ్ గానే దీన్ని చూడాలి.
మరో వైపు చూస్తే టీయారెస్ కి గట్టి పట్టున్న ఉత్తర తెలంగాణా జిల్లాలలో కూడా పాదం మోపడానికి కలియ తిరగడానికి చంద్రబాబు సిద్ధపడుతున్నారు. వరసబెట్టి ఆయా జిల్లాలలో సభలు సమావేశాలు పెట్టడానికి తయారు అవుతున్నారు మరి ఈ విధంగా జోరు చేస్తున్న బాబు తన ప్రత్యర్ధిగా ఎవరిని గుర్తించి విమర్శలు చేస్తారు అన్నది కూడా చర్చగా ఉంది. విషయానికి వస్తే తెలంగాణా సమస్యల మీద ప్రస్తుతం చంద్రబాబు కూదా ఎంతో కొంత అవగాహన పెంచుకోవాల్సిందే అంటున్నారు.
అలాగే అక్కడ ప్రజలకు తగిన విధంగా తన అజెండా సెట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది అని అంటున్నారు. ఇక తన మిత్రులు ఎవరో ప్రత్యర్ధులు ఎవరో బాబు తెలంగాణలో వరస మీటింగ్స్ తరువాతనే నిర్ణయానికి వస్తారు అని అంటున్నారు. బీజేపీతో కనుక పొత్తు కుదిరితే కచ్చితంగా బాబు బీయారెస్ ని టార్గెట్ చేస్తారు అని కూడా అంటున్నారు. అంతవరకూ తన పార్టీ గురించి మాత్రమే ఆయన చెప్పుకుంటూ సాగాల్సిందే అని అంటున్నారు.
ఇక ఏపీలో బీయారెస్ ని విస్తరించడానికి కేసీయార్ చూస్తున్నారు. ఏపీలో బీయారెస్ ఎంట్రీకి ఎలాంటి ఇబ్బందులు లేవు. ఎంచక్కా రావచ్చు. అదే టైం లో కేసీయార్ కి ఏపీ సమస్యల మీద కూడా అవగాహన పెంచుకోవాల్సిన అవసరం ఉంది. ఏపీలో కులాల వారీ రాజకీయం ఉంది. కులాల మధ్య సంకుల సమరం సాగే ఏపీ పాలిటిక్స్ ఒక పట్టాన కేసీయార్ కి చిక్కుతుందా అన్నది చూడాలి. రైతు అజెండా కూడా ఏపీలో సెట్ అయ్యే చాన్స్ లేదు.
ఇక రైతులకు వైసీపీ మేలు చేస్తోంది అలాగే వర్షాలు కూడా బాగా కురుస్తున్నాయి. దాంతో కేసీయార్ ఏపీలో వైసీపీని ప్రత్యర్ధిగా భావిస్తారా లేక బీజపీ మీద దండెత్తుతారా అన్నది కూడా క్లారిటీ రావాలి. ఇక ఏపీలో కేసీయార్ కి మిత్రులు ఎవరు ప్రత్యర్ధులు ఎవరు అన్నది కూడా ఇప్పట్లో తేలే వ్యవహారం కాదు. కమ్యూనిస్టులు తెలంగాణాలో బీయారెస్ తో ఉన్నట్లుగా కనిపిస్తోంది.
కానీ ఏపీ దాకా వచ్చేసరికి వారు వేరేగా ఉండే చాన్స్ కనిపిస్తోంది. అదే విధంగా ఏపీలో ఉన్న అనేక సమస్యల మీద కూడా కేసీయార్ ఏ విధంగా పోరాడుతారు అన్నది చూడాలి. ఇక విపక్షాలతో మైత్రికి కేసీయార్ ప్లాన్ చేస్తారా. వారు ఆయన్ని తమ వైపుగా రానిస్తారా అన్నది కూడా తేలాల్సి ఉంది. మొత్తానికి ఇద్దరు చంద్రులకు అటూ ఇటూ కూడా చాలా కసరత్తు చేస్తేనే తప్ప క్లారిటీ అయితే వచ్చే సీన్ లేదు అంటున్నారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.