Begin typing your search above and press return to search.
కర్నూలు కపట్రాళ్ల ఫ్యామిలీ వైసీపీలోకి వెళ్లిపోయింది
By: Tupaki Desk | 20 Jun 2023 12:03 PM GMTరెండు తెలుగు రాష్ట్రాల్లోని మరే జిల్లాలోను కనిపించని రాజకీయం ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఉంటుంది. అచ్చం సినిమాల్లో మాదిరి.. రాజకీయంగా ఉండే విభేదాల్ని వ్యక్తిగత ద్వేషంగా మార్చుకొని.. పగలు.. ప్రతీకారాలు తీర్చుకోవటమే కాదు.. చివరకు చంపుకోవటానికి.. చావటానికి అయినా వెనుకాడని తత్త్వం కనిపిస్తుంది. కర్నూలు ఫ్యాక్షన్ కు కేరాఫ్ అడ్రస్ గా నిలిచే కపట్రాళ్ల వెంకటప్పయ్య నాయుడు కుమార్తె తాజాగా వైసీపీ జెండా మెడలో వేసుకోవటం రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది.
ఎందుకంటే.. దశాబ్దాల తరబడి తెలుగుదేశం పార్టీలో ఉండటమే కాదు.. రాజకీయం తీసుకొచ్చి ప్రత్యర్థుల కారణంగానే కపట్రాళ్ల వెంకటప్పయ్యనాయుడు దారుణంగా హతమయ్యారు. వారి కుటుంబానికి ఫ్యాక్షన్ పట్టుకున్నది రాజకీయ విభేధాలతోనే.
అలాంటి కపట్రాళ్ల వెంకటప్పనాయుడి కుమార్తె బొజ్జమ్మ అలియాస్ సుశీలమ్మ ఆమె భర్త ఇద్దరు తాజాగా వైసీపీలో జాయిన్ అయ్యారు. తాడేపల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయంలో చేరిన ఈ చేరిక కర్నూలు రాజకీయాల్లో కీలక భూమిక పోషిస్తుందని చెబుతున్నారు.
తాజాగా చేరికతో కర్నూలు జిల్లా ఆలూరులో టీడీపీ కనుమరుగైనట్లేనని మంత్రి జయరాం వ్యాఖ్యానించటం గమనార్హం. 40ఏళ్లుగా టీడీపీలో ఉండి కష్టాలు.. నష్టాలు ఎదుర్కొన్న బొజ్జమ్మ దంపతులు వైసీపీలో చేరనిన.. కప్పట్రాళ్ల వెంకప్పనాయుడు బతికి ఉన్న రోజుల్లోనూ వారి కుటుంబాన్ని పట్టించుకోలేదన్నారు.
ఈ సందర్భంగా బొజ్జమ్మ మాట్లాడుతూ.. తన తండ్రిని చంపేసిన తర్వాత కూడా తాను టీడీపీకే పని చేసినట్లు చెప్పారు. తన తండ్రిని చంపినోళ్లను చంద్రబాబు పార్టీలో చేర్చుకున్నారని.. టీడీపీ కోసమే తన ఫ్యామిలీ బలైందన్న ఆమె.. 'ఇంత జరిగినా చంద్రబాబు పట్టించుకోలేదు. గుర్తించని పార్టీలో ఉండటం అవనవసరం. అందుకే బయటకు వచ్చేశాం' అని వ్యాఖ్యానించారు. ఆమె మాటలు పార్టీకి నష్టం వాటిల్లటం ఖాయమన్న మాట టీడీపీ నేతల్లో వ్యక్తమవుతోంది.